Intinti Ramayanam Today Episode September 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీకర్, అవనితో మాట్లాడటం విన్న పల్లవి షాక్ అవుతుంది. అంతే కాదు ఇంట్లో తన గురించి తన తండ్రి గురించి నిజం తెలిసి ఇంట్లో నుంచి గెంటేసినట్లుగా కలగంటుంది పల్లవి.. నిజంగానే ఇదంతా జరిగిందని అనుకునేలా ఆ కలని క్రియేట్ చేశారు.. శ్రీకర్ ఏం మాట్లాడవేంటి వదిన అని అవనిని అడుగుతాడు. నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మ కూడా తెలుసుకుంటుంది అన్నయ్య నువ్వు మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయి కలుసుకుంటారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.. అవని ఇప్పుడు ఇలాంటివి చేయడం మంచిది కాదు శ్రీకర్. ఈ పూజ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. కచ్చితంగా ఈరోజు ఏదో ఒకటి చేద్దామని అంటుంది. ఈ విషయాన్ని ఈ పల్లవి తన డాడీ తో పంచుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు బేబీ ఏం జరుగుతుందో చూడు అని అంటాడు. పోలీసులు శ్రీకర్ని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ఇంట్లో అందరు సంతోషంగా పూజలో కూర్చుంటారు. పూజ జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఇంటికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. శ్రీకర్ ఒకతని బెదిరించి మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారంటూ పోలీసులు అతని అదుపులోకి తీసుకుంటారు.. అవని రాజేంద్రప్రసాద్ అందరూ ఎంత చెప్పినా సరే వినకుండా అతని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే పోలీసులు శ్రీకర్ ను తీసుకెళ్లడం అందరూ షాక్ అవుతారు.
శ్రీకర్ వెళ్లడం అందరికీ షాక్ గా అనిపిస్తే శ్రేయ మాత్రం నా భర్త లాంటి వాడు కాదు అని పోలీసులు వెంటపడుతుంది. నా భర్త దగ్గర గన్ లైసెన్స్ కూడా లేదండి ఎలా బెదిరిస్తారు నేను చెప్పేది వినండి అని ఎంత బ్రతిమలాడినా పోలీసులు వినకుండా కోర్టులో తేల్చుకోండి అమ్మ అని శ్రీకర్ ను తీసుకొని వెళ్తారు. శ్రేయ మాత్రం నేను ఇంట్లోకి రాను ఇక్కడే ఉంటాను.. నేను ఏడుస్తూ ఉంటే మీరందరూ పూజ చేసుకుంటారా అని బాధపడుతుంది. ఇదంతా జరగడానికి అవనినే కారణమని నానా మాటలు అంటుంది.
పెళ్లయిన తర్వాత కూడా నా భర్తని నీ అవసరాలకి వాడుకున్నావు ఇప్పుడు నువ్వే నా భర్తను తీసుకురావాలి నీకు ఒక గంట టైం ఇస్తున్నానని బెదిరిస్తుంది.. అవని పోలీస్ స్టేషన్ కి వెళుతుంది. నేను వస్తానని రాజేంద్రప్రసాద్ అంటాడు.. వెనకాలే అక్షయ్ వస్తాడు.. ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అక్కడ ఎంత ప్రయత్నించినా కూడా లాయర్లు రారు అని ఎస్సై అంటాడు. శ్రీయా ఫోన్ చేసి శ్రీకర్ తీసుకురాకపోతే మీ అందరి మీద కేసు పెడతానని అంటుంది.
Also Read : ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..
అప్పుడే అక్కడికి అక్షయ్ బాస్ వస్తుంది. నువ్వు అన్ని మాటలు అన్న పడ్డావు అంటే నువ్వు ఎంత మంచి దానివో నాకు అర్థం అయిపోయింది అని ఆమె అంటుంది. నువ్వేం బాధపడకు అవని నీకోసం నేను ఏదైనా చేస్తాను అని ఆమె అంటుంది.. వెంటనే జడ్జి చేత ఫోన్ చేయించి శ్రీకర్ ను రిలీజ్ చేస్తుంది.. పల్లవి మాత్రం చాలా రోజుల తర్వాత మంచి డ్రామా అని చూస్తున్నాను మంచి కిక్ ఇస్తుంది అని అనుకుంటుంది. అంత లోపలే అవని శ్రీకర్ ను తీసుకొని ఇంటికి వస్తారు. ఇక అందరూ కలిసి వ్రతం చేస్తారు. పల్లవి మాత్రం షాక్ లోనే ఉండిపోతుంది..
వ్రతం పూర్తయ్యా తర్వాత అక్షయ్ వాళ్ళ బాస్ నువ్వు నీ పెళ్ళాం బెస్ట్ కపులని అనుకుంటున్నాను.. వీరిద్దరి కోసం నేను ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను ఇది తీసుకోండి అని అంటుంది.. ఇందులో ఏముందో తెలుసా అని అడుగుతుంది. ఇందులో రాధాకృష్ణల బొమ్మ ఉంది మీరు కూడా ఎప్పుడు ఇలానే రాధాకృష్ణుల్లాగా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటుంది.. అందరితో సరదాగా మాట్లాడి నాకు ఆఫీస్ లో పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంది.. పల్లవి మాత్రం ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…