Kannappa:మంచు విష్ణు(Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa ). భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదలకు కేవలం కొద్ది రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో అటు విష్ణుతో పాటు ఇటు మేకర్స్ కూడా సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ.. ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ఆలస్యం వెనుక అసలు కారణం కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే విడుదలకు కనీసం నెల లేదా రెండు నెలల ముందే ఓటీటీ డీల్ కుదిరిపోతుంది. కానీ ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ఓటీటీ డీల్ కుదరకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు మంచు విష్ణు చేసిన కామెంట్లు చూస్తుంటే.. ఇంత ఓవర్ కాన్ఫిడెంట్ పనికిరాదు భయ్యా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.
పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కన్నప్ప టీం..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas ), మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal), ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఒక్కో ప్రాంతం నుంచి ఒక స్టార్ సెలబ్రిటీని సినిమాలో భాగం చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అటు భారీ విజువల్స్ తో నిర్మిస్తూ ఉండడంతో దేశ వ్యాప్తంగా అభిమానులలో, సినీ ప్రముఖులలో కూడా ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.
ఓటీటీ డీల్ ఆలస్యం వెనుక కారణం?
ఇదిలా ఉండగా తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓటీటీ డీల్ జరగకపోవడానికి కారణం ఏంటి? అని మంచు విష్ణుని ప్రశ్నించగా.. మంచు విష్ణు మాట్లాడుతూ..”ఓటీటీ ఆఫర్స్ కూడా చాలా వచ్చాయి. కానీ మొదట మేము అడిగిన రేట్ కి రాలేదు. మా సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే మాత్రం మేము అడిగిన రేటు ఇస్తామని వారు చెప్పారు. ఇక వారికి ఆ మొత్తం రెడీ చేసుకోమని కూడా చెప్పాము” అంటూ విష్ణు చాలా కాన్ఫిడెంట్ తో తెలిపారు.
ఇంత కాన్ఫిడెంట్ వర్కౌట్ అవుతుందా?
ఇకపోతే మంచు విష్ణు తన సినిమా పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో అర్థమవుతుంది. అయితే ఇదే కాన్ఫిడెంట్ సినిమా తర్వాత కూడా ఉంటుందా? సినిమా హిట్ అవుతుందా..? ఒకవేళ బెడిసి కొడితే ఉన్న డీల్ కూడా చేజారి పోతుందేమో? ఒకసారి ఆలోచించు విష్ణు అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఓటీటీ డీల్ ఆలస్యానికి మంచు విష్ణు కారణం తెలిపారు.. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుంది? మంచు విష్ణు టీం ఎంత డిమాండ్ చేశారు? అంత డబ్బు ఇవ్వడానికి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ ముందుకు వస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే జూన్ 27 వరకు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Big Boss: బిగ్ బాస్ షోకి భారీగా పెంచేసిన సల్మాన్ ఖాన్.. ఎన్ని కోట్లంటే?