Janhvi kapoor:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) , ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. అతి తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. బాలీవుడ్లో వరుస సినిమాను చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇటు టాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ (NTR)హీరోగా, కొరటాల శివ (Koratala shiva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ కి అరంగేట్రం చేసి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో అవకాశం అందుకుంది. అలాగే నానీ (Nani) హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో “ఇన్ సైడర్ వర్సెస్ అవుట్ సైడర్” చర్చ ఎప్పటినుంచో జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై జాన్వీ కపూర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ..” సినిమా నేపథ్యం లేని ఔట్ సైడర్స్ తమ కష్టాలను చెబితే అందరూ వింటారు. కానీ స్టార్ కిడ్స్ మాత్రం వారి ఇబ్బందుల గురించి మాట్లాడితే ఎవరు పెద్దగా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా తమ కష్టాలను ఇతరులు అర్థం చేసుకోరనే విషయం స్టార్ కిడ్స్ కి తెలుసు. కాబట్టి వారు తమ ఇబ్బందుల గురించి ఎక్కడ చెప్పరు” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.
ALSO READ:Star Singer: స్టార్ సింగర్ కు నాలుగేళ్ల జైలు శిక్ష.. డ్రగ్స్ మత్తులో అమ్మాయిలతో అలా!
వారికి గట్టి కౌంటర్ ఇచ్చిందిగా..
మొత్తానికైతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కష్టం అనుభవించాల్సిందే. కాకపోతే స్టార్ కిడ్స్ కి బ్యాక్ గ్రౌండ్ ఉంటుందని.. అవుట్ సైడర్స్ కి కష్టం వస్తే ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు అని నెటిజన్స్ కూడా అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారికి అవకాశాలు ఇవ్వరు అని.. స్టార్ కిడ్స్ కి అవకాశాలు ఎక్కువగా ఇస్తారని.. వాళ్లే తమను తొక్కేస్తున్నారు అని నాని ని మొదలుకొని మృణాల్ ఠాగూర్ (Mrunal Thakur) వరకు చాలా మంది తమ ఆరోపణలను వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారందరికీ గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది జాన్వీ కపూర్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న జాన్వీ కపూర్..
గత కొన్ని రోజులుగా ఈమెకు బాలీవుడ్ లో సినిమాలు కలిసి రావడం లేదు అని చెప్పాలి. పరమ్ సుందరి, హోమ్ బౌండ్, ఇప్పుడు సన్నీ సంస్కారికీ తులసీ కుమారి చిత్రాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.