Gundeninda GudiGantalu Today episode September 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. గదిలోకి వెళ్తున్న బాలు వీళ్ళ మాటలు విని అక్కడికి వస్తాడు. బట్టలు తీసుకొస్తున్న మీనా బాలు అటుగా వెళ్లడం చూసి ఏమైందని అనుకుంటుంది. మా అమ్మ పేరు మీద పెడితే కచ్చితంగా మనం చిప్పకూడు తినాలి అని మనోజ్ అనడం బాలు రికార్డ్ చేస్తాడు. వాళ్ళిద్దరూ బెడ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటే బాలు సడన్గా ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా మా రూమ్ లోకి వచ్చేసావ్ కనీసం పర్మిషన్ కూడా తీసుకోవాలని లేదా అని మనోజ్ అంటాడు. నేను ఊరికే రాలేదు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని బాలు అంటాడు. ఏమైందిరా ఎందుకు వచ్చావు చెప్పు అని అడుగుతాడు మనోజ్.. షాప్ కి నువ్వు ఏ పేరు పెట్టాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంకా ఆలోచించలేదు డిసైడ్ అయ్యాక అందరికీ చెప్తామని మనోజ్ అంటాడు. నువ్వు అమ్మపేరే షాప్ కి పెట్టాలి. ఈ రికార్డు బయట పెట్టాను అనుకో నీ బండారం మొత్తం బయటపడి మళ్లీ నువ్వు గుడి ముందు చేరుతావు అని అంటాడు. పార్క్ లోకి వెళ్ళాలి. ఇది అమ్మ వింటే నీ పని గోవిందా.. అనగానే మనోజ్ రోహిణి టెన్షన్ పడుతూ ఉంటారు.. మీనా ఎందుకండీ వాళ్ళని ఇబ్బంది పెడతారు అది వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్న షాప్ అది వాళ్ళ ఇష్టం కదా అని అంటుంది.. అమ్మకి నేనంటే ఇష్టం లేకపోయినా అమ్మంటే నాకు ఇష్టం అమ్మ చేతి గోరుముద్దలు తినాలని నాకు ఉంటుంది మీనా అని బాలు అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఉదయం లేవగానే ప్రభావతి మీనా పై అరుస్తుంది. ఏం వంట చేస్తున్నావ్ అని అడుగుతుంది. నువ్వు ఏ చేయాలనుకుంటే అది కాదు అందరూ ఏ తింటే అది చెయ్యి అని మీ నాపై అరుస్తుంది. బాలు అక్కడికి వచ్చి తలకాయ కూర మెదడు కూర ఇలాంటిదే ఏమీ వద్దు అని అడుగుతాడు. అయితే నాకు ఆ మెదడు లేదు కదమ్మా నువ్వే తినేసావు కదా అని అంటాడు.. దానికి ప్రభావతి నువ్వు ఆపరా ఇంతకీ నేను ఏం చెప్తున్నాను పానకంలో పుడకలాక విడొచ్చాడు అంతా మర్చిపోయిన అని అంటుంది.
అప్పుడే మనోజ్ వస్తాడు. అలాగే వెంటనే రోహిణి కూడా వస్తుంది. వీరిద్దరూ ఏం తినాలి అనిపిస్తే అది చెప్పండి అమ్మ చేస్తుంది అని అంటుంది ప్రభావతి. వీళ్ళు ఏం పని చేస్తున్నారు అని బాలు సెటైర్లు వేస్తాడు.. అయితే రోహిణి వెజిటేబుల్ బిర్యాని కావాలని ఆర్డర్ వేస్తుంది.. అవన్నీ కావాలంటే ముందు కూరగాయలు కావాలి ఇంట్లో ఉన్నది కేవలం సొరకాయ మాత్రమే అని మీనా అంటుంది. అయితే బాలుని కూరగాయలు తీసుకు రమ్మని ప్రభావతి అంటుంది. బిర్యాని అని అడిగింది ఎవరు అని బాలు అంటాడు.
పార్లరమ్మ బిరియాని కావాలని అడిగింది అయితే వాళ్ళ ఆయన వెళ్లి కూరగాయలు తీసుకురావాలి నాకేం అవసరమని బాలు అంటాడు. మనోజ్ వెళ్లి కూరగాయలు తీసుకొస్తాడు అయితే తెచ్చిన నాలుగు కూరగాయల కోసం 500 ఖర్చు చేయడంతో అందరూ షాక్ అవుతారు. ఆ కూరగాయలు రేటు 500 అని రోహిణి తో సహా అందరూ అవక్కయిపోతారు. మొత్తం అందరూ మనోజ్ ని తిడతారు. ఇప్పుడు ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చి ఈయన ఫారిన్ నుంచి వచ్చినట్లు కూరగాయలు కొనడం కూడా రాదా అని అడుగుతాడు..
ఇలాంటి వాని ఎందుకు పంపించారు సార్ చిల్లర ఎంత ఇవాళ కూడా తెలుసుకోకుండా వచ్చేసాడు అని అతను కూడా అంటాడు. బాలు చేతికి మనోజ్ జుట్టు దొరుకుతుంది. ఓ ఆట ఆడుకుంటాడు. మీనా బాలుకు సపోర్టుగా మాట్లాడుతుంది. ఇదంతా వదిలేయ్ రా రేపు ఒక స్పెషల్ డే ఉంది ఏంటో తెలుసా అని సత్యం అడుగుతాడు. గుర్తుంది నాన్న వీడు లక్షలు మింగిన రోజు కదా అనేసి అంటాడు. దాంతోపాటు మరొకటి కూడా ఉంది అని సత్యం అంటాడు. కానీ బాలు గుర్తులేదు అంటాడు రేపు మీ పెళ్లి రోజు రా పెళ్లి మీనాని బుజ్జగించు అని అంటాడు.
Also Read : తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ రియల్ ఏజ్ ఎంతో తెలుసా..? అస్సలు నమ్మలేరు..
అయితే మీనాని ఓదార్చే పనిలో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలను గుర్తుచేస్తుంది మీనా. ఇక అప్పుడే ప్రభావతి మీనాపై అరుస్తూ కేకలు వేస్తుంది.. మీనాని ప్రభావతి పిలుస్తున్న సమయంలోనే పార్వతి ఇంటికి వస్తుంది. రేపు బాలు మీనాల పెళ్లిరోజు కదా బట్టలు పెడదామని వచ్చానని అంటుంది. ఆ మాట వినగానే నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ ఇక్కడికి అని మీనా అంటుంది. రోహిణిని కూడా బాలు బుక్ చేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..