Brahmamudi serial today Episode: అప్పు, కావ్యలను పై నుంచి కిందకు కింద నుంచి పైకి నడిపించడం ఇష్టం లేక కింద రూముల్లో ఉన్న సుభాష్, అపర్ణ, ప్రకాష్, ధనలక్ష్మీలను పై రూముల్లోకి షిఫ్ట్ అయ్యేలా చేస్తారు కళ్యాణ్, రాజ్. ఇక అందరూ ఎవరి రూముల్లోకి వాళ్లు వెళ్లిపోయాక రాజ్ రిలాక్స్ గా కూర్చుని చూశావా కళావతి వాళ్లను పైకి నిన్ను కిందకు ఎలా షిప్ట్ చేశానో.. ఆ సీత కష్టపడితే రాముడు చూడలేడు.. ఈ కళావతి కష్టపడితే ఆ రాజ్ చూడలేడు పర్మినెంట్‌గా సొల్యూషన్ ఎలా ఆలోచిస్తానో అన్నావుగా.. చూశావా జస్ట్ వన్ అవర్ లో ఎలా కనిపెట్టేసి సొల్యూషన్ పట్టేశానో.. అంటాడు.
దీంతో ఏంటి పట్టేసేది.. అత్తయ్య వాళ్లను పైకి పంపించడం సొల్యూషనా..? పాపం అత్తయ్య వాళ్లు కిందకు పైకి వెళ్లడానికి ఎంత ఇబ్బంది పడతారో అంటుంది కావ్య. దీంతో రాజ్ చూడు కళావతి అవ్వా కావాలి బువ్వ కావాలి అంటే కుదరదు.. కొన్ని భరించాలంటే కొన్ని కోల్పోక తప్పదు. కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోవాలి. కురుక్షేత్రంలో ధర్మాన్ని గెలిపించడానికి ఎంతో మంది సైన్యాన్ని చంపించాడు. మరి నేను నీ కష్టాన్ని తీర్చడానికి మా అమ్మానాన్ను జస్ట్ పైకి షిప్ట్ చేశాను.. అంతే కదా..? అంటాడు. కానీ వాళ్లు పైకి కిందకు తిరగడం నాకు నచ్చడం లేదండి.. అంటుంది. దీంతో రాజ నువ్వు పైకి కిందకు తిరగడం కూడా నాకు నచ్చడం లేదు.. చూడు కళావతి మనం జ్వరం తగ్గడానికి వేసుకునే టాబ్లెట్ లో కూడా మంచి చెడు ఉంటాయి. అది వేసుకోవడం మానేస్తామా..? మంచి జరగాలంటే.. ఎంతో కొంత చెడు జరగాల్సిందే..? అదంతా ఆలోచించకుండా ఈ రూమ్ ఎలా ఉందో చెప్పు.. మీలా బాగానే ఉంది అంటుంది కావ్య. దీంతో అయితే బాగుందన్న మాట.. అంటాడు రాజ్.
తర్వాత గార్డెన్‌లో కూర్చున్న అపర్ణ దగ్గరకు ధాన్యలక్ష్మీ వెళ్లి ఏంటక్కా రాత్రంతా నిద్ర పట్టలేదా..? అని అడుగుతుంది. అసలు నిద్రపోతేనే కదా..? రాత్రంతా దోమలు కొట్టడంతోనే సరిపోయింది అంటుంది అపర్ణ. అదేంటక్కా రూంల ఏసీ ఉంది కదా..? దోమలు ఎందుకు కొట్టావు.. అని ధాన్యలక్ష్మీ అడగ్గానే.. ఏసీ పని చేయోద్దు.. రాత్రి ఏదో షార్ట్ సర్య్కుట్ అయినట్టు ఉంది. పైగా కొత్త గది అసలు నిద్ర పట్టలేదు. రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది అని అపర్ణ చెప్పగానే.. అవునక్కా నా పరిస్థితి కూడా అంతే అయింది అని ధాన్యలక్ష్మీ వాపోతుంది. మన వెధవలు చేసిన పనికి సరిగ్గా నిద్ర లేక పీల్చేసిన బత్తాయి పండ్లలా అయిపోయాయి మన ముఖాలు అంటుంది అపర్ణ. ఇంతలో అక్కడికి వచ్చిన ఇంద్రాదేవి కానీ నా ముఖం మాత్రం ఆపిల్ పండులా నిగనిగలాడిపోతుంది అపర్ణ అంటుంది. అవునా అత్తయ్యా బాగా నిద్ర పట్టిందా మీకు అని అడుగుతుంది అపర్ణ. బాగా పట్టింది అని ఇంద్రాదేవి చెప్పగానే.. అవునులే అత్తయ్యా టైంకి మమ్మల్ని ఇరికించేసి మీరు జారుకున్నారు కదా..? ఇక నిద్ర పట్టకుండా ఎలా ఉంటుంది ముఖం నిగనిగలాడకుండా ఎలా ఉంటుంది అని అపర్ణ చెప్తుంది.
