Telugu Serial : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం కొన్ని సీరియల్స్లలో ప్రత్యేకంగా కొన్ని సీన్లను క్రియేట్ చేస్తున్నారు. ఆ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాట అటు ఉంచితే విమర్శలు కూడా అందుకుంటున్నాయి.. మరికొన్ని సీన్లు మాత్రం జనాలు చేత ఔరా అనిపిస్తున్నాయి. ఈమధ్య ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ సినిమాలను మించి తీన్లను క్రియేట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అదేంటి సినిమాలకు మించి సాహిత్యం చెప్తున్నారనుకుంటున్నారా? అవునండి ఈమధ్య సీరియల్స్ సినిమాలను మించి ఉండటం విచిత్రం.. మొన్నటి వరకు ఫైట్ సీన్లు మాత్రమే సీరియల్స్లలో కనిపించేవి.. ఇప్పుడు ఏకంగా స్టంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మేం అంటుంది కాదు. జీతెలుగులోకి ఓ సీరియల్ సీన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
యాక్షన్ సినిమాను మించిన సీన్…
అప్పుడు కుటుంబ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే సీరియల్స్ ఇప్పుడు కాస్త జిమ్మిక్కులు మ్యాజిక్కులు చేస్తూ టీఆర్పి రేటింగ్ను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఈమధ్య వస్తున్న సీరియల్స్లలో కొన్ని అలానే కనిపిస్తున్నాయి. జనాలను ఆకట్టుకోవాలని ఆత్రుతతో వాళ్ళు చేసే సీన్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఓ సీరియల్ లోని సీన్ నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ప్రముఖ తెలుగు ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న జయం సీరియల్ లో ఓ సందర్బంలో గ్యాస్ నుంచి మంటలు వస్తాయి. అక్కడ కేకలు విని వచ్చిన హీరోయిన్ గ్యాస్ బండను తీసుకొని పై నుంచి కిందకు దూకేస్తుంది. అచ్చం సినిమాను తలపించే ఈ సీన్ ట్రోల్స్ కు గురైంది.. అదేలా ఉందో ఒక్కసారి ఇక్కడ చూసేయ్యండి..
Also Read : రెమ్యూనరేషన్ లో పవన్ కళ్యాణ్ నయా రికార్డ్.. ఏ మూవీకి ఎంతంటే..?
‘జయం’ సీరియస్ స్టోరీ విషయానికొస్తే..
శ్రీరామ్ వెంకట్, వర్షిణి జంటగా నటిస్తున్న తెలుగు సీరియల్ ‘జయం’. ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ‘జీ తెలుగు’లో జూలై 14 నుంచి ప్రసారం అవుతోంది.. లేట్ గా మొదలైన కూడా ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అతి కొద్ది నెలలకే 8 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. రివేంజ్ డ్రామాగా ఈ సీరియల్ స్టోరీ ఉంటుందని ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్ లను చూస్తే అర్థం అవుతుంది. రుద్ర ప్రతాప్ పాత్రలో కేవీ శ్రీరామ్, గంగావతి పాత్రలో వర్షిణి నటిస్తుంది. అలాగే శ్రీప్రియ, సరస్వతి, రాఘవ, రామస్వామి, సంగీత, సుభాష్, వరలక్ష్మి, యశ్వంత్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు.. శ్రీరామ్ వెంకట్ హోమ్ ప్రొడక్షన్ హౌస్ సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ సీరియల్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది.. శ్రీరామ్ గంగావతి ల మధ్య ప్రేమ పుడుతుందా? వాళ్ల ప్రేమని పెద్దలు అంగీకరిస్తారా? ఈ స్టోరీలో ఇంకెన్ని మలుపులు ఉండబోతున్నాయో అనేది సీరియల్ లో చూడాల్సిందే..
?igsh=bGQ4aXUzcjRrdzdi