Illu Illalu Pillalu Today Episode june 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్, నర్మదా శాంతి ముహూర్తనికి రామరాజు పంతులు గారిని కలిసి వచ్చాను అని వేదవతితో అంటాడు. బడిపంతులు ఎందుకు ఏ బడికి వెళ్ళాలి అని వేదవతి అడుగుతుంది. దానికి రామరాజు మొన్న ఒకేచూరులో రెండు శోభనాలు జరగకూడదని అన్నారు కదా.. పంతులు గారిని అడిగి వచ్చాను శోభనానికి ముహూర్తం పెట్టారు అని చెప్పగానే వేదవతి షాక్ అవుతుంది. నర్మదా ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అత్తయ్య గారు మేనేజ్ చేసుకుంటారులే అనేసి అనుకుంటుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి పగలబడి నవ్వుతుంది. అందరూ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఇద్దరికి ఆల్రడీ శోభనం అయిపోయింది మామయ్య గారు అని నర్మదా గుట్టు రట్టు చేస్తుంది.. ఆ మాట వినగానే నర్మదా షాక్ అయిపోతుంది. హైదరాబాద్ కి వెళ్లారు కదా అక్కడే వీళ్ళు శోభనం కూడా చేసేసుకున్నారు మావయ్య గారు అని బాంబు పేలుస్తుంది.. ప్రేమ, నర్మదా శ్రీవల్లికి ఇండైరెక్టుగా దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు కి సేటు ఫోన్ చేసి రెండు రోజులు నాకు డబ్బులు ఇవ్వాలని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. కానీ చందు మాత్రం ఒక నాలుగు ఐదు రోజులు టైం ఇవ్వాలని అడుగుతాడు. సేటు మాత్రం ఏంటి నాటకాలు ఆడుతున్నావా ఇదేదో యవ్వారం తేడాగా ఉందే… నేను రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వకుంటే మీ నాన్న దగ్గర ఈ విషయాన్ని చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. వల్లి అమ్మానాన్న పది రోజులు డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏదీ మాట్లాడట్లేదు. వీళ్ళకు కొంచెం కూడా సిగ్గు శరం అనేది లేదని చందు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ సాగర్ తిరుపతి అందరూ వచ్చి ఏంట్రా టెన్షన్ పడుతున్నావ్ ఏదైనా ఉంటే మాతో చెప్పు అని అడుగుతారు. శ్రీవల్లి వీళ్ళకి అసలు నిజం ఎక్కడ చెప్తారని టెన్షన్ పడుతూ ఉంటుంది. చందు నిజం చెప్పబోతుంటే శ్రీవల్లి వచ్చి బావ అని పిలుస్తుంది..
దాంతో చందు 10 లక్షల విషయాన్ని చెప్పడం ఆపేస్తాడు. బావ టైం అయింది కదా లోపలికి వెళ్లి పడుకుందాం రా అని శ్రీవల్లి అడుగుతుంది. వదిన ఈరోజు మా అన్నయ్య మాతోని పడుకుంటాడు. మీరు ఏదోఒకరోజు మాకు మా అన్నయ్యని వదిలిపెట్టండి వదిన అనేసి ధీరజ్ సాగర్ లు అడుగుతారు. కానీ శ్రీవల్లి మాత్రం చందు బయట ఉంటే పది లక్షల మ్యాటర్ తెలిసిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. చివరికి తిరుపతి చెప్పడంతో శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. లోపలికి వెళ్ళిన తర్వాత బావ వాళ్ళ తమ్ముడికి నిజం చెప్పిపోతే మా అమ్మ బంగారం బయటపడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
ధీరజ్, సాగర్లు పెళ్లయినప్పుడు ఏం జరిగింది. ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావ్ చెప్పరా అని గుచ్చి గుచ్చి అడుగుతారు. కానీ చందు మాత్రం అసలు నిజం చెప్పకుండా మాట మారుస్తాడు. అందరూ పెళ్లి గురించి పెళ్లి తర్వాత జీవితాల గురించి సరదాగా మాట్లాడుకుంటారు. పెళ్లి తర్వాత ఎలాంటివి జరుగుతున్నాయని తిరుపతి పై సెటైర్లు వేస్తారు. మొత్తం చూస్తే ముగ్గురు అన్నదమ్ములు పెళ్లిళ్ల తర్వాత జరిగే విషయాలను నెమరువేసుకుంటూ సంతోషంగా పడుకుంటారు. ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి ఒకే గదిలో పడుకుంటారు.
ప్రేమ అక్క నేను డాన్స్ క్లాసులు చెప్పాలనుకుంటున్నాను మేము నెలకు 10,000 ఇవ్వాలి కదా. మా కాలేజీ ఫీజులు కూడా మేమె కట్టుకోవాలి కదా అని అంటుంది.. ధీరజ్ ఒక్కడే సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తూ డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నాడు. అయితే అతనికి సాయంగా ఉండాలి అని ప్రేమ అంటుంది.. ప్రేమ డాన్స్ క్లాసులు విషయం గురించి నర్మదా తన ఆఫీసులో పనిచేసే మేడం పిల్లలకి చెప్పచ్చు ఆమెను అడుగుదామని సలహా ఇస్తుంది. శ్రీవల్లి మాత్రం పది లక్షల గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఈ విషయాన్ని శ్రీవల్లి భాగ్యం కు ఫోన్ చేసి చెప్తుంది. అర్ధరాత్రి ఫోన్ చేసావ్ ఏంటమ్మా అని భాగ్యం శ్రీవల్లిని అడుగుతుంది.. పది లక్షల మేటర్ వల్ల మీ అల్లుడు నా దగ్గర పడుకోలేదమ్మా బయట వాళ్ళ తమ్ముడు తోనే పడుకొని ఉన్నారు అనేసి అంటుంది.. అయితే 10 లక్షలు మేటర్ పక్కన పెట్టి మీరిద్దరూ కాపురం మీద దృష్టి పెట్టండి. ఆ నర్మదకి పొరపాటున పిల్లలు పుడితే మీ అత్తయ్య నెత్తిన కూర్చుంటుంది అని భాగ్యం సలహా ఇస్తుంది.. ఇక ఉదయం లేవగానే చందు రావడం చూసి శ్రీవల్లి జ్వరం వచ్చిందని నాటక మారుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లికి నర్మదా ప్రేమ షాక్ ఇవ్వబోతారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..