Illu Illalu Pillalu Today Episode October 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. అక్కడికి వచ్చిన వేదవతి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ కోడలు గారు అని అడుగుతుంది. ప్రేమ ధీరజ్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయమని చెప్పింది అందుకే అది చేస్తున్నాను అత్తయ్య అని నర్మదా అంటుంది. వేదవతి డ్రెస్సులు సెలెక్ట్ చేయాలంటే నా హ్యాండ్ కూడా ఉండాల్సిందే అనేసి అంటుంది. జీన్స్ టీ షర్టు అని నర్మదా అంటే అది కంఫర్ట్ గా లేదని ప్రేమ అంటుంది. మొత్తానికి ప్రేమ లంగా హోణిలో అద్భుతంగా ఉందని ఫిక్స్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ కళ్యాణ్తో దిగిన ఫోటోలు గురించి తన పుట్టింటి వాళ్లకు ఎవరు చెప్పారు కచ్చితంగా తెలుసుకోవాలని వేదవతి అనుకుంటుంది.. నర్మద కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని కచ్చితంగా అసలు వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. మొదటినుంచి వల్లి మీద డౌట్ ఉన్న సరే.. తనకు అంత సీన్ లేదని లైట్ తీసుకొని నర్మదా తానే ఇది చేసింది అని తెలుసుకుని ప్రయత్నం చేస్తుంది..
పార్టీలో మాజీ ప్రియురాలు ఐశ్వర్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకొని తనని తానే మర్చిపోతాడు. పక్కనే ఉన్న ప్రేమ మాత్రం ఎవరు ఏంటి ఇంత ఓవరాక్షన్ అని అడుగుతుంది. తను నా పాత ఫ్రెండ్ ఐశ్వర్యాన్ని ప్రేమకు పరిచయం చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నిజంగానే వీళ్లిద్దరు లవర్సా ఏంది ధీరజ్ ని ఎలాగైనా సరే నా వైపు తిప్పుకోవాలని అనుకుంటుంది. ధీరజ్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తే తన ఫ్రెండ్స్ తనని ఆట పట్టిస్తారు.
ఐశ్వర్య ప్రేమ దగ్గరకు వచ్చి ధీరజ్ నాకు ప్రపోజ్ చేశాడో తెలుసా అని అంటుంది. అప్పుడు ఎప్పుడో చేసాడు కదా ఇప్పుడు నేను ఆయన భార్యని అని ప్రేమ అంటుంది.. ధీరజ్ ది మంచి టేస్ట్ అనుకున్నారు కానీ యావరేజ్ గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు అని ఐశ్వర్య కావాలనే వీరిద్దరి మధ్య గొడవలు క్రియేట్ చేసేలా మాట్లాడుతుంది. ప్రేమ ఏ మాత్రం తగ్గకుండా ఐశ్వర్య కు కౌంటర్లు వేస్తోంది.
ఇక నర్మదా తిరుపతిని అడ్డుపెట్టుకొని ప్రేమ ఫోటోల విషయము ఎదురింటి వాళ్ళకి ఎవరు చెప్పారు తెలుసుకోవాలని అనుకుంటుంది. తిరుపతి నీ వాళ్ళ ఇంటికి పంపించి కావాలనే అసలు నిజమే బయటకు రప్పించేస్తుంది. ఇక తిరుపతి కూడా వాళ్ళఇక తిరుపతి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తన సొంతవాళ్లు బాధపడకూడదు అని నిజం చెప్తున్నాను అంటూ నాటకం ఆడి మరి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుసుకున్నాడు. అదే విషయాన్ని వెళ్లి నర్మదకు చెప్తాడు. తిరుపతి చెప్పిన మాట విని నర్మదా ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Also Read : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..
ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధీరజ్ తో ఐశ్వర్య డాన్స్ వేయడం చూసిన ప్రేమ కుళ్లుకుంటుంది. తన ఫ్రెండ్స్ ప్రేమ చేత కావాలని మందు తాగిస్తారు. ధీరజ్ దగ్గరికి వెళ్లిన ప్రేమ నువ్వు నాతోనే డాన్స్ చేయాలి ఎందుకంటే నేను నీ భార్యను కాబట్టి అని ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తారు. వీరి డాన్స్ ఎపిసోడ్కి హైలెట్గా మారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజ్ మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.. సోమవారం ఎపిసోడ్ లో వల్లికి నర్మద చెక్ పెట్టబోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..