Gundeninda GudiGantalu Today episode October 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాయంత్రం అయిన మీనా ఇంటికి రాకపోవడంతో ప్రభావతికి కడుపు మంట ఉంటుంది. అది మొత్తం మీనా పై కక్కేస్తుంది. రోహిణి నేనే మీ అందరికి ఏదొక కర్రీ చేస్తాను అని అంటుంది. దానికి బాలు ఏబీసీ జ్యూస్ లాగా సాంబార్ కూడా చేస్తూనేమో అమ్మ అమ్మవతి తినే సి హ్యాపీగా పడుకో నిద్రపో అని బాలు అంటాడు. అయితే సత్యం రవి శృతి బాలు మీనా ఎక్కడికి వెళ్లినా అని టెన్షన్ పడుతుంటారు. అదేంటి మీనా ఇంతకైనా ఇంకా రాకపోవడం ఏంటి ఏం జరుగుంటుంది అని సత్యం అడుగుతాడు. అప్పుడు మీనా గురించి అసలు నిజం చెప్తాడు బాలు. మీనా ఎంతో కానీ బాధపడితే ఇంట్లోంచి ఎలా వెళ్ళిపోదు అని సత్యం అంటాడు.. అంత అమ్మవల్లే జరిగింది నాన్న అని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మీనా ఇంట్లో లేకపోవడంతో బాలు టెన్షన్ పడుతూ ఊరంతా వెతుకుతూ ఉంటాడు. సుమతికి ఫోన్ చేసి మీనా ఉంటే ఇవ్వు అని అడుగుతాడు. అక్కడ లేకపోవడంతో బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కకి ఏదో అయిందని శివ టెన్షన్ పడుతూ ఉంటాడు. కచ్చితంగా వాడే అక్కని ఏదో చేసి ఉంటాడు అని శివ అంటాడు. ఇదో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రోహిణి చేసిన వంటని మెచ్చుకుంటూ అందరూ తింటూ ఉంటారు. రోహిణి చేసిన వంటకి అందరూ షాక్ అవుతారు.
శృతి మాత్రం నచ్చలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వంటలు చూసి భయపడిపోయి సత్యం నేను అసలు తినను అని అంటాడు. ప్రభావతి రోహిణి వంట చేసింది తిని ఎలా ఉందో చెప్పండి అని అంటుంది. అందరూ సత్యం నీ తినడానికి పిలుస్తారు. మీనా ఇంటికి రాలేదని మీకు ఎవరికీ టెన్షన్ లేదు కదా.. మీనా ఎక్కడికి వెళ్లిందో నాకు చెప్పి వెళ్లిందా నేను ఆగడానికి అని ప్రభావతి అంటుంది. కోడలు ఎక్కడికి వెళ్లిందో టెన్షన్ నీకు లేదు కానీ నాకు ఉంది అని ప్రభావతి పై సీరియస్ అవుతాడు సత్యం.
అప్పుడే ఇంట్లోకి వచ్చిన బాలుని మీనా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందేమో అడగరా అని అడుగుతాడు. అయితే అక్కడ కూడా లేదు నాన్న నేను ఫోన్ చేసి అడిగాను. అని బాలు అంటాడు. నువ్వు ఇంకా పెళ్లి గురించి మర్చిపోవరానువ్వు ఇంకా పెళ్లి గురించి మర్చిపోవరా ఆ మాటకే మీనా బాధపడి ఎక్కడికో వెళ్లినట్టు ఉంది అని సత్యం అంటాడు. లేదు నాన్న నేనేమి అనలేదు కానీ మీద బాధపడుతుందని అసలు ఊహించలేదు. నేను వెళ్లి వెతుకుతాను అని అంటాడు. కూడా నేను వస్తాను అన్నయ్య అని అంటాడు.
వద్దులేరా రాజేష్ ఉన్నాడు కదా… వాడితో కలిసి వెతుకుతాను అని బాలు వెళ్లిపోతాడు. బాలుని తిడుతుంటే ప్రభావతి వాడు తప్ప ఏమీ లేదు మీనాదే తప్పు అని అంటుంది. ప్రతి చిన్న విషయానికి భర్త మీద అత్త మీద అలిగి వెళ్లిపోయే కోడలు ఉన్నాయి ఈరోజుల్లో నీలాంటి దాని భరించి ఇన్ని రోజులు ఇక్కడ ఉండడం చాలా సహనంతో కూడిన పని అని సత్యం అంటాడు.. రవి ఎందుకు నాన్న అమ్మకి అంతగా క్లాస్ పీకుతున్నావ్ అమ్మ మారుతుందని అనుకుంటున్నావా అని రవి అంటాడు.
మనోజ్ అన్నయ్యతో తప్ప ఎవరితోనో ప్రేమగా మాట్లాడదు అని అడుగుతాడు.. కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో ఫోన్ చేసి కనుక్కొని సత్యం అంటాడు. ఏమైంది కామాక్షిని ఫోన్ చేసి మీనా ఉందా అని అడుగుతుంది వెంటనే ఇంటికి వచ్చేస్తుంది కామాక్షి. మీనా ఇంట్లో లేదా ఏమైందో చెప్పు వదిన అని అడుగుతుంది. మీనా ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు ఇది జరిగింది అని ప్రభావతి అంటుంది. ఇంత జరిగితే మీనా వెళ్లిపోయిందా అయితే అత్త మీద అలిగి వెళ్లిపోయిందా? కచ్చితంగా పోలీస్ కేసు పెడుతుంది అని కామాక్షి అంటుంది.
Also Read: అక్టోబర్ లో రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్న సినిమాలు..
అయినా మీనా గురించి నీకు తెలియదా ఎందుకు నువ్వు నోరు పారేసుకున్నావు కచ్చితంగా అత్త పోరుని భరించలేక పోలీస్ స్టేషన్ కి వెళ్లే ఉంటుంది అని కామాక్షి ప్రభావతిని ఇంకా టెన్షన్ పెడుతుంది. మీనా రూమ్ లో ఏదైనా లెటర్ రాసిపెట్టి వెళ్ళిందేమో ఒకసారి వెతుకుదాం పద అని కామాక్షి ప్రభావతితో అంటుంది. లెటర్ ఏంటి అంటే మరణ వాంగ్మూలం మా అత్త నన్ను హింసిస్తుంది అని లెటర్ రాసి చనిపోవడానికి వెళ్లిందేమో అని కామాక్షి ఇంకాస్త బయట పెట్టుకుంది. వాళ్ళిద్దరూ వెతుకుతుంటే రోహిణి, శృతి కూడా అక్కడికి వచ్చి వెతుకుతారు.. రేపటి ఎపిసోడ్లో మీనా కనిపిస్తుందేమో చూడాలి..