Nindu Noorella Saavasam Serial Today Episode: కిచెన్‌లో ఏదో ఆలోచిస్తూ వంట చేస్తున్న మిస్సమ్మ దగ్గరకు మనోహరి వెళ్తుంది. ఏంటి భాగీ చచ్చిపోయిన ఆరు కోసం అమరేంద్రతో చీవాట్లు బాగానే తింటున్నావు. ఎప్పుడూ కోప్పడని అమరేంద్ర నీ మీద చాలానే విసుక్కున్నాడు. ఇదంతా మీ అక్క ఆత్మను పైకి పంపించడం కోసమే కదా..? వార్డెన్ దగ్గకు వెళ్లి నా గురించి బాగానే తెలుసుకున్నావు. కానీ నన్ను ఏమీ చేయలేకపోయావు. నువ్వు రోజూ మాట్లడుతున్నది ఆత్మతో అని తెలుసుకున్నావు. ఆ ఆత్మ చనిపోయిన నీ సొంత అక్క అని తెలుసుకున్నావు. కానీ నన్నేమీ చేయలేకపోయావు. ఇప్పుడు మీ అక్క ఆత్మను పరలోకానికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు..
దాన్ని పైకి పంపించి నువ్వేం సాధించాలి అనుకున్నావు. దాని వల్ల నీకు మంచి జరుగుతుంది అనుకున్నావా..? మీ అక్క మళ్లీ పుట్టి నిన్ను ఉద్దరిస్తుంది అనుకుంటున్నావేమో..? పిచ్చి భాగీ జరగబోయేది ఏంటో నేను చెప్పనా..? నీకు చెడు.. నాకు మంచి.. ఇదే జరగబోయేది. నీకు జరిగే చెడు ఏంటంటే నీ అక్క ఆత్మ పైకి వెళ్లగానే నిన్ను బయటకు గెంటేస్తాను. అటు నుంచి అటే పైకి పంపిస్తాను. ఇక నాకు జరిగే మంచి ఏంటంటే.. నిన్ను పంపించాక నేను అమరేంద్రను పెళ్లి చేసుకుంటాను. ముచ్చటగా అమరేంద్రకు మూడో భార్యను అవుతాను.. ఇదే జరగబోయేది.. అంటుంది. మనోహరి దీంతో మిస్సమ్మ నవ్వుతుంది. ఎందుకే నవ్వుతున్నావు.. నేను ఏమైనా జోక్ చేశాను అనుకుంటున్నావా..? అని మను కోపంగా అడగ్గానే.. అవును జోకర్‌లా మాట్లాడుతున్నావు.. నన్ను పిచ్చి దాన్ని అని నువ్వు పిచ్చి దానిలా మాట్లాడుతున్నావు.. అనగానే మనోహరి ఏయ్ అంటూ అరుస్తుంది.
దీంతో మిస్సమ్మ కూడా కోపంగా ఏయ్ అరవకు చేయి దించు.. దించు.. ఏంటి ..? మా అక్కను చంపిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతాను అనుకున్నావా..? నేను మా అక్కలా మరీ అంత మంచిదాన్ని కాదు.. నేనేంటో మా అక్క ఆత్మ పైకి వెళ్లగానే నీకు తెలుస్తుంది అంటూ మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది. దీంతో మనోహరి కోపంగా ఏంటే ఏం చేస్తావే ఏం చేయగలవు నువ్వు అంటూ అడగ్గానే.. ఏం చేస్తానో ఏం చేయనో ఇప్పుడు చెప్పను చేసి చూపిస్తాను.. అని మిస్సమ్మ అనగానే ఆత్మ ఉండగా నీకు అండగా ఉండేదేమో అది పైకి పోయాక నువ్వేం చేయగలవే..? మీ అక్కనే చంపిన దాన్ని నిన్ను వదిలేస్తాను అనుకున్నావా..? నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అంటూ మనోహరి వార్నింగ్ ఇస్తుంది. మిస్సమ్మ కూల్‌గా వంద గొడ్లను తిన్న రాబంధు కూడా ఒక్క గాలి వానకు నేలకొరుగుతుంది. నీ పాలిట తుఫానును నేనే.. మా అక్క చావుకు ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను గాలిలో కలిపేస్తాను అంటూ మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది.
దీంతో మనోహరి ఏంటే శపథాలు చేస్తున్నావు.. నా గురించి తెలిసి కూడా నన్ను ఢీ కొడదామనుకుంటున్నావా..? నీ గురించి తెలిసింది కాబట్టే నిన్ను మట్టిలో కలిపేస్తాను అంటున్నాను.. నిన్ను చంపి మా అక్క ఆత్మకు నిజంమైన శాంతి చేకూరుస్తాను అంటుంది మిస్సమ్మ.. ఇంతలో రామ్మూర్తి అమ్మా భాగీ అంటూ వస్తాడు. చెప్పండి నాన్న అని మిస్సమ్మ అడగ్గానే.. పంతులు గారితో మాట్లాడాను అమ్మా రేపు కార్యానికి కావాల్సిన సరకుల లిస్టు రాసి ఇచ్చారు. నేను వెళ్లి అవి తీసుకొస్తాను అమ్మా అని చెప్పగానే.. అలాగే నాన్న మీరు రాథోడ్‌ను తోడుగా తీసుకెళ్లండి అని చెప్తుంది మిస్సమ్మ.. అలాగే అమ్మా అంటూ వెళ్లబోతూ.. ఇంతకీ మీ పిన్ని ఎక్కడ అమ్మా అని అడుగుతాడు రామ్మూర్తి.
తెలియదు నాన్న మీ తోనే ఉంది అనుకుంటున్నాను అని మిస్సమ్మ చెప్పగానే.. లేదమ్మా ఎక్కడికి వెళ్లి ఉంటుంది. సరే లే నేను చూస్తాను లే అంటూ రామ్మూర్తి వెళ్లిపోతాడు. అవును మంగళ ఎక్కడుంది అని మనోహరి మనసులో అనుకుంటుంది.ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.