Illu Illalu Pillalu Today Episode may 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి చెప్పగానే రామరాజు చూసావా 8 నుంచి 10వేల ఖర్చు అవుతుంది అంటే నువ్వు సంపాదించాల్సింది ఇంకా ఉంది అనేసి ఎద్దేవా చేసి మాట్లాడుతాడు. అది విన్న శ్రీవల్లి నవ్వుకుంటుంది. ఇంకా తర్వాత అయినా మావయ్య గారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అడుగుతుంది.. ఏంటమ్మా అది అంటే ఇంట్లో మా ఆయన ఒక్కడే జాబ్ చేస్తున్నాడు జీతం ఇస్తున్నారు. మిగతా ఇద్దరు కొడుకులు మీకు జీతం ఇయ్యట్లేదు అంటే మా ఆయన ఒక్కడే కదా ఇంటి మొత్తాన్ని పోషిస్తున్నాడని అడిగేస్తుంది. ధీరజ్ చదువుతున్నాడు. ఖర్చే తప్ప, ఏమి ఉపయోగం లేదు.
సాగర్ మన రైస్ మిల్లులోనే పనిచేస్తున్నాడు.. ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వలేదు. అని మొహాన్నే చెప్పేస్తుంది. అది విన్న నర్మదా సీరియస్ అవుతుంది. సాగర్ ను అనడంతో నర్మదా శ్రీవల్లితో గొడవకు దిగుతుంది. అక్క మా ఆయన అంటే నేను అసలు ఊరుకోను. మా ఆయన మిల్లులో పనిచేస్తున్నాడు. మీ ఆయన ఎంత ఇచ్చాడు.. మా ఆయన చేస్తున్న దానికి 70 వేలకు పైగా మావయ్య ఇవ్వాలి. మా ఆయన ఎక్కువ జీతం సంపాదిస్తున్నాడు అన్న విషయం నీకు అర్థం కావట్లేదు అని శ్రీవల్లి గాలి తీసేస్తుంది. ఇక రామరాజుకి అర్థమయ్యేలా నర్మదా చెప్తుంది. మొత్తానికి కొడుకులు మధ్య శ్రీవల్లి చిచ్చు పెట్టేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి బాధపడుతూ కూర్చోండడం చూసి నర్మదా ఎలాగైనా సరే అత్తయ్యని కాస్త నవ్వించాలి లేదంటే ఇలాగే బాధపడుతుందని అక్కడికి వస్తుంది. ఎందుకు మీరు ఇంత బాధ పడుతున్నారు అని నర్మదా అడుగుతుంది. ఇంట్లో ఇలాంటి జరుగుతుంటే నేను ఎంత ఎలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నాను అని నర్మదను అంటుంది. మీరు ఎందుకింత బాధగా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ధీరజ్ మాత్రం ఒక క్లారిటీతో ఉన్నాడు.. నా భార్యను ఎలా పోషించుకోవాలి తను జీవితంలో ఎలా పైకి రావాలని ఆలోచనతో ఉండడం మంచిదే కదా అని నర్మదా అంటుంది. అయితే అప్పుడే ప్రేమ అక్కడికి వస్తుంది. నీ గురించి మీ ఆయన గారు ఎంత గొప్పగా చెప్పారు ఇప్పుడే నాకు అత్తయ్య చెప్పింది మంచిదే కదా.. ఎప్పుడు లేనిది ఇంత సిగ్గు పడుతున్నావ్ అంటే ఏదో ఉంది అని నర్మదా అనగానే ప్రేమ మురిసిపోతుంది..
మాకు తెలిసిపోయిందిలే అత్తయ్య అంతా చెప్పింది.. పేరు చెప్పగానే కోపంతో రగిలిపోయేదానివి.. ఇప్పుడు మాత్రం ధీరజ్ పేరు చెప్పగానే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. సిగ్గుపడుతున్నావు. ఇదంతా ఎలా జరిగింది? ఎప్పుడు ప్రేమలో పడ్డావు అని నర్మదా వేదవతి ప్రేమను ఆటపట్టిస్తారు.. ఇక నర్మదా హైదరాబాద్కు వెళ్లాల్సిన విషయం గురించి వేదవతి తో మాట్లాడాలని అనుకుంటుంది. రామరాజు ఎక్కడ తిడతాడేమో అని భయపడుతూ ముందుగానే తప్పించుకుని వెళ్ళిపోతాడు.. తిరుపతి మాత్రం ధీరజ్ గురించి గొప్పగా చెబుతూ రామరాజుని పొగిడేస్తాడు.
మొత్తం నీలాగే ఉన్నాడు బావ ఆ పొగరు ఆ ధైర్యం అంతా నువ్వే కదా అని అనగానే రామరాజు కూల్ అయ్యి ధీరజ్ని అవున్రా నిజమైన వారు ఏ రోజైనా మంచి పొజిషన్ కి వస్తాడు అంటూనే ఉంటాను కదా అది కచ్చితంగా నిజం చేస్తాడని అంటాడు. నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ కు వెళ్లాలి మీరు పర్మిషన్ ఇప్పియ్యాల అత్తయ్య మామయ్యకి మీరు ఎలాగైనా ఒప్పించి చెప్పాలని అంటుంది. శ్రీవల్లికి తెలిస్తే ఖచ్చితంగా చెడగొడుతుందని అందరూ నాటకమాడుతారు.
తనకి నర్మదా వేదవతిని తన మాటలతో బురిడీ కొట్టించి హైదరాబాద్ కు వెళ్లేందుకు రామరాజు తో చెప్పించాలని అనుకుంటుంది.. రాత్రి అందరూ కూర్చొని ఉండగా వేదవతి మనము అన్నవరం వెళ్లాలని అనుకుంటున్నాం కదండి అని అంటుంది.. నర్మదా నాకు కుదరదు ఆ టైంలో వెళ్లాలంటే నేను హైదరాబాద్ కి వెళ్ళాలి అని ఇండైరెక్టుగా హింట్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో శ్రీవల్లి నర్మదను హైదరాబాదుకు పోనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…