SLW vs NZW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకే 14 మ్యాచ్ లు పూర్తయ్యాయి. నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరగగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. 15వ మ్యాచ్ లో భాగంగా శ్రీలంక మహిళల వర్సెస్ న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరగనుంది. కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. టాస్ ప్రక్రియ మాత్రం రెండున్నరకే ఉంటుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పిచ్ కండిషన్స్ ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. ఇక శ్రీలంక తన చిత్త చివరి ఐదు వన్డే మ్యాచ్ లలో నాలుగు ఓడగా ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. అది కూడా తన చిట్టచివరి మ్యాచ్ లో విజయం సాధించింది శ్రీలంక. అటు న్యూజిలాండ్ విషయానికి వస్తే తన గత ఐదు మ్యాచ్ లలో మూడు విజయాలు, రెండు అపజయాలు ఉన్నాయి. చివరి మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ విజయం సాధించింది.
పాయింట్ల పట్టిక విషయానికి వస్తే, మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్లో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో ఏడు పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇంగ్లాండు ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా సౌత్ ఆఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇక నాలుగు పాయింట్లు టీమిండియా ఫోర్త్ పొజిషన్ లో ఉంది. న్యూజిలాండ్ 5 అలాగే బంగ్లాదేశ్ ఆరు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక అలాగే పాకిస్తాన్ చిట్ట చివరన నిలిచాయి.
శ్రీలంక అంచనా: 1 హాసిని పెరెరా, 2 చమరి అతపత్తు (కెప్టెన్), 3 హర్షిత్ సమరవిక్రమ, 4 విష్మి గుణరత్నే, 5 కవిషా దిహారి, 6 నీలక్షికా సిల్వా, 7 అనుష్క సంజీవని (వికెట్ కీపర్), 8 దేవ్మీ విహంగ/ఏచికి కుమారిక, కుమారి 9 10 ఉదేశిక ప్రబోధని, 11 ఇనోకా రణవీర
న్యూజిలాండ్ అంచనా: 1 సుజీ బేట్స్, 2 జార్జియా ప్లిమ్మర్, 3 అమేలియా కెర్, 4 సోఫీ డివైన్ (కెప్టెన్), 5 బ్రూక్ హాలిడే, 6 మాడీ గ్రీన్, 7 ఇసాబెల్లా గాజ్ (వికెట్ కీపర్), 8 జెస్ కెర్, 9 రోజ్మేరీ మెయిర్, 10 లీ తహుడెన్ కార్, 10 లీ తహుడెన్,