BigTV English

Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 9: 5 వారాలకు గానూ.. ఫ్లోరా, శ్రీజ దమ్ము ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 9:తెలుగు బిగ్ బాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 9లోకి ఈసారి ఏకంగా 9మంది సెలబ్రిటీలు, 6మంది కామనర్స్ అడుగుపెట్టారు. వరుసగా సామాన్యులను ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు పంపించడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మొదట మర్యాద మనీష్, ఆ తర్వాత ప్రియా శెట్టి, హరిత హరీష్ , ఇప్పుడు శ్రీజ ప్రతివారం కామనర్స్ హౌస్ నుండి బయటకు వెళ్లిపోవడంతో అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇకపోతే మొదటి రెండు వారాలలో శ్రీజను చూసిన జనాలు ఈమె ఎప్పుడు వెళ్ళిపోతుంది రా బాబు అనుకున్నారు. కానీ ఆమె తోపు కంటెస్టెంట్ గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.


డబుల్ ఎలిమినేషన్..

ఇకపోతే ఈసారి ఐదవ వారంలో ఏకంగా 6 మంది వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టడంతో ఈసారి ఇద్దరిని హౌస్ నుంచి పంపించేశారు. అందులో ఒకరు శ్రీజ కాగా.. మరొకరు ఫ్లోరా షైనీ. మొదటినుంచి తోటి కంటెస్టెంట్స్ తో పెద్దగా కలవకపోవడం, కెమెరా అటెన్షన్ లేకపోవడం.. ఇలాంటి పలు కారణాలవల్ల ఈమెను కూడా ఈ వారం హౌస్ నుంచి పంపించేశారు. ఇకపోతే దాదాపు 5 వారాలపాటు కొనసాగిన వీరిద్దరికీ ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు? అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి 5 వారాలకు గానూ వీరిద్దరూ ఎంత సంపాదించారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

శ్రీజ దమ్ము రెమ్యునరేషన్..

హౌస్ లో ఆడ పులి అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ గెలిచే ఇంటికి వస్తానని కొండంత ఆశలు పెట్టుకుంది. కానీ తోటి కంటెస్టెంట్ కారణంగా అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. ఒకరకంగా చెప్పాలి అంటే ఏ నోటితో అయితే ఈమెను తిట్టారో.. ఆ నోటితోనే ఆడ పులి అని అనిపించుకొని తన సత్తా చాటింది. కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఉన్న అందరిలాగే శ్రీజా కి కూడా ప్రతివారం రూ.70,000 మేరా రెమ్యూనరేషన్ అందింది. ఈ లెక్కన చూసుకుంటే 5 వారాలపాటు హౌస్ లో ఉంది కాబట్టి వారానికి 70,000 చొప్పున రూ.3.50 లక్షల మేర ఈమె పారితోషకం తీసుకున్నట్లు సమాచారం.


ALSO READ:Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

ఫ్లోరా షైనీ రెమ్యూనరేషన్..

ప్రముఖ హీరోయిన్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. బిగ్ బాస్ సీజన్ 9 లో మాత్రం పెద్దగా అటెన్షన్ క్రియేట్ చేయలేకపోయింది. దీంతో ఈ వారం ఈమె హౌస్ నుండి బయటకు వచ్చేసింది. 5 వారాలపాటు హౌస్ లో కొనసాగిన ఫ్లోరా షైనీ రెమ్యూనరేషన్ ఎంత అనే విషయానికి వస్తే.. వారానికి సెలబ్రిటీల కోటాలో.. రోజుకు 30,000 చొప్పున అంటే వారానికి 2.1లక్షల రెమ్యూనరేషన్ గా తీసుకున్న ఈమె.. ఐదు వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకుగాను మొత్తంగా రూ.10.5 లక్షలు సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఒక కామనర్ కి, ఒక సెలబ్రిటీకి మధ్య రెమ్యూనరేషన్ తేడా చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయా..రమ్య ఎమోషనల్!

Bigg Boss Buzzz Srija : నేను గ్రూపు దగ్గర కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోయే వాళ్ళు, ప్లాన్డ్ గా లవ్ యాంగిల్ నడిపాడు

Bigg Boss 9 Wild Card : తమిళ్ బిగ్ బాస్ లో 65 రోజులు ఉన్నా, ఈ లోపు నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో…

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ లోకి దువ్వాడ మాధురి. షాక్ అయిన హౌస్ మేట్స్, శ్రీజ తో ఆర్గ్యుమెంట్ మొదలు 

Bigg Boss 9 : మైండ్ చెదిరిపోయే ట్విస్టులు, డబుల్ ఎలిమినేషన్స్, వైల్డ్ ఫైర్ వైల్డ్ కార్డు ఎంట్రీస్

Bigg Boss 9 Wild Card : బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున ఫ్యామిలీ మెంబర్? ఇదెక్కడి ట్విస్ట్?

Bigg Boss 9 wild Card: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పచ్చళ్ళ పాప.. హౌస్ లోకి అడుగుపెట్టగానే రచ్చ!

Big Stories

×