Intinti Ramayanam Today Episode October 4th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంట్లో దసరా కోసం విగ్రహాన్ని తీసుకుని వస్తారు కమల్ భరత్.. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నావు కదా అన్నయ్య ఆ డబ్బులన్నీ దేవుడి దగ్గర పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు అంత మంచే జరుగుతుందని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చాను నువ్వు కూడా ఈ విగ్రహాన్ని పట్టుకొని అక్కడ పెట్టు అని కమలంటాడు.. ఇక పార్వతి కూడా అవును రా నువ్వు దేవుడి దగ్గర ఆ డబ్బులను పెట్టి పూజ చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది. ఇంట్లోకి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్షయ్ పూజకి ఏర్పాటు చేస్తున్న స్థలంలో పెడతారు. తర్వాత అమ్మవారిని అలంకరించిన అవని అందరికీ పండగ పూట బట్టలు తెచ్చేస్తుంది. ఆ బట్టల్ని చూసినా పల్లవి ఏంటి అక్క నువ్వు ఇంట్లో పనిమనిషికిచ్చే అంత విలువలో కూడా బట్టలు తెచ్చి ఇవ్వలేదు అని గొడవ పెడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ కి ఇచ్చిన డబ్బులు పోవడంపై ఇంట్లో అందరి మీద అనుమానం మొదలవుతుంది. ఆ డబ్బులు ఎవరు తీశారు అని అనుకుంటూ ఉండగానే పల్లవి మన ఇంట్లో వల్లే తీసి ఉంటారు ఇంట్లోనే ఆ డబ్బులు ఉంటుంది వెతకండి అని అంటుంది. మన ఇంట్లో వాళ్ళు ఎవరు బయటకు వెళ్లలేదు కాబట్టి డబ్బులు ఎక్కడ ఒక చోట ఉంటాయి వెళ్లి వెతుకుదాం పదండి అని పల్లవి తన మీద నింద రాకుండా వెతుకుతుంది. ముందుగా అక్షయ్ రూమ్ లో డబ్బులను ఎంత వెతికినా సరే కనిపించవు..
అందరి రూమ్ లో ఒకసారి వెతుకుదాం పదండి అని పల్లవి ముందుగా ప్రణతి రూమ్ లోకి వెళుతుంది. అక్కడ కమల్ ఎంత చెప్పినా సరే పల్లవి ఈ గదిలో అన్ని గదిలో వెతుకుదాం ఒకవేళ ఎవరైనా తీస్తే ఇక్కడే ఉంటుంది కదా అని అంటుంది. అయితే ప్రణతి రూంలో బీరువాలో డబ్బులను చూసి కమల్ షాక్ అవుతాడు. అక్షయ్ రూంలో ఉండాల్సిన డబ్బులు ఇక్కడ ఉన్నాయి ఏంటి అని అందరూ షాక్ అవుతారు. వాటిని చూసిన అందరూ కూడా భరత్ ఆ డబ్బులు తీసి ఉంటారని అనుమానపడతారు.
పల్లవి అక్షయ్ భరత్ ని ఎంతగా కొడుతున్నా సరే నిజం చెప్పద్దని చెప్తుంది. చక్రధర్ చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని భరత్ ఆ విషయాన్ని నిజం చెప్పడు. మా తమ్ముడిని దొంగ అంటే నేను అసలు ఒప్పుకోను అని అవని అంటుంది. నా తమ్ముడు డబ్బులు తీసాడని ఏంటి సాక్ష్యం అని అవని అంటుంది. ఇలాంటి బికారి గాడికి నా చెల్లెల్ని ఇవ్వద్దన్న సరే నువ్వు ఇచ్చావు రూపాయి కూడా గతి లేని వీడికి 50 లక్షలు ఎలా వచ్చాయి వీడే దొంగతనం చేసి ఉంటాడు అని అక్షయ్ అంటాడు. రాజేంద్రప్రసాద్ పార్వతి కూడా అవని నీకు ఏదో ఒక జాబ్ చూపిస్తానన్నా కూడా వద్దని అన్నావు. ఒకవేళ డబ్బులు కావాలని అడిగితే అక్షయ్ లాగే నీకు కూడా డబ్బులు ఇచ్చి ఏదో ఒకటి పెట్టించే వాళ్ళం కదా అని అంటారు.
ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని పార్వతి అంటుంది. ప్రణతి భరత్ ని ఎంతగా వెనకేసుకొనొస్తున్నా సరే భరత్ మాత్రం అసలు నిజాన్ని బయట పెట్టడు. పల్లవి అవని అక్కని తన తమ్ముడికి డబ్బులు ఇచ్చి ఉంటుంది అని అంటుంది. ఇక భరత్ ఆ డబ్బులు నావే నేనే బిజినెస్ కోసం అని దాచుకున్నాను అని డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు భరత్ ఇలా చేస్తున్నాడు అని అందరూ ఆలోచిస్తున్నారు. శ్రీయా, పల్లవి ఇద్దరు కూడా అవని అడ్డంగా దొరికిందని నానా మాటలు అనేస్తారు.
Also Read: ప్రభావతికి కడుపు మంట.. సత్యం, బాలు దెబ్బకు ఫ్యూజులు అవుట్.. మీనా ఎక్కడ?
నువ్వు నీ తమ్ముడికి డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఆ డబ్బులు ఎవరూ ఇచ్చారు అని అందరూ అవనిని అడుగుతారు. నువ్వే ఆ డబ్బులు ఇచ్చావని అంటే శ్రేయ పల్లవి నోరు మూసుకునే వాళ్ళు కదా అని రాజేంద్రప్రసాద్ అవనితో అంటాడు. అక్షయ్ అసలు డబ్బులు పోయినందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లే చూసుకుంటారు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..