Phone Tapping Case: ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు నోటీసులిచ్చింది సిట్. ఆయన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాలని ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది. రెండు సెల్ ఫోన్లతో పాటు ప్రభాకర్ రావు వాడిన లాప్ టాప్,మ్యాక్ బుక్ తీసుకురావాలని ఆదేశించింది. నిన్నఏడు గంటల పైగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు.విచారణలో ప్రణీతరావు తో పాటు ఎస్ఐబి చీఫ్ గా కార్యకలాపాలపై ఆరా తీశారు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ ల ధ్వంసంతో పాటు డేటా మాయంపై విచారణ చేశారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ప్రశ్నించినట్టు సమాచారం. ప్రణీతరావుకి హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేయమని చెప్పిందెవరని సిట్ ఆరా తీసింది. పాత హార్డ్ డిస్క్ తీసేసి కొత్తది పెట్టమని చెప్పిన వారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. మొదటిసారి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో 8 గంటల పాటు సుధీర్ఘంగా ప్రభాకర్ రావుని విచారణ చేసింది. కీలకమైన అంశాలను సేకరీంచగా మరికొన్ని ప్రశ్నలకు ప్రభాకర్ రావు మాటలు దాటవేస్తూ సమాధానం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల స్టేట్‌మెంట్ , ఇచ్చిన ఆధారాల ఆధారంగా ప్రభాకర్ రావుని ప్రశ్నించారు.
టెక్నికల్, ఫోరెన్సిక్ డేటా సేకరించింది సిట్ బృందం. ప్రశ్నావళి సిద్ధం చేసుకొని ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్. లంచ్ బ్రేక్ తర్వాత సిట్ అధికారుల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు ప్రభాకర్. కోర్టులో బెయిల్ కోసం వినిపించిన వాదనలనే మళ్లి వినిపించారు. ఫోన్ ట్యాప్ చెయ్యమని మీకు ఎవరు చెప్పారు..? ఎవరు ఆదేశాలు ఇచ్చారని ప్రశ్నించగా.. తాను SIB లో పని చేసినప్పటికీ పైఅధికారులు ఉన్నారని ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. పై అధికారులకు తాను చేసే ప్రతి పనిపై నిరంతర పర్యవేక్షణ ఉందని,వారికి తెల్వకుండా ఏ పని చేయలేదని ప్రభాకర్ రావు చెప్పినట్టు సమాచారం. అంతే కాకుండా ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్,పెన్ డ్రైవ్ పై ప్రభాకర్ నోరు మెదపలేదు.
ప్రభాకర్ విచారణ తర్వాత సిట్ బృందం ప్రశ్నలకు నోరు మెదిపితే మాత్రం.. పలువురు రాజకీయ ప్రముఖులకు సిట్ బృందం నోటిసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది.నిన్నటి విచారణ ముగియగా మరోసారి విచారణకు హాజరుకావాలని సూచించారు.
Also Read: 69 మందితో.. పీసీసీ కొత్త కార్యవర్గం లిస్ట్ ఇదే!
అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆయనకు షరతు విధించింది. ఆగస్టు 5న ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మరోసారి విచారించనుంది. ఈలోపు ప్రభాకర్‌రావు విచారణకు సహకరించకుంటే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి కస్టోడియల్ విచారణకు..పోలీసులు అనుమతి కోరే అవకాశం ఉం