Amaravati News: టీడీపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాజధాని ప్రాజెక్టులో కీలకమైన CRDA కొత్త కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించనున్నారు. ఉదయం 9.54 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ భవనం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీకి కేంద్రంగా పని చేయనుంది. ఆధునిక హంగులతో సీఆర్డీఏ భవనం తళతళలాడుతోంది.
మయ సభను తలపించేలా సీఆర్డీఏ ఆఫీసు
సోమవారం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా CRDA నూతన భవనం ప్రారంభంకానుంది. దాదాపు నాలుగున్న ఎకరాల విస్తీర్ణంలో 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం చేపట్టారు. భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ ‘A’ ఆకారం వచ్చేలా డిజైన్ చేశారు. 2017 లో ఈ భవనం పనులు మొదలయ్యాయి.
ఆ తర్వాత వైసీపీ హయాంలో ఆ భవనంతోపాటు రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్, పెండింగ్ పనులను వేగవంతం చేసింది. 8 నెలల్లో నిర్విరామంగా నిర్మాణ పనులు సాగాయి. ఇకపై నుంచి అమరావతి నుంచే కార్యకలాపాలు జరగనున్నాయి.
పర్యవేక్షణ అక్కడి నుంచే
ఏడు అంతస్తుల సీఆర్డీఏ భవనం నిర్మాణం 3 లక్షల చదరపు అడుగులను కలిగి ఉంది. అందులో ప్రధాన భవనం 0.73 ఎకరాలు ఉంది. గ్రీన్ జోన్‌గా 0.88 ఎకరాలు, పార్కింగ్ కోసం దాదాపు ఒకటిన్న ఎకరాలు, బహిరంగ స్థలాన్ని దాదాపు ఎకరం వరకు ఉంటుంది. మురుగునీటి శుద్ధి కోసం 0.39 ఎకరాలను ఉంచారు.
ఈ భవనంలో సీఆర్‌డీఏకు మూడు ఫోర్లు కేటాయించారు. కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఉండనుంది. 5 భారీ మీటింగ్ హాళ్లు ఉన్నాయి. అందులో ఏడీసీఎల్, సీడీఎంఏ, రెరా, డీటీసీపీ వాటికి ఆఫీసులు ఉండనున్నాయి. పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఆఫీస్, మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల కోసం స్థలం కేటాయించారు.
ALSO READ: విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు
సీఆర్డీఏ భవనం ఓపెనింగ్ సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే సోమవారం సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో బహిరంగ సభ అనుకోని కారణాల వల్ల వాయిదా పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమరావతి రైతులను ఆహ్వానించింది ప్రభుత్వం.
భవనాల లోపల ఏర్పాట్లు మయ సభను తలపించేలా ఉన్నాయి. లోపల ఎటు చూసినా విశాల ఆఫీసులు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా అమరావతిలో 54 వేల కోట్ల విలువైన 90 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వాటిలో 79 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మరో ఏడు ప్రాజెక్టులు టెండర్ ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా CRDA నూతన భవనం ప్రారంభం
రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉదయం 9.54 గంటలకు ప్రారంభం కానున్న CRDA నూతన భవనం
మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో 3.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవన నిర్మాణం
భవనం ముందు భాగంలో అమరావతి సింబల్ 'A' ఆకారం… pic.twitter.com/Fus3pgsjxb
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025