Illu Illalu Pillalu Today Episode March 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. చందు ఎంగేజ్మెంట్ కోసం అందరూ రెడీ అవుతారు.. ధీరజ్ ని చూసిన రామరాజు మాత్రం వీడు పెళ్లికి రావడానికి వీల్లేదు బుజమ్మ అనేసి అంటాడు. మొన్న రెండుసార్లు పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చింది అది వాడివల్లే ఒకసారి ఏమో మీ అబ్బాయి ఎదురింటి అమ్మాయి నగలు తీసుకొని వెళ్ళిపోయాడు కదా అని అడిగింది నిన్న అవన్నీ జైల్లో పడేలా చేసాడు ఇక ఇప్పుడు నిశ్చితార్థం పెళ్లి ఆగిపోయే పరిస్థితి కూడా రావచ్చు అందుకే వాన్ని రావద్దని చెప్పు అనేసి అంటారు. నీకు అది అర్థం చేసుకున్న ధీరజ్ నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అన్నయ్య నేను ఎప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే వాడిని అనేసి మీరందరూ వెళ్లే అంటాడు . ఆ తర్వాత భాగ్యం వాళ్ళు గుడిలో ఉంటారు శ్రీవల్లి గుడిలో ఎంగేజ్మెంట్ అంటే క్యాన్సల్ అవుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. రామరాజు భాగ్యం కి ఫోన్ చేసి ఎక్కడికి రమ్మంటారు చెల్లెమ్మ ఫంక్షన్ హాల్ ఎక్కడైనా అందరూ అడుగుతున్నారు అంటే మీరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చేసేయండి అన్నయ్య అని అంటుంది. గుడిలో ఫంక్షన్ ఏంటి అని అందరూ షాక్ అవుతారు. భాగ్యం పక్క ప్లాన్ తో అసలు విషయాన్ని బయటపెడుతుంది ఇక చేసేదేమీ లేకుండా రామరాజు ఫంక్షన్ కి ఒప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చందు తన తమ్ముడి లేడని బాధపడుతూ ఉంటాడు. దానికి టైం అవుతుందని పంతులుగారు పిలుస్తున్నారు. త్వరగా రెడీ అయ్యి రావాలి అల్లుడు అని వాళ్ళ మామ పిలుస్తాడు. కానీ చిన్నోడు లేకపోవడం బాధగా ఉంది మామ అని అందరూ బాధపడతారు. అటు శ్రీవల్లిని నర్మద వాళ్ళు రెడీ చేస్తుంటారు. మీ అబ్బాయికి నగలు వేస్తారా మా అక్కకి నగలు వేయరా అనేసి అంటుంది. శ్రీవల్లి వాళ్ళ చెల్లెలు. నగలు ఇస్తే ఎందుకు వెయ్యము అనేసి చందు వాళ్ళ చెల్లెలు అంటుంది.
మా అక్కకి నగలు లేకపోవడమేంటి 50 కేజీల బంగారం ఉంది ఇదిగో ఇక్కడే అనేసి గొప్పగా చెప్తుంది. ఆ నగలను చూసి అందరూ షాక్ అవుతారు. ఇన్ని నగలు ఉన్నాయా అనేసి ఆశ్చర్యపోతారు. వీటికి ఇలా షాక్ అయితే మా ఇంట్లో చాలా ఉన్నాయి. బ్యాగులు బరువు అవుతున్నాయని తీసుకురాలేదు. మరి అవి చూస్తే మీరు ఏమైపోతారు అని గొప్పగా చెప్తుంది. ఇంక చాలా నగలు ఉన్నాయని వీళ్ళు ఆశ్చర్యపోతారు. అయితే నర్మద మాత్రం ఈ నగలను ఎక్కడ కొన్నారు చాలా బాగున్నాయి అనేసి అంటుంది.
ఈ నగలను మేము షాపులో కొనలేదు మాకు వేరే అతను చేసి పెడతాడు. ఆయన చేత చేపించాము అంటే అప్పుడు చందు వాళ్ళ చెల్లెలు చాలా బాగున్నాయి నేను కూడా మా నాన్నకు చెప్పి అతని చేత చేయించుకుంటాను. నాకు ఒకసారి అతని నెంబర్ ఇవ్వండి అనేసి అడుగుతుంది. శ్రీవల్లి తన చెల్లెలు ఇద్దరు పొగరు మొహాలు ఒకటి చూసుకుంటారు ఆ నెంబరు మా అమ్మ దగ్గర ఉంటుంది. మా అమ్మని అడిగి ఇస్తాను అని శ్రీవల్లి అంటుంది.
అప్పుడే భైరవి అక్కడికి వస్తుంది. ఇగో అమ్మడు పంతులుగారు పిలుస్తున్నారు అని వస్తుంది. అప్పుడు నగలు గురించి వాళ్ళు అడుగుతారు. అది నా ఫోన్లో ఉంది నా ఫోన్ ఏమో మైండ్ దగ్గర ఉంది. ఈ నిశ్చితార్థం అయిన తర్వాత ఆ నెంబర్ నీకు ఇస్తాను సరైన అని భాగ్యం మేనేజ్ చేస్తుంది. ఇక చందు వాటర్ క్యాన్స్ తీసుకొని గుడికి వస్తాడు. అక్కడ వాళ్ళ అన్న నిశ్చితార్థం జరుగుతుండడం చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక వాటర్ క్యాన్లు వేస్తూ ఉంటాడు.
భాగ్యము భోజనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడాలని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చందు భాగ్యంకి డాష్ ఇస్తాడు. భాగ్యం నువ్వు రామరాజు గారి చిన్నబ్బాయి కదా మరి నువ్వేంటి ఇలా వాటర్ కెళ్ళు మూసుకున్నావ్ ఏంటి అని రాంరాజు వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తుంది భాగ్యం. మీ చిన్నబ్బాయి ఎందుకు రాలేదంటే చాలా ముఖ్యమైన పని ఉండి రాలేకపోయాడు అన్నారు ఇదేనా ఆ ముఖ్యమైన పని వాటర్ కాయలు వేస్తున్నాడు అనేసి భాగ్యం ఎగతాళిగా మాట్లాడుతుంది. భాగ్యం మాటలకి అందరూ ఫీలవుతారు కానీ ప్రేమ మాత్రం తప్పేంటి గౌరవంగా బతుకుతున్నాడు తప్ప దోపిడీ చేయలేదు దొంగతనం చేయలేదు కదా అనేసి వెనకేసుకొస్తుంది. అది చూసిన ధీరజ్ షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి..