BigTV English

Moinabad News: మొయినాబాద్‌లో ‘ట్రాప్‌ హౌస్‌ పార్టీ.. ఇన్‌స్టాలో పరిచయం, బుక్కైన 50 మంది మైనర్లు

Moinabad News: మొయినాబాద్‌లో ‘ట్రాప్‌ హౌస్‌ పార్టీ.. ఇన్‌స్టాలో పరిచయం, బుక్కైన 50 మంది మైనర్లు

Moinabad News: తెలంగాణలో పోలీసులు ఎంత నిఘా పెట్టినా, మందు-డ్రగ్స్ పార్టీ కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు యువతను మేల్కొపే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం-పోలీసులు. అటు పిల్లల పేరెంట్స్ సైతం అలర్ట్ చేస్తున్నారు. అయినా అడ్డంగా బుక్కై విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మెయినాబాద్‌లో ట్రాప్‌ హౌస్‌ పార్టీ పేరిట నిర్వహించిన ఈవెంట్‌పై  దాడులు చేశారు పోలీసులు. అందులో షాకింగ్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


రూటు మార్చిన డ్రగ్స్ మాఫియా

తెలంగాణలో గంజాయి-డ్రగ్స్ ఏ స్థాయిలో సరఫరా అవుతుందో చెప్పడానికి ఈ చిన్న ఘటన చాలు. గంజాయి-డ్రగ్స్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడకక్కడ తనిఖీలు, నిఘా కఠినతరం చేయడంతో డ్రగ్స్ మాఫియా కొత్త దారులు వెతుకుతోంది. సోషల్ మీడియా ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మెయిన్‌బాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ట్రాప్‌ హౌస్‌ పార్టీ పేరిట జరిగిన కార్యక్రమంలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.


మెయినాబాద్ లోని శనివారం రాత్రి ఓ ఫామ్‌హౌస్‌లో యువతీయువకుల పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాత్రి ఆ ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు. ఆ పార్టీలో పాల్గొన్నవారంతా మైనర్లు. వారిని చూసి పోలీసులు షాకయ్యారు. పార్టీలో పాల్గొన్నవారికి డ్రగ్స్ పరీక్షలు చేశారు.

సోషల్ మీడియా టార్గెట్‌గా యూత్‌కి వల 

అందులో ఇద్దరు మైనర్లు గంజాయి తీసుకున్నట్టు తేలింది. ఆరుగురు నిర్వాహకులు, ఆరు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మైనర్ల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.

హైదరాబాద్ సిటీకి ఓ డీజే ఇన్‌స్టా యాప్‌లో ‘ట్రాప్‌ హౌస్‌ 9ఎంఎం’ పేరుతో ఖాతా ఉంది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో ట్రాప్‌ హౌస్‌ పార్టీ నిర్వహిస్తున్నట్టు సదరు వ్యక్తి జోరుగా ప్రకటనలు గుప్పించాడు. ఆషామాషీ పార్టీ కాదని, ఇక్కడకొస్తే ఊహించని ఆనందాన్నిపొందవచ్చంటూ ఊరించాడు. ఆ పార్టీకి సంబంధించి టారిఫ్‌ కుడా  విధించాడు.

ALSO READ: అలల తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు, ఒకరు మృతి

శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగే పార్టీలో పాల్గొనేవారు కచ్చితంగా పాస్‌లు తీసుకోవాలనే షరతు విధించాడు. సింగల్‌గా వస్తే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800 టారిఫ్ నిర్ణయించాడు. ఇన్‌స్టాలో చూసిన మైనర్లు ఒకరి నుంచి మరొకరు ఫోన్లు చేసుకుని ఆ పార్టీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది యువకులు మొయినాబాద్‌లోని ఓక్స్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అమ్మాయిలతో డ్యాన్సులు, మత్తులో జోరుగుతున్న పోలీసులు దాడులు చేశారు.  మైనర్ల నుంచి తీసుకున్న ఫోన్ నెంబర్లతో వారి పేరెంట్స్‌కి కబురు పెట్టారు. వారంతా స్టేషన్ చేరుకున్న పిల్లలకు వారి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇప్పించారు.

తమ పిల్లలు చేసిన పనికి పోలీసుస్టేషన్‌కు వచ్చిన వారి తల్లిదండ్రులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఫోన్లు ఇచ్చిన తప్పు చేశారని, వాటిపై ఓ కన్నేయాలని పదేపదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. తస్మాత్ జాగ్రత్త.. నగర యువత మేలుకో.. తేడా వస్తే బుక్కైపోతారు.

 

Related News

Hyderabad News: బీఎండబ్ల్యూ కారు బీభత్సం.. నార్సింగ్‌లో ఘటన, షాకింగ్ ఫుటేజ్

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన

Kadapa News: తండ్రిని బంధించి.. కన్న తల్లి గొంతుకోసి దారుణంగా చంపి, అనంతరం టీవీ చూస్తూ..?

Extramarital Affair: అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డొచ్చిన కూతురిపై హత్యాయత్నం

TDP vs YCP: దుర్గా దేవి నిమజ్జనోత్సవంలో.. టీడీపీ – వైసీపీ ఘర్షణ..

Kadapa Crime News: కొడుకు రాసిన రక్తచరిత్ర.. తల్లిని కత్తితో గొంతుకోసి

Road Accident: హైవేపై ఘోర ప్రమాదం.. బ‌స్సుల మ‌ధ్య ఇరుక్క‌పోయిన‌ కారు.. కళ్లు చెదరే దృశ్యాలు

Big Stories

×