Madhya Pradesh Crime: అక్రమ సంబంధాలు మానవ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఫలితంగా క్రూరంగా చంపేసుకుంటున్నారు. నిండు నూరేళ్లు జీవితాల్సిన వారు వేగంగా ఈ లోకాన్ని వదిలిపోతున్నారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం రేపుతోంది. ప్రియురాలు మరొకరితో రిలేషన్ షిప్‌లో ఉందని తెలుసుకున్న ప్రియుడు, యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో డీటేల్స్ లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లో దారుణం
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. 22 ఏళ్ల లక్షిత చౌదరిని ప్రేమిస్తున్నాడు 35 ఏళ్ల మనోజ్ చౌహన్. వీరిద్దరి మధ్య ఎన్నాళ్ల నుంచి రిలేషన్ షిప్ ఉందో తెలీదు. లేకుంటే వన్ సైడ్ ప్రేమ అనేది తెలీదు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని డిసైడ్ అయ్యాడు.
ప్రియురాలి కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీ ఎవరికీ కనిపించకుండా డ్రమ్ములో వేశాడు ఆమె ప్రియుడు మనోజ్. పైగా ఏమీ తెలీనట్టు వ్యవహరించాడు. హత్య తర్వాత నిందితుడు దేవాస్ నుండి ఉజ్జయిని, ఢిల్లీ నుంచి చివరకు భోపాల్ వరకు ట్రావెల్ చేశాడు. చేసిన తప్పు వెంటాడుతూనే ఉంది. చివరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పెళ్లి కాకుండే ప్రియురాలిపై అనుమానం
సెప్టెంబర్ 29న లక్షిత చౌదరి కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పింది. సాయంత్రం అయినా ఇంటికి రాలేదు. స్నేహితులతో బయటకు వెళ్లిందని తల్లిదండ్రులు భావించారు. గడియారంలో గంటల ముళ్లు చకచకా తిరుగుతోంది. అయినా కూతురు ఇంటికి రాలేదు. మూడు రోజులు కావడంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది.
అర్థరాత్రి గడిచినా రాకపోవడంతో తల్లిదండ్రుల్లో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. మరుసటి రోజు ఉదయం సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాలేజీకి వెళ్లిన తమ కూతురు కనిపించలేదని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత దర్యాప్తులో నిమగ్నమయ్యారు పోలీసులు.
ALSO READ: లారీ బీభత్సం.. కారు నుజ్జు నుజ్జు , ఎంతమందంటే
మనోజ్ చౌహన్ వైశాలి అవెన్యూ కాలనీలోని అద్దెకు ఉంటున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి ఇంటి తాళాన్ని పగులగొట్టారు. భరించలేదని దుర్వాసన రావడంతో షాకయ్యారు.గార్బా డ్రెస్ వేసుకుని చేతులు-కాళ్ళు డ్రమ్ములో లక్షిత చౌదరి మృతదేహాన్ని కనుగొన్నారు.
యువతి డెడ్‌బాడీ దొరికింది.. చంపిందెవరు? అనేదానిపై కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈలోగా మనోజ్ చౌహన్ పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. చేసినదంతా విడమరిచి చెప్పాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, కానీ లక్షిత మరొకరితో రిలేషన్ షిప్ పెట్టుకుందని వివరించాడు. ఆ కోపంతో దారుణంగా హత్య చేసినట్లు అంగీకరించాడు.
బెంబేలెత్తిస్తున్న బ్లూ డ్రమ్స్ హత్యలు
లక్షిత కాళ్లు-చేతులు కట్టేసి ఆ తర్వాత నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆమె శరీరాన్ని షీట్‌తో కప్పి గదికి తాళం వేసి పారిపోయానని చెప్పాడు. శుక్రవారం సాయంత్రం నిందితుడ్ని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. తదుపరి విచారణ కోసం అక్టోబర్ 8 వరకు పోలీసు రిమాండ్‌కు విధించింది.
పోస్టుమార్టం నిమిత్తం లక్షిత మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడాడు. ఆడ పిల్లలు ఇలాంటి నేరానికి గురవుతారని, నిందితుడికి మరణశిక్ష పడుతుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బ్లూ డ్రమ్‌కు సంబంధించిన హత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. తొలుత మీరట్, రాజస్థాన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ వంతైంది.