దీంతో ఇంద్రాదేవి నేనేం తప్పించుకోలేదు.. దీన్ని సమయస్పూర్తి అంటారు. అయినా వాడు గతం మర్చిపోయినప్పుడు పోల్చుకుంటే ఇవన్నీ ఎంత చెప్పు.. ధ్వజస్థంభం ముందు అగరబత్తి పుల్లంతా అని చెప్తుంది. అలాగా.. అయితే మనం ఒక పని చేద్దాం అత్తయ్యా అంటుంది. ఏంటది అని ఇంద్రాదేవి అడగ్గానే.. మీ గది నాకిచ్చి నా గది మీరు తీసుకోండి అని చెప్తుంది అపర్ణ. దీంతో కంగుతున్న ఇంద్రాదేవి.. అయ్యో నా వల్ల కాదు.. నాకు అసలే మోకాళ్ల నొప్పులు.. అన్ని సార్లు పైకి కిందకు తిరిగాలంటే అయిపోతాను అంటుంది. మా బాధ కూడా అదే మరి అంటుంది ధాన్యలక్ష్మీ.. సలహాలు చెప్పే వాళ్లకు బాగుంటాయి అత్తయ్య.. పాటించే వాళ్లకు కాదు.. వీళ్ల ప్రెగ్నెన్సీలు మా ప్రాణాల మీదకు వచ్చాయి.. ఏంటి అత్తయ్యా మా పరిస్థితి చూస్తుంటే మీకు నవ్వులాటలా ఉందా..? అంతేలే ఎంతైనా మీరు అత్తయ్యా కదా కోడళ్ల కష్టాలు మీకు ఆనందంగా ఉంటాయి అంటుంది అపర్ణ. దీంతో ఇంద్రాదేవి మీ కోడళ్లు మిమ్మల్ని కష్టపెడుతుంటే.. నన్ను అంటారా..? పోనీ ఒక పని చేయండి.. మీరు కిందకు వచ్చి హాల్లో పడుకోండి.. అని చెప్తుంది ఇంద్రాదేవి. వద్దులే అత్తయ్యా… అంటూ అపర్ణ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తర్వాత కావ్య రాజ్‌ను పిలిచి కాఫీ కావాలని అడుగుతుంది. దీంతో కాఫీ చేయడానికి రాజ్ దొంగ చాటుగా కిచెన్‌లోకి వెళ్తాడు. ఎవరైనా చూస్తే దొరికిపోతాను అనుకుని అక్కడే ఉన్న ఒక చీర తనకు చుట్టుకుని కాఫీ చేస్తుంటాడు. ఇంతలో హాల్లోకి కాపీ కోసం వచ్చిన ప్రకాష్‌ను తమకు కాపీ కావాలని అపర్ణ, ధాన్యలక్ష్మీ అడుగుతారు. సరే కాఫీ తీసుకొస్తానని కిచెన్‌లోకి వెళ్తాడు ప్రకాష్. కిచెన్‌లో రాజ్‌ను చూసి తన గర్ల్‌ఫ్రెండ్ అనుకుని వెనక నుంచి వెళ్లి హగ్ చేసుకుని శైలజ ఎలా ఉన్నావు అంటూ మాట్లాడతాడు. దీంతో రాజ్ ధాన్యలక్ష్మీని పిలిచి శైలజ సంగతి ఏంటో తేల్చుకోమని ప్రకాష్‌ను ఇరికిస్తాడు. తర్వాత కాఫీ తీసుకుని కావ్య దగ్గరకు వెళ్తాడు రాజ్. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం