Illu Illalu Pillalu Today Episode September 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ చందు కు కావలసిన లక్ష రూపాయల కోసం అందరిని అడుగుతూ ఉంటాడు.. తన ఫ్రెండ్స్ అందర్నీ అడిగినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే ఈ క్రమంలో విశ్వకు ఆ విషయం తెలుస్తుంది.. దారిలో విశ్వ అడ్డుగా ఉంటాడు. ఏంట్రా లక్ష రూపాయల కోసం ఊరంతా అడుక్కుంటున్నావంట ఇదిగో ఆ లక్ష రూపాయలు అని మొహాన విసిరేస్తాడు.. డబ్బులని విసిరేయడంతో ధీరజ్ కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది.. నిన్ను అడిగానా నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు నువ్వు ఎవడ్రా నాకు ఇవ్వడానికి అని అడుగుతాడు.. నా చెల్లిని పెళ్లి చేసుకునేది డబ్బు కోసమే కదా నీలాంటి వాడు డబ్బులు అమ్మాయిని ఎరగవేసి ప్రేమ పేరుతో మోసం చేస్తుంటారు.. నీ గురించి మాకు తెలీదా అని విశ్వా అంటాడు. బావ బామ్మర్దుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ప్రేమ రావడంతో అక్కడి నుంచి విశ్వా వెళ్ళిపోతాడు. చూసావా నేను నిన్ను డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నానట.. వాడనే మాటలు విన్నావా అని రెచ్చిపోతాడు.. ఆ కళ్యాణ గాడు నిన్ను మోసం చేశాడు కాబట్టే ఏ దారి లేక చచ్చిపోతానంటే నిన్ను బ్రతికించడానికి పెళ్లి చేసుకున్నాను నీ మెడలో తాళి కట్టాను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఆరోజు నీ మెడలో తాళి కట్టుకున్న అంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉండేవాడిని నా ఇంట్లో వాళ్ళ దృష్టిలో అటు నీవాళ్ళ దృష్టిలో నేను చెడ్డవాన్ని అయిపోయానని బాధపడతాడు. ప్రేమ నీకు ఒక విషయం చెప్పాలి వింటావా అని అడుగుతుంది.. అసలు ఇదంతా కాదు ఆ కళ్యాణ్ గారిని ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి వారిని మీవాళ్లు ముందర పెట్టి, వీడే మీ అమ్మాయిని మోసం చేశాడు డబ్బు నగలతో పారిపోతుంటే నేను పరువు పోతుందని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాలని ఉంది అంటాడు.
ధీరజ్ అన్న మాటల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.. నాకు ఇంట్లో ఉన్న ఒకే ఒక్క దిక్కు నువ్వే నువ్వే ఇలా మాట్లాడితే నేను ఏమైపోవాలి నా బాధను ఎవరికి చెప్పుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధీరజ్ అయినా నా మాట వింటే బాగుంటుంది అని అనుకున్నాను. ప్రేమ బాధపడడం చూసిన ధీరజ్ సారీ మార్నింగ్ నువ్వు ఏదో చెప్తా ఉన్నావ్ మీ అన్న మీద కోపంతోనే నేను వెళ్ళిపోయాను అని అంటాడు.. నేను ఒక విషయం అడుగుతాను నువ్వు నిజంగా నిజం చెప్తావా అని ప్రేమ అడుగుతుంది.
ఏంటి అని ధీరజ్ అడుగుతాడు. తప్పని పరిస్థితిలో నా మెడలో తాళి కట్టావు కానీ.. మీద నీకు ఏమాత్రం ప్రేమ కనీసం ఇష్టం కూడా లేదు కదా అని అడుగుతుంది. నువ్వేదో కావాలని చేసుకున్నావు నీ మాటల్లోనే నాకు అర్థం అయిపోయింది నిజం చెప్పు అని ప్రేమ పదేపదే అడుగుతుంది. ధీరజ్ మాత్రం మౌనంగానే ఉంటాడు. నీ మౌనమే నాకు సమాధానం చెబుతుంది నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదని ఇంక నీకేం చెప్పాలి అని బాధపడుతుంది..
నర్మదా బాధపడుతుంటే సాగర్ నువ్వు బాధపడడానికి కారణం ఉంది నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకొని చూపిస్తానని అంటాడు. ఎన్ని పరిస్థితి ఎదురైనా నీ కంట్లో నీళ్లు రానివ్వకుండా చూసుకుంటాను. నా భార్య అయినందుకు నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ కంట్లో నీళ్లు వస్తే నేను తట్టుకోలేను నువ్వు ఇంకెప్పుడు ఏడవద్దు అని సాగర్ అంటాడు.. సాగర్ మాటలు విన్న నర్మదా సంతోషంతో సాగర్ ని కౌగిలించుకుంటుంది..
తిరుపతి బావ మీ ఒక్కదాని ఒక మరిదిని నా బాధను అర్థం చేసుకోవా ఏంటి అని అడుగుతాడు. మరి ఇంత కష్టపడే బదులు ఆ చెంబులను కట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్లి దాన్ని కట్ చేయించుకోవచ్చు కదా అని రామరాజు అంటాడు.. ఏడైనా ఏడువు అని తిరుపతిని అంటాడు. తిరుపతి నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను అక్క నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని వేదవతి తో అంటాడు. వేదవతి ఇంత బాధ పడే బదులు నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదురా వెళ్ళిపోరా అనేసి అంటుంది.
Also Read : మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..
ఈ చెంబును కట్ చేస్తే నాకు ఇక జన్మలో పెళ్లి కాదు. ఇది చాలా మహత్తరంగలిగిన చెంబు అట.. ఆ మాట తిరుపతి చెప్తూ ఉండగానే ఆనంద్ రావు అక్కడికి వస్తాడు. మా అమ్మాయిని చూద్దామని వచ్చాను బావగారు అని అంటాడు. శ్రీవల్లిని రామరాజు పిలుస్తాడు. నువ్వు ఇలా చెప్పా పెట్టకుండా ఫోన్ చేయకుండా వస్తే నేను చాలా ఇబ్బంది పడతాను నువ్వు ఏదో ఒకటి చేసిన నిరికిస్తావు అని అంటుంది.. ఆనందం ఎంత చెప్తున్నా సరే శ్రీవల్లి ఇక నుంచి వెళ్ళిపో అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..