Illu Illalu Pillalu Today Episode june 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు బయటికి వెళ్లడానికి బ్యాగు తీసుకు రమ్మని చెప్తాడు.. కానీ వేదవతి బ్యాగు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఏదో టెన్షన్ పడుతూ కనిపిస్తున్నట్లు రామరాజు గమనిస్తాడు. ఏమైందమ్మా శ్రీవల్లి ఎందుకు మీ అమ్మతో ఏదో టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి శ్రీవల్లి మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు హనీమూన్ కి వెళ్లారు అంట మావయ్య. మమ్మల్ని కూడా పంపిస్తానని అంటుంది. మా అమ్మ బోలెడు డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తుంది. అది మీకు అవమానం కాదా అని ఇండైరెక్టుగా రామరాజుకి కౌంటర్ ఇస్తుంది. రామరాజు చందును పిలిచి మీరిద్దరూ హనీమూన్ కి వెళ్ళండి ఎక్కడ వెళ్తున్నారో చెప్తే డబ్బులు పంపిస్తాను అని అంటాడు. ఆ మాట వినగానే శ్రీవల్లి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది.. అయితే వేదవతి బయటికి రాగానే రామరాజుని పంపిస్తే ముగ్గురు కొడుకుల్ని హనీమూన్ కి పంపించండి లేదంటే ఎవరిని పంపించకండి నాకు తెలియదు అంతే అని వెళ్తుంది.. బుజ్జమ్మ మాట కాదనలేక రామరాజు ముగ్గురు కొడుకుల్ని ఒకేసారి హనీమూన్ కి వెళ్ళమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అయితే ప్రేమ నర్మద ఇద్దరూ కూడా ఈ హనీమూన్ కు నర్మద ప్రేమ ఇద్దరూ మాకు కుదరదు అని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్తే ముగ్గురు వెళ్లండి లేకపోతే అస్సలు ఎవరూ వెళ్ళకండి అని రామరాజు అంటాడు. అయితే చందు మేము ఆలోచించుకొని చెప్తామని అంటాడు. కానీ ధీరజ్ మాత్రం ప్రేమ ఏదో తేడాగా ఆలోచిస్తుంది అని అనుకుంటాడు. ప్రేమకు ఏదో జరిగిందని అనుకుంటూ ఉండగానే ప్రేమ ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని వెళ్ళిపోతుంది.. తోడికోడళ్ళు తనకి శత్రువుగా మారుతున్నారని అడుగడునా అడ్డుపడుతున్నారని శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఇంటికి పెద్ద కోడలుగా వచ్చాను అన్న ఆనందం నాకు లేకుండానే నర్మదా, ప్రేమ అడుగడుగునా అడ్డు పడుతున్నారని శ్రీవల్లి కోపంతో రగిలిపోతుంది.. అటు మొగుడేమో మేకలాగా తలాడిస్తూ ఉంటాడు. ఇటు తోడికోడలు కూడా నాకు ఏ కు మేకై కూర్చున్నారు అని కోపంగా ఇంట్లో వస్తువులన్నిటిని పగలకొడుతూ ఉంటుంది. అయితే వేదవతి ఇంట్లో నుంచి ఏదో శబ్దం వస్తుందని శ్రీవల్లి గది దగ్గరికి వెళ్లి తలుపు కొడుతుంది. శ్రీవల్లి ఏమైందమ్మా ఎలా ఉన్నావు అంటే ఏం లేదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి ఈ అమ్మాయి కోపంగా అలిగి పుట్టింటికి వెళ్ళిపోతున్నాయి ఏంటి అని వేదవతి అనుకుంటుంది.
శ్రీవల్లి బయటకు వెళ్ళిపోతుంది అలాగే ప్రేమ నర్మదలు ఇద్దరు బయటకు వెళ్లి పోతారు. ఆ శ్రీవల్లి మన వెనకాలే ఫాలో అవుతుందేమో అని నాకు అనుమానంగా ఉందక్క అని నర్మదతో అంటుంది. నర్మద మాత్రం తోడికోడళ్ళు పోరు ఇప్పటిదే కాదు ఆ రోజుల్లో ఇంతే అని జీవిత సూత్రాన్ని చెప్తుంది.. మొత్తానికి డాన్స్ క్లాస్ కోసమని ప్రేమ ఓ ఇంటికి వచ్చేస్తుంది. ప్రేమ ప్లాను సక్సెస్ అవుతుంది. శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లి అక్కడ డాన్స్ చేస్తున్న అమ్మానాన్నలపై కేకలు వేస్తుంది.
నాకేం అక్కడ మంటలు పెట్టి మీరిద్దరేమో.. ఈ వయసులో ఇక్కడ డాన్స్ లు పెడుతున్నారా అంటూ శ్రీవల్లి వాళ్ళిద్దరిని కడిగి పడేస్తుంది. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఎందుకంత అరుస్తున్నావు ప్రశాంతంగా ఎక్కడ కూర్చొని భాగ్యం శ్రీవల్లికి ఇంట్లో గొడవలు ఎట్లా పెట్టాలో బోధ చేసి పంపిస్తుంది. వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారని సమయం దొరికినప్పుడల్లా అంటూనే ఉండు. నైస్ గా మాట్లాడుతూనే వాళ్ళిద్దర్నీ నట్టేట్లో ముంచేయాలి అంటూ కూతురుకి నూరిపోస్తుంది. శ్రీవల్లి భాగ్యం చెప్పినట్లే చేస్తానని ఇంటికి వెళుతుంది.. ప్రేమ కాళ్లకు గజ్జలు కట్టుకొని పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తుంది. పక్కనే ఉన్న నర్మదా ప్రేమ డాన్స్ ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ డాన్స్ క్లాస్ గురించి ఇంట్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..