OTT Movie : ఫ్యామిలీలో గొడవలు, జెలసీతో నడిచే ఒక మలయాళం థ్రిల్లర్ సినిమా, ఆడియన్స్ కి థ్రిల్లింగ్ చిల్ ని ఇస్తోంది. ఈ సినిమా సాధారణంగా మొదలై, ఒక భయంకరమైన థ్రిల్లర్ గా మారుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ఈ కథని, పిల్లలతో అస్సలు చూడలేము. ఈ సినిమా కంటెంట్ కాస్త ఘోరంగానే ఉంటుంది. ఈ మలయాళం సినిమా పెద్దలకు మాత్రమే. దీని పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఊడల్’ (Udal) 2022లో వచ్చిన మలయాళం థ్రిల్లర్ సినిమా. రతీష్ రఘునందన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో శైనీ (ఇంద్రన్స్), చంద్రిక (గంగ శివ), శశి (సైజు కురుప్) ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఈ సినిమా, IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా 2022 డిసెంబర్ 23న థియేటర్లలో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది.
ఈ కథ కేరళలోని ఒక చిన్న గ్రామంలో, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ కుటుంబం బయటికి సాధారణంగా కనిపిస్తుంది, కానీ లోపల జీవితం అనుకున్నంత మంచిగా ఉండదు. షైనీ అనే మహిళ, తన భర్త, అత్తమ్మ, మామయ్య కుట్టిచన్ తో ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. ఆమెకు ఒక చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. ఇంట్లో ఆమె అత్తమ్మను చూసుకోవడానికి ఒక నర్స్ కూడా ఉంటుంది. షైనీ జీవితం ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఆమె భర్త ఆమెను పెద్దగా పట్టించుకోడు, ఎప్పుడూ బిజీగా ఉంటాడు. మామయ్య కుట్టిచన్ చాలా కఠినమైన వ్యక్తి. అతను ఇంట్లో అందరి మీద పెత్తనం చేస్తుంటాడు. కుట్టిచన్ షైనీతో కఠినంగా మాట్లాడతాడు. ఆమెను భయపెడతాడు. షైనీ ఇంటి పనులు, బిడ్డను చూసుకోవడం, కుటుంబ ఒత్తిడితో సతమతమవుతుంది. అత్తమ్మకు సేవ చేయడానికి హోమ్ నర్స్ ఉన్నప్పటికీ, షైనీ జీవితం ఏ మాత్రం సంతోషంగా ఉండదు.
ఒక రోజు హోమ్ నర్స్ హఠాత్తుగా ఉద్యోగం మానేస్తుంది. దీంతో అత్తమ్మను చూసుకోవడం కూడా షైనీ బాధ్యత అవుతుంది. ఇది ఆమెకు మరింత ఒత్తిడిని తెస్తుంది. కుట్టిచన్ షైనీపై మరింత కఠినంగా ఉంటాడు. అతను ఆమెను మాటలతో బాధపెడతాడు, కొన్నిసార్లు శారీరకంగా కూడా హింసిస్తాడు. షైనీ ఈ హింసను సహిస్తూ బాధ పడుతుంది. షైనీ జీవితం నరకంలా మారుతుంది. కథ ఇప్పుడు ఒక భయంకరమైన థ్రిల్లర్‌గా మారుతుంది. ఒక రోజు షైనీ తన ప్రియుడిని రహస్యంగా ఇంటికి పిలిపించుకుంటుంది. ఇక తన బాధలను అతనికి చెప్పుకుని ఏకాంతంగా గడు పుతుంది. ఈ సమయంలో షైనీలో ఒక మార్పు వస్తుంది. ఆమె ఇక సహించలేక తన అత్తయ్యను చంపేస్తుంది.
కుట్టిచన్ కి కళ్ళు అంతగా కనిపించక పోయినా విషయం తెలుసుకుంటాడు. ఇప్పుడు షైనీ, కుట్టిచన్ మధ్య ఒక భయంకరమైన పోరాటం జరుగుతుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలసి కుట్టిచన్ ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ కుట్టిచన్ వాళ్ళని తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ముగుస్తుంది. చివరికి పోరాటం ఎక్కడి వరకు దారి తీస్తుంది ? కుట్టిచన్‌ను షైనీ ఏం చేస్తుంది ? ఆమె భర్తకి విషయం తెలుస్తుందా ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను, ఈ మలయాళం థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా