Illu Illalu Pillalu Today Episode june 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా వేదవతితో మాకు ఆల్రెడీ శోభనం జరిగిపోయింది అని బాంబు పేలుస్తుంది.. వీళ్లిద్దరు మాట్లాడుకోవడం శ్రీవల్లి చాటుగా వింటుంది. శోభనం జరిగిందా అదేంటే ఎక్కడ జరిగింది ఒక ముహూర్తం పాడు పద్ధతి ఏమీ లేకుండా మీరు ఎలా శోభనం చేసుకున్నారు అని వేదవతి టెన్షన్ పడుతుంది. నా హైదరాబాద్ డ్రిప్ కి వెళ్ళాం కదా అక్కడే జరిగిపోయింది అని నర్మదా సిగ్గు పడిపోతుంది.. వేదవతి సీరియస్ గా ఉంటుంది.. శ్రీవల్లి నర్మదకు నిజంగానే కడుపు వచ్చిందా.. మా అమ్మ చెప్పినట్లే అత్తయ్య కోడల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అలా జరగకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రేమ ధీరజ్ తో వెళ్లాలని సమయం గడపాలని పరుగులు పెడుతుంది.. వీరజ్ బస్ స్టాప్ కి రావడం చూసి ప్రేమ అతనితో సైకిల్ మీద ఇంటికి వెళ్లాలని అనుకోని పరుగులు పెడుతుంది. మొత్తానికి ధీరజ్ తో సైకిల్ పై వస్తుంది. రాత్రి అందరు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన కామాక్షి ఏంటి అందరూ సరదాగా కూర్చుని మాటలు కబుర్లు చెప్పుకుంటున్నారు అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్, నర్మదా శాంతి ముహూర్తనికి రామరాజు పంతులు గారిని కలిసి వచ్చాను అని వేదవతితో అంటాడు. బడిపంతులు ఎందుకు ఏ బడికి వెళ్ళాలి అని వేదవతి అడుగుతుంది. దానికి రామరాజు మొన్న ఒకేచూరులో రెండు శోభనాలు జరగకూడదని అన్నారు కదా.. పంతులు గారిని అడిగి వచ్చాను శోభనానికి ముహూర్తం పెట్టారు అని చెప్పగానే వేదవతి షాక్ అవుతుంది. నర్మదా ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అత్తయ్య గారు మేనేజ్ చేసుకుంటారులే అనేసి అనుకుంటుంది.
ఆ మాట వినగానే శ్రీవల్లి పగలబడి నవ్వుతుంది. అందరూ శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఇద్దరికి ఆల్రడీ శోభనం అయిపోయింది మామయ్య గారు అని నర్మదా గుట్టు రట్టు చేస్తుంది.. ఆ మాట వినగానే నర్మదా షాక్ అయిపోతుంది. హైదరాబాద్ కి వెళ్లారు కదా అక్కడే వీళ్ళు శోభనం కూడా చేసేసుకున్నారు మావయ్య గారు అని బాంబు పేలుస్తుంది..
ఇక వేదవతి విషయాన్ని కవర్ చేయాలని అనుకుంటుంది. కానీ రామరాజు మాత్రం ఆ మాటను వినకుండానే వెళ్ళిపోతాడు. శ్రీవల్లి నర్మదను ఇరికించానని చెప్పి పక్కకు వెళ్లి డాన్స్ చేస్తూ ఉంటుంది. నర్మదా ప్రేమ అక్కడికి వెళ్లి ఒకరిపై మరొకరు మాటల యుద్ధం మొదలుపెడతారు. నర్మదా ప్రేమను అడ్డుపెట్టుకొని దారుణంగా తిడుతుంది. శ్రీవల్లికి బుద్ధొచ్చేలా చేయాలని ఇన్ డైరెక్ట్ గా వాళ్ళు డ్రామాని మొదలుపెడతారు. ప్రేమ వాళ్ళు కొంచమైనా బుద్ధి ఉండేలా మాట్లాడు అని ఇండైరెక్టుగా శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత ప్రేమ అద్భుతంగా భరతనాట్యం చేస్తుంది. అది చూసిన ధీరజు నువ్వు 10 మందికి పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్పొచ్చు.. అలా బతికేయొచ్చు అని సలహా ఇస్తాడు. ఆ మాట వినగానే ఇదేదో బాగుందని ప్రేమ ఆలోచిస్తుంది.. ఇదేదో బాగుందని ప్రేమ ధీరజ్ వెనకాలే వెళ్లి అడుగుతుంది. మొన్న ట్యూషన్ పెట్టి పెద్ద రచ్చ చేశావు ఇప్పుడు డాన్స్ క్లాస్లోని మొదలు పెడతావా ఏంటి అని ధీరజ్ అంటాడు. ఇంట్లో ట్యూషన్ చెప్పే ప్రాబ్లం కానీ బయటకు వెళ్లి డాన్స్ క్లాసులు చెప్తే ఎవరికి తెలియదు కదా అని ప్రేమ అనుకుంటుంది.. ధీరజ్ ఒక్కడే కష్టపడి చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు. మరి నేను ఇలా చేస్తే వాడికి కొంచెం సాయంగా ఉంటుందని ఆలోచిస్తుంది.
నర్మద ప్రేమ ఇద్దరు కూర్చుని ఉంటే వేదవతి అక్కడికి వెళుతుంది. ఏంటి అది కొంచెం కూడా సిగ్గు లేకుండా ఏ విషయాన్ని చెప్పాలో చెప్పకూడదు అని ఆలోచించకుండానే అలా చెప్పేసింది ఏంటి అని కోడళ్లతో అంటుంది.. మీరే ఏరి కోరి తెచ్చుకున్నారు కదా మీ ముద్దుల కోడల్ని ఇప్పుడు మీరే అనుభవించండి అని ఇండైరెక్టుగా సెటైర్లు వేసి వెళ్ళిపోతారు. ఈ ముగ్గురు కోడలతో నా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది.
చందు కి సేటు ఫోన్ చేసి రెండు రోజులు నాకు డబ్బులు ఇవ్వాలని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. కానీ చందు మాత్రం ఒక నాలుగు ఐదు రోజులు టైం ఇవ్వాలని అడుగుతాడు. సేటు మాత్రం ఏంటి నాటకాలు ఆడుతున్నావా ఇదేదో యవ్వారం తేడాగా ఉందే… నేను రెండు రోజులు మాత్రమే టైం ఇస్తున్నాను. నువ్వు కచ్చితంగా డబ్బులు ఇవ్వకుంటే మీ నాన్న దగ్గర ఈ విషయాన్ని చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. వల్లి వల అమ్మానాన్న పది రోజులు డబ్బులు ఇస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు ఏదీ మాట్లాడట్లేదు. వీళ్ళకు కొంచెం కూడా సిగ్గు శరం అనేది లేదని చందు ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ సాగర్ తిరుపతి అందరూ వచ్చి ఏంట్రా టెన్షన్ పడుతున్నావ్ ఏదైనా ఉంటే మాతో చెప్పు అని అడుగుతారు. శ్రీవల్లి వీళ్ళకి అసలు నిజం ఎక్కడ చెప్తారని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటిఎపిసోడ్ లోఏం జరుగుతుందో చూడాలి..