BigTV English

Brahmamudi Serial Today May 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకుని కావ్యను తిట్టిన రాజ్‌ – శోకసంద్రంలో కావ్య  

Brahmamudi Serial Today May 13th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం తెలుసుకుని కావ్యను తిట్టిన రాజ్‌ – శోకసంద్రంలో కావ్య  

Brahmamudi serial today Episode:  యామిని, రాజ్‌ను తీసుకుని ఇంటికి వస్తుంది. వాళ్లను చూసిన రుద్రాణి ఇప్పుడు మొదలవుతుంది అసలైన కథ అనుకుంటుంది. యామిని రాజ్‌ తో కలిసి లోపలికి వచ్చి కావ్యను పలకరిస్తుంది. రాజ్‌, యామినిని చూసిన వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఏంటి కళావతి షాక్‌ అవుతందని అనుకుంటే మీరందరూ షాక్‌ అవుతున్నారు అంటుంది యామిని. నేను ఎవరో అని చూస్తున్నారా..? నేను కళావతి ఫ్రెండ్ ను నిజం చెప్పాలంటే మా బావ రామ్‌ తనకు ఫ్రెండ్‌ మా మొదటి పెళ్లి పత్రిక కళావతికి ఇవ్వాలని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఇంత మంది పెద్దవాళ్లు ఉండగా కళావతికి ఇవ్వడం ఎందుకు పెద్దవాళ్లకే ఇస్తాను అంటూ వెళ్లి ఇంద్రాదేవికి కార్డు ఇస్తుంది. రాజ్‌ను పిలిచి ఇంద్రాదేవి దంపతులతో ఆశీర్వాదం ఇవ్వమని అడుగుతుంది.


ఇంద్రాదేవి దీర్ఘాయుష్సుమాన్‌భవ అంటుంది. దీంతో యామిని మేము సడెన్‌ గా వచ్చే సరికి షాక్‌ లో ఉన్నారనుకుంటా..? దీర్ఘసుమంగళిభవ అనాలి.. మీరు దీర్ఘాయుష్సుమాన్‌భవ అంటున్నారు అంటుంది యామిని. ఇంతలో రుద్రాణి పర్వాలేదులో యామిని దీర్ఘ ఆయుష్సుతో ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది రుద్రాణి. కరెక్టుగా చెప్పారు ఆంటీ మీరు కూడా మా పెళ్లికి తప్పకుండా రావాలి అనగానే. రుద్రాణి అయ్యో ఎందుకు రాము ఇంటికి వచ్చి పిలిచాక తప్పకుండా వస్తాము అని చెప్తుంది. ఇంతలో అక్కడకు అపర్ణ వస్తుంది. అపర్ణను చూసిన రాజ్‌ షాక్‌ అవుతాడు. మీరు అని అడగబోతుంటే.. యామిని మీరు ఆరోజు గుడిలో అన్నదానం చేసేటప్పుడు బర్తుడే కేక్‌ తీసుకొచ్చి సెలబ్రేట్‌ చేశారు కదా..? ఆవిడే ఈవిడ కదా..? మీకు కళావతికి ఏంటి సంబంధం.. మీరు ఈ ఇంటలో ఎందుకు ఉన్నారు..? అని యామిని అడుగుతుంది. దీంతో రుద్రాణి…అదేంటి అలా అడుగుతున్నావు.. మా వదిన ఈ ఇంటికి పెద్ద కొడలు.. తన ఇంట్లో తను ఉండకుండా ఇంకెక్కడ ఉంటుంది అని చెప్తుంది.

మరి కళావతికి తనకి ఏంటి సబంధం అని యామిని అడగ్గానే.. రుద్రాణి ఇది మరీ బాగుంది. వాళ్లిద్దరూ అత్తాకోడళ్లు కాబట్టే కలిసి ఉన్నారు.. అని చెప్పగానే.. మరి గుడిలో ఇద్దరూ ఏ సంబంధం లేనట్టు ఎందుకు నటించారు.. నేను చెప్పాలా..? బావ.. వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు బాగా తెలుసు కానీ ఎమీ తెలియనట్టు నీ ముందు నటించారు. నిన్ను మోసం చేశారు అంటూ యామిని చెప్పగానే.. ఇంద్రాదేవి కోపంగా చాల్లే ఆపు మోసం చేయాల్సిన అవసరం నా కోడలుకు లేదు.. అంటుంది. దీంతో యామినిని చూశావా బావ వీళ్ల నాటకాలు.. నిన్ను వాళ్ల వైపుకు తిప్పుకోవడానికి రిసార్ట్స్‌  నాటకం ఆడారు. కానీ నువ్వు కళ్లు తిరిగి పడిపోