Illu Illalu Pillalu Today Episode October 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ధీరజ్ తో ఐశ్వర్య డాన్స్ వేయడం చూసిన ప్రేమ కుళ్లుకుంటుంది. తన ఫ్రెండ్స్ ప్రేమ చేత కావాలని మందు తాగిస్తారు. ధీరజ్ దగ్గరికి వెళ్లిన ప్రేమ నువ్వు నాతోనే డాన్స్ చేయాలి ఎందుకంటే నేను నీ భార్యను కాబట్టి అని ఇద్దరు కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేస్తారు. వీరి డాన్స్ ఎపిసోడ్కి హైలెట్గా మారుతుంది. పార్టీ అయిన తర్వాత ప్రేమని జాగ్రత్తగా ధీరజ్ కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. శ్రీవల్లి గురించి అసలు నిజాన్ని తెలుసుకుని నర్మదా.. ప్రేమ ఫోటోలు గురించి ఎదిరింటి వాళ్ళకి చెప్పింది మీ వాళ్లే అన్న విషయం నాకు తెలిసిపోయింది. వాళ్ళు ఎట్టి పరిస్థితులను రేపు ఉదయం ఇక్కడ ఉండాలి. ప్రేమ మాత్రం తాగిన మైకంలో శ్రీవల్లికి చుక్కలు చూపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ శ్రీవల్లిని దెయ్యం అనడంతో పాటుగా మెడ మీద కత్తి పెట్టి నువ్వు డాన్స్ చేయాలి లేదంటే నీ మెడ తెగిపోతుంది అని వార్నింగ్ ఇస్తుంది. శ్రీవల్లి చచ్చినట్లు ప్రేమ చెప్పినట్లు డాన్స్ వేస్తుంది. ప్రేమ నీ బాడీలో రిధం రావాలంటే నేను ఒక వస్తువు ఇస్తాను దానిమీద నువ్వు డాన్స్ చేయాలి అని అంటుంది. డాన్స్ బాగానే ఉంది కదా ఇంకేంటి మరి నేను వెళ్ళిపోతాను అని శ్రీవల్లి అంటుంది. వెళ్ళిపోయావంటే మెడ తెగిపోతుంది అని ప్రేమ అంటుంది.. ఇక గాజు పెంకుల మీద శ్రీవల్లితో డాన్స్ చేస్తుంది ప్రేమ.
ఉదయం లేవగానే శ్రీవల్లి బయట కూర్చుని సోకాలు పెడుతూ ఉంటుంది. రాజు పెంకులు గుచ్చుకున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పెద్ద రచ్చ చేస్తుంది.. శ్రీవల్లి చేసిన రచ్చ గురించి తెలుసుకున్న నర్మదా ఏమైంది దీంట్లో పెడితే దాంట్లో కాలు పెడితే ఇలానే ఉంటాయి. నీకు అన్నిట్లో తల దరచడం అలవాటే కదా అని మాట్లాడుతుంది నర్మదా.. ప్రేమ ఇలా చేసిందని చెప్తే రేపు ప్రేమ నర్మద ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటారని నర్మద తో అబద్ధం చెప్తుంది శ్రీవల్లి.. కళ్ళు నెత్తిన పెట్టుకొని నడిస్తే ఇలానే ఉంటుంది.
అయితే ఏ దాంట్లో పెడితే ఆ దాంట్లో వేలు పెట్టకుండా మర్యాదగా ఉంటే మంచే జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకో అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది. మీ అమ్మ నాన్న ఇక్కడ ఉండాలని చెప్పాను కదా ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. నేను మా వాళ్ళకి చెప్పాను వాళ్ళు వస్తారా నాకు తెలీదు అని నర్మద తో శ్రీవల్లి అంటుంది.. ప్రేమ ఉదయం లేవగానే రాత్రి జరిగింది తెలుసుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఐశ్వర్య గురించి చెప్పి ధీరజ్ని ఒక ఆట ఆడుకుంటుంది..
ఏం చేయాలన్నా కూడా ఇంటర్లో నడిపించిన ప్రేమ వ్యవహారం ఉంది కదా మీ ప్రియురాలని పిలిపించుకొని చేయించుకో అనేసి ప్రేమ ధీరజ్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. ఇక కాసేపట్లో భాగ్యం ఆనందరావు రామరాజు ఇంటికి వస్తారు. నర్మదా మీకోసమే ఎదురుచూస్తున్నాను. అందరూ మీకోసమే చూస్తున్నారు లోపలికి వెళ్ళండి అని అంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే మీ మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి నా కొడుకు దగ్గర మీరు ఎందుకు డబ్బులు తీసుకున్నారని రామరాజు అడుగుతాడు.
లక్ష రూపాయలు తీసుకున్నారా ఇంకా ఎక్కువ తీసుకుంటారా.. నాకు తెలియకుండా టీ కి కూడా డబ్బులు ఖర్చు పెట్టినా కొడుకు మీకు డబ్బులు ఇచ్చారంటే నేను అసలు నమ్మను. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అని రామరాజు అంటాడు. చందు ని భాగ్యం అడ్డంగా ఇరికిస్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చావా రా ఎందుకు ఇచ్చావు అసలు నాకు చెప్పకుండా నువ్వు వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చావు అని చందు నిలదీసి అడుగుతాడు రామరాజు. భాగ్యం ఆనందరావు కాలు తొక్కుతుంది. దాంతో ఆనందరావు గుండెపోటు వచ్చినట్టు నటిస్తాడు.
Also Read: రోహిణి వంటకు ప్రభావతి ఫిదా.. క్లాస్ పీకిన సత్యం.. మీనా కోసం బాధపడుతున్న బాలు..
ఇక వాళ్ళ నాటకాన్ని రక్తి కట్టించేలా మేము హాస్పిటల్ కి వెళ్ళాలి అని భాగ్యం అంటుంది. ఇక బయటికి అర్జెంటుగా తీసుకొని వచ్చేస్తారు ఆటోలోకి రాగానే అల్లుడుగారు దీని తప్పు లేదండి మా అమ్మాయిని తప్పుగా చూడకండి అని భాగ్యం అంటుంది. ఇక ఆ ఇల్లు దాటిన తర్వాత ఆనందరావు నాటకాన్ని ఆపేస్తాడు. మన ప్లాన్ వర్కౌట్ అయింది అని సంతోష పడతారు అప్పుడే ఆటో డ్రైవరు ఆటోని ఆపేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..