Nindu Noorella Saavasam Serial Today Episode: అమ్ము, ఆనంద్, ఆకాష్ చదువుతుంటారు. అంజు మాత్రం ఏదో ఆలోచికస్తుంది. ఇంతలో అమ్ము కోపంగా ఏయ్ అంజు హోం వర్క్ చేయవా…? స్కూల్ కు వెల్లాలని లేదా హోం వర్క్ చేయకుండా తెగా ఆలోచిస్తున్నావు అంటుంది. దీంతో నేను ఆలోచిస్తుంది హోం వర్క్ గురించి కాదు. మన హోంలో జరుగుతున్న మిస్టరీ గురించి అని చెప్తుంది. దీంతో ఆనంద్ నువ్వు ఇకా దాని గురించే ఆలోచిస్తున్నావా..? వదిలేయ్ అంజు అంటాడు. దీంతో అంజు నో ఆ మిస్టరీని సాల్వ్ చేసే వరకు వదిలిపెట్టను అంటుంది. దీంతో ఆకాష్ అవును మరి నువ్వు పెద్ద డిటెక్టివ్‌వి ఎక్కువగా ఆలోచించకు అంజు ముందు హోం వర్క్ చేయ్ అని చెప్తాడు.
దీంతో అంజు కోపంగా అబ్బా నేను చెప్పేది అసలు వినరేంటి..? నైట్ మిస్సమ్మ మాట్లాడింది కచ్చితంగా ఆత్మతోనే.. ఆ విషయం మనకు చెప్పకుండా మిస్సమ్మ దాస్తుంది అంటుంది. దీంతో అమ్ము కోపంగా అంజు నీకు పిచ్చి పట్టిందే. ముందు నువ్వు టీవీలో ఆ ఘోస్ట్ మూవీస్ చూడటం మానేయ్ అని చెప్తుంది. ఆనంద్ కూడా అవును అంజు నువ్వు ఘోస్ట్ మూవీస్ చూడట వల్లే ఇలా మాట్లాడుతున్నావు.. అంటాడు . వెంటనే నువ్వు ఆ మూవీస్ చూడటం ఆపేయ్ లేదంటే డాడీకి చెప్తాను అంటాడు ఆకాష్.. దీంతో అంజు అబ్బా నాకేం పిచ్చి పట్టలేదు.. దయ్యాల సినిమాలు చూసి చెప్పడం లేదు. ఆత్మలు ఉన్నాయని అమ్మ ఆత్మ ఉందని స్వామిజీ చెప్పారు కదా..? మిస్సమ్మ మాట్లడుతుంది ఆత్మతోనే అది మన అమ్మ ఆత్మతోనే.. అంటుంది..
దీంతో అమ్ము సరే సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అమ్మ కనిపిస్తే మన అందరికీ కనిపించాలి కానీ మిస్సమ్మకే కనిపించడం ఏంటి..? అని అడుగుతుంది. ఆనంద్ కూడా అంజు అమ్మ డాడీకి కనిపించకపోతే మనకు కనిపించాలి కానీ మిస్సమ్మకే ఎందుకు కనిపిస్తుంది అని అడుగుతాడు. ఆకాష్ కూడా అమ్మకు డాడీ కన్నా మనకన్నా మిస్సమ్మ ఎక్కువ కాదు కదా అంజు ఆ లాజిక్ ఎలా మిస్ అవుతావు నువ్వు అనగానే.. నేను లాజిక్ మిస్ అవ్వలేదు.. ఆ పాయింటే ఆలోచిస్తున్నాను.. డాడీకి మనకు కనిపించని అమ్మ మిస్సమ్మ ఒక్కదానికే ఎందుకు కనిపిస్తుంది అని అడగ్గానే.. ఎందుకంటే నీ బుర్రలో పురుగు తిరుగుతుంది కాబట్టి అమ్మ ఎవ్వరికీ కనిపించలేదు అది నీ భ్రమ.. అంటుంది అమ్ము.. ఆనంద్ కూడా అనవసరంగా పిచ్చి పిచ్చి ఊహలు ఊహించుకోకు అంజు నీ ఏజ్‌కు అది సూట్ కాదు.. అంటాడు.
నా మాట విను నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని తెలిస్తే డాడీ తిడతాడు. ఆ విషయం వదిలేయ్.. అంటాడు ఆకాష్. దీంతో అంజు కోపంగా నో నేను ఒకటి అనుకుంటే అసలు వదిలిపెట్టను.. డాడీ ఏమీ అనరు.. మిస్సమ్మ అమ్మ ఆత్మతోనే మాట్లాడుతుందని నేను ప్రూవ్ చేస్తాను అంటుంది. అమ్ము, ఆకాష్, ఆనంద్ నవ్వుకుంటూ చూస్తారు. తర్వాత మిస్సమ్మ బాధగా రామ్మూర్తి ఇంటికి వెళ్తుంది. రామ్మూర్తిని చూసి ఏడుస్తూ మీకు అక్క గురించి తెలిసే ఉంటుంది కదా నాన్న అంటూ రామ్మూర్తిని అడుగుతుంది.
రామ్మూర్తి మౌనంగా చూస్తుంటాడు. మీకు అక్క గురించి తెలిస్తే చెప్పండి నాన్నా.. అక్కను చూడాలని ఉంది.. నాన్న అసలు అక్క ఉందా..? లేదా..? అదైనా చెప్పండి నాన్న అంటూ మిస్సమ్మ ఏడుస్తూ గోడ మీద ఆరు ఫోటో చూస్తుంది. నాన్న ఆ ఫోటో ఏంటి అని అడుగుతుంది. రామ్మూర్తి షాక్ అవుతాడు. అంటే ఆరు అక్కే అక్కా… అంటూ ఆరుతో తను గడిపిన రోజులు మాట్లాడిన మాటలు, ఆడిన ఆటలు గుర్తు చేసుకని ఎమోషనల్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.