Brahmamudi serial today Episode: కనకం, స్వప్నకు ఫోన్ చేస్తే రుద్రాణి లిఫ్ట్ చేస్తుంది. ఏదేదో మాట్లడుతుంది. దీంతో కనకం కోపంగా కాల్ కట్ చేస్తుంది. ఇంతలో స్వప్న వచ్చి రుద్రాణిని తిడుతుంది. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావు. అంటూ తిడుతుంది. మీ అమ్మ కాల్ చేసింది. ఎంత అవసరం ఉందో అని లిఫ్ట్ చేశాను అంటుంది. మరోవైపు కనకం బాధపడుతూ వరండాలో కూర్చుని ఉంటుంది. ఇంతలో అపర్ణ, ఇంద్రాదేవి వస్తారు. వాళ్లను చూసిన కనకం కంగారుగా లేచి వెళ్లి అసలు ఏంటి వదిన గారు ఇదంతా.. ఏం జరిగింది. ఎందుకు అది ఇంత సడెన్‌గా వచ్చేసింది. పైగా అల్లుడి గారితో కూడా కోపంగా మాట్లాడి పంపించేసింది. అసలు ఏం జరిగింది అని కనకం అడగ్గానే.. అపర్ణ నీకు చెప్పలేదా… అని అడుగుతుంది. చెప్పలేదు అని కనకం చెప్పగానే.. అయితే మాకు చెప్పలేదు అని ఇద్దరూ అంటారు.
దీంతో కనకం ఇందాకే కదా చెప్పడానికి మేము ఉన్నాము అన్నారు మళ్లీ ఇప్పడు ఏమీ తెలియదు అంటారేంటి..? అని అడుగుతుంది. దీంతో అప్పుడు అలా అన్నామా..? అయితే ఇప్పుడు ఇలా అంటున్నాము అని ఇద్దరూ కలిసి చెప్పగానే.. ఏంటమ్మా నా పరిస్థితి మీకు కామెడీగా ఉందా..? అసలు ఏం జరిగిందో తెలియక టెన్షన్ తో చచ్చిపోతుంటే.. మీ ఇద్దరేమో కామెడీ చేస్తున్నారా..? అసలు జరిగిందేంటో మీరైనా చెప్పండి అంటుంది కనకం. దీంతో ఇంద్రాదేవి ఇరిటేటింగ్ గా అబ్బబ్బా ఆ చెట్టు మీద కాకిలా అరుస్తావేంటే.. కాసేపు సైలెంట్‌గా ఉండలేవా..? అంటుంది. దీంతో కనకం ఏంటి నేను కాకిలా అరుస్తున్నానా..? అత్తారింటికి పంపించిన కూతురు చెప్పాపెట్టకుండా పుట్టింటికి వస్తే ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా..? అంటుంది కనకం దీంతో తర్వాత తెలుసుకుంటాం కానీ ముందు నా మనవరాలు ఎక్కడుందో చెప్పు దాన్ని అప్రిసియేట్ చేయాలి అంటుంది ఇంద్రాదేవి.
ఏంటి అప్ర.. అని పలకబోతుంటే.. కనకం నీకు పలకడం రాదులే కానీ ముందు నా కోడలు ఎక్కడుందో చెప్పు.. అని అపర్ణ అడగ్గానే.. లోపల ఉందమ్మా అంటాడు మూర్తి. దీంతో అందరూ లోపలికి వెళ్లిపోతారు. నీ నాటకం సక్సెస్ అయిందని రాజ్ చాలా కంగారు పడుతున్నాడని చెప్తారు. ఇది నాటకంలో భాగమని వాడికి తెలియదు కదా అపర్ణ అంటుంది ఇంద్రాదేవి. దీంతో కావ్య ఇది నాటకం కాదు అమ్మమ్మ నిజమే అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఏం అంటున్నావే అని అపర్ణ అడగ్గానే.. అవును అత్తయ్య గారు నేను నిజంగానే ఆ ఇంటి నుంచి వచ్చేశాను అని చెప్తుంది కావ్య. దీంతో అపర్ణ ఏం అంటున్నావే నీకేమైనా పిచ్చి కానీ పట్టిదా..? నిజంగా రావడం ఏంటి..? ఇదంతా వాడిని బయపెట్టడానికి నువ్ఉవ ఆడుతున్న డ్రామా కాదా..? అంటుంది. కాదు అత్తయ్య అని కావ్య చెప్పగానే.. ఉన్నపళంగా నువ్వు ఆ ఇంట్లోంచి వచ్చేయడానికి నీకు ఏమంత కష్టం వచ్చిందే.. అని ఇంద్రాదేవి అడుగుతుంది.
నాకు కష్టం వచ్చిందని రాలేదు అమ్మమ్మ గారు నా కారణంగా ఆ ఇంట్లో ఎవ్వరూ కష్టపడకూడదు బాధపడకూడదు అనే వచ్చేశాను. మా ఇద్దరి గొడవల కారణంగా అప్పు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు . అందుకే వచ్చేశాను. ఇప్పుడు మీరు ఆ గొడవలు ఇక్కడి దాకా తీసుకురాకండి అని కావ్య చెప్తుంది. దీంతో కనకం మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అడుగుతుంది. దీంతో అర్థం కాకపోవడానికి ఏముంది కనకం వాడు దీన్ని అబార్షన్ చేయించుకోమంటున్నాడు.. అని అపర్ణ చెప్పగానే.. కనకం, మూర్తి షాక్ అవుతారు. ఏంటి కడుపు తీసయించుకోమంటున్నారా..? అని కనకం అడుగుతుంది. దీంతో అవపర్‌ణ అవును కనకం వాడేమో దీని కడుపులో బిడ్డ వద్దు అంటున్నాడు. ఇది ఆ బిడ్డ కావాలి అంటుంది. దాని గురించే రోజూ గొడవలు జరుగుతున్నాయి. వాడెందుకు అబార్షన్ చేయించుకోమంటున్నాడో తెలుసుకోవడానికి విడాకులు అనే నాటకం ఆడింది. ఇప్పుడు ఇది కూడా నాటకం అనుకుంటే.. ఇది ఇలాంటి ట్విస్టు ఇస్తుందని అసలు అనుకోలేదు అని అపర్ణ చెప్పగానే..
మీ దగ్గరి నుంచి ఇలాంటి న్యూస్ వస్తుందని మేము ఊహించలేదు.. కావ్య అబార్షన్ చేయించుకోవడానికి మేము ఒప్పుకోము ఇప్పుడే పదండి అల్లుడు గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అడుగుతాను పదండి అంటుంది కనకం. దీంతో ఏంటి అడిగేది మాకు వాడు ఏం చెప్పట్లేదు నువ్వు అడిగితే చెప్తాడా..? అంటుంది ఇంద్రాదేవి.. కావ్య బాధపడుతూ లోపలికి వెళ్తుంది. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటే.. రాజ్, కావ్యకు ఫోన్ చేసి నువ్వు వెళ్లిన దగ్గర నుంచి అమ్మ నీ మీద బెంగ పెట్టుకుని పచ్చి మంచినీళ్లైనా ముట్టడం లేదు అని చెప్తాడు నువ్వు వెళ్లిన షాక్‌లో నాన్నమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది అంటూ చెప్పగానే.. అందరూ నవ్వుకుంటారు. రాజ్ మాత్రం త్వరగా రా కళావతి అంటాడు. ఆ మాత్రం దానికి రావడం దేనికి వీడియో కాల్ చేస్తే సరిపోతుంది కదా అంటూ వీడియో కాల్ చేస్తుంది. పక్కనే ఉన్న అపర్ణ, ఇంద్రాదేవిలను చూపిస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు. వెంటనే కాల్ కట్ చేస్తాడు.
రాజ్, కావ్యల గొడవను మీడియాకు తెలిసేలా చేయాలని అప్పుడే ఈ ఇంటి పరువు పోతుందని రుద్రాణి, రాహుల్‌కు చెప్తుంది. వెంటనే ఆ పని చేయమని రాహుల్ కు చెప్తుంది. రాహుల్ సరే అంటాడు. మరోవైపు దిగాలుగా కూర్చున్న కావ్య దగ్గరకు మూర్తి వెళ్లి ఓదారుస్తాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.