Brahmamudi serial today Episode: అప్పు వచ్చి కావ్యను విడాకుల గురించి అడుగుతుంది. దీంతో కావ్య ఇది నాటకం అని అప్పుకు చెప్పకూడదని మనసులో అనుకుంటుంది. దీంతో అప్పు ఏంటి అక్కా విడాకుల గురించి అడగ్గానే.. సైలెంట్ అయిపోయావు.. ఇంతకాలం బావే ప్రాణంగా బతికిన నువ్వు ఇప్పుడు ఏకంగా ఆయనతో బంధమే వద్దు అంటున్నావు.. అక్కా నువ్వె చెప్తుంటావు కదా మనం వెళ్లే దారిలో ముళ్లు ఉంటే వాటిని దాటుకుని వెళ్లాలి కానీ దారి మళ్ళి వెళ్లకూడదని..నువ్వే చెప్తుంటావు కదా..? ఇది కరెక్టు కాదు అక్కా నువ్వు బావకు విడాకులు ఇవ్వాలనుకోవడం కరెక్టు కాదు అక్క.. అంటుంది దీంతో కావ్య ఆయన చేస్తుంది కరెక్టేనా అప్పు.. నాకు తెలియకుండా నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాలనుకున్నారు.. చెప్పు అప్పు ఆయన చేస్తుంది కరెక్టేనా అప్పు.. అంటూ కావ్య నిలదీయడంతో అప్పు సైలెంట్‌గా చూస్తుంది.
నా బిడ్డను చంపుకోమని నాతో ఆయన గొడవ చేసినప్పుడల్లా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు.. అంతెందుకు నువ్వు కొద్ది రోజుల్లో తల్లివి అవుతున్నావు కదా..? నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు అప్పు… సడెన్‌గా కవిగారు వచ్చి నిన్ను అబార్షన్ చేయించుకో అని చెబితే నువ్వు ఎలా ఫీలవుతావు అప్పు.. చూశావా అప్పు ఇంత దానికే నీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మరి నాకెలా ఉంటుందో తెలుసుకో అప్పు.. ఆయన నా బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడో చెప్పకపోతే నేను నా నిర్ణయాన్ని మార్చుకోను అప్పు అంటూ కావ్య వెళ్లిపోతుంది. దీంతో అప్పు ఏడుస్తూ. నీ ప్రాణం కోసం బావ ఆరాటపడుతుంటే ఆయన బంధాన్ని వదులుకోవాలనుకుంటున్నావా..? అక్కా అని బాధపడుతుంది అప్పు. ఇద్దరూ మాట్లాడుకోవడం అంతా చాటు నుంచి వింటుంది రుద్రాణి.
సీతారామయ్య రాజ్‌ను పిలిచి నీ వల్ల ఇంట్లో అందరూ బాధపడుతున్నారు.. నీవు ఎందుకు బిడ్డను వద్దనుకుంటున్నావో నాకు తెలియదు కానీ దానివల్ల మన దుగ్గిరాల కుటుంబం పరువు పోతుందిరా..? నలుగురికి మంచి చెప్పిన మనం ఈరోజు నీ వల్ల నలుగురి చేత చెప్పించుకోవాల్సి వస్తుంది. రోడ్డు మీదకు వెళితే అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారురా..? సరే వాళ్ల గురించి వదిలేయ్ కనీసం కావ్య గురించి అయినా ఆలోచించు.. నీకోసం తను ఎంతో చేసింది. ఎన్నో కష్టాలు పడింది. తననెందుకురా బాధపెడతావు అంటూ సీతారామయ్య చెప్పగానే.. రాజ్ మౌనంగా వెల్లిపోతాడు.
రూంలో కూర్చుని కావ్య మాటలు గుర్తు చేసుకుని బాధపడుతుంటే.. ధాన్యలక్ష్మీ వచ్చి అప్పును డిన్నర్ చేద్దువు రా అని అడుగుతుంది. నాకు ఆకలిగా లేదు అత్తయ్యా మీరు వెళ్లండి అని చెప్తుంది. దీంతో ఆకలిగా లేదా..? మీ అక్క గురించి ఆలోచిస్తూ తినకూడదు అనుకుంటున్నావా..? నేను ఆడదానినే ఈ టైంలో ఆకలి లేదు అనడం అబద్దం ఈ టైంలో ఎంత ఎక్కువ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది అని చెప్తుంది. కాసేపాగి తింటానని అప్పు చెప్పగానే.. సరే అంటూ ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర రుద్రాణి అప్పు ఎందుకు తినడం లేదో మీకు తెలుసా..? అంటూ కావ్య వల్లే అంటుంది. కావ్యను విడాకులు గురించి అడిగింది అప్పు.. అప్పుడు కావ్య అప్పును తిట్టింది. అందుకే అప్పు తినడం లేదని చెప్తుంది. దీంతో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. నన్ను తిట్టడం కాదు వదిన తను అప్పును తిట్టిందో లేదో మీరే అడగండి అంటుంది. దీంతో అపర్ణ ఏంటి కావ్య నువ్వు అప్పును తిట్టావా..? అని అడుగుతుంది. కావ్య తిట్టాను అత్తయ్యా కానీ అంటూ ఏదో చెప్పబోతుంటే..తననెందుకు అన్నావు కావ్య అని ఇంద్రాదేవి అడుగుతుంది. దీంతో కావ్య నేనేం కావాలని తిట్టలేదు అమ్మమ్మగారు ఏదో కోపంలో అంటూ చెప్తుంది.
ధాన్యలక్ష్మీ కల్పించుకుని ఏంటి కోపంగా నువ్వు తిట్టడానికి నా కోడలే దొరికిందా..? ఇప్పటికే మీ కారణంగా ఈ ఇంట్లో గొడవలకు అప్పు నలిగిపోతుంది. తను ఎప్పుడు చూసినా డల్లుగానే ఉంటుంది. ఇప్పుడు తను బాధపడుతుంది చాలదు అన్నట్టు స్పెషల్ గా మాటలతో మనసు విరిచేసి బాధపెట్టాలని చూస్తున్నావా..? అంటుంటే కావ్య అది కాదు అత్తయ్యా.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. ధాన్యలక్ష్మీ మరింత కోపంగా ఏంటి అది కాదు.. రెండు రోజుల నుంచి అప్పు కనీసం జ్యూస్ కూడా తాగడం లేదు. ఎలా ఇచ్చిన గ్లాస్ అలాగే ఉంచుతుంది.
నేను ఇంకా వికారంతోనేమో అనుకున్నాను.. కానీ నీ కారణంతోనే అని ఇప్పుడు అర్థం అయింది. ఏంటి కావ్య మీ గొడవల్లోకి నా కోడలును ఎందుకు లాగుతున్నారు.. మీలాగే అప్పుకు కూడా ఏదైనా ప్రాబ్లం రావాలని కోరుకుంటున్నావా.? అనగానే.. ప్రకాష్ కోపంగా ధాన్యం ఏం మాట్లాడుతున్నావు నువ్వు.. అనగానే.. మీరు ఉండండి అప్పు ఇప్పుడు కడుపుతో ఉంది. అలా ఏడుస్తూ కాలి కడుపుతో ఉంటే కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి..? అంటుండగానే.. భర్తకే విడాకులు ఇచ్చేస్తా అని చెప్పిన మనిషి ఇక నీ కోడలి కడుపులో బిడ్డ గురించి ఎందుకు ఆలోచిస్తుంది ధాన్యలక్ష్మీ.. అని రుద్రాణి చెప్పగానే.. కావ్య కోపంగా రుద్రాణిని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తర్వాత కళ్యాణ్ రూంలోకి భోజనం తీసుకెళ్లి అప్పును ఓదారుస్తూ.. తినిపిస్తుంటాడు. అప్పు కావ్య గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటుంది. మరోవైపు అపర్ణ, ఇంద్రాదేవి ఇద్దరూ హాల్లో కూర్చుని కావ్యను పిలిచి నీ నాటకం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని భయపడతారు. వాడు నిజం చెప్పడం అటుంచితే ఇంకా ఎన్ని గొడవలు జరగుతాయోనని బాధపడుతుంటారు. ఇంతలో రాజ్ రాగానే అందరూ సైలెంట్‌గా ఉంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.