Serial Actress : బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో ముందుగా వినిపించేది సీరియల్స్.. ఈ సీరియల్స్ ద్వారా ఎంతోమంది హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అలాంటివారు ఒక వైపు సీరియల్స్ చేస్తూ మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. బుల్లితెరపై టాప్ యాక్టర్స్ గా ఉన్న పలువురు తమకు వచ్చి రెమ్యూనరేషన్ ని పలు వ్యాపారాలలో పెడుతూ సక్సెస్ అవుతున్నారు.. బిజినెస్ లో చేస్తూ దూసుకుపోతున్న బుల్లితెర యాక్టర్స్ ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఒకప్పుడు సీరియల్స్లలో నటించి బాగా ఫేమస్ అయినా ముద్దుగుమ్మ అనన్య.. ప్రస్తుతం ఈమె సీరియల్స్కి దూరంగా ఉన్నారు. పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయినా ఈమె ఇక్కడ ధాత్రి బోటిక్స్ స్టార్ట్ చేశారు. తన చెల్లెలు అన్షు రెడ్డి సాయంతో ఆ బిజినెస్ ని ముందుకు తీసుకెళుతున్నారు..
కార్తీకదీపం సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యాక్టర్ శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోనిత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈమె బిగ్ బాస్ లోకి కూడా అడుగుపెట్టి తన ఆటిట్యూడ్ తో బాగానే ఆకట్టుకుంది. ఇది హౌస్ లో పాజిటివ్ టాక్ కన్నా నెగిటివ్ టాక్ ని మూట కట్టుకుంది. దాని వల్లే ఈ మధ్య సీరియల్స్ చేయడం లేదంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుంది. అలాగే కొన్ని షాపింగ్ మాల్స్ ప్రమోషన్స్ కూడా చేస్తూ వస్తుంది. వీటితోపాటుగా రీసెంట్గా శోభా శెట్టి డిజైనర్ స్టూడియోని స్టార్ట్ చేసింది..
బుల్లితెర యాక్టర్ మేఘన గురించి అందరికీ తెలుసు.. సీరియల్ హీరో ఇంద్రనీల్ భార్య.. ఈమధ్య సీరియస్లలో కనిపించకపోయినా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ వస్తున్నారు. అంతేకాదు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల వంటలను పరిచయం చేస్తున్నారు. ఈమె కేవలం వంటలను పరిచయం చేయడం మాత్రమే కాదు ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. నా భర్త సాయంతో కొత్త వంటలను పరిచయం చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగిస్తున్నారు.
బుల్లితెర యాక్టర్ స్రవంతి అందరికీ సుపరిచితమే.. ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఎంవిఎస్ ఫ్యాషన్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా బాగానే సంపాదిస్తున్నారు..
ఇంటింటి రామాయణం ఫేమ్ అవని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అసలు పేరు పల్లవి రామిశెట్టి. ప్రస్తుతం బుల్లి తనపై పలు సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈమె సంపాదిస్తున్న డబ్బులను వ్యాపారాల్లో పెడుతూ సక్సెస్ ని అందుకుంది.
Also Read: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నర్మద అలాంటి పని చేస్తుందా..? లక్షల్లో ఆదాయం..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సీరియల్ యాక్టర్స్ పలు రకాల బిజినెస్ లు చేస్తూ బిజీగా ఉన్నారు. కొంతమంది ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెడితే.. మరికొంతమంది ఫుడ్ బిజినెస్ చేస్తూ సక్సెస్ అయ్యారు. అయితే వ్యాపారాలు చేస్తున్నా సీరియల్స్ మాత్రం వదలడం లేదు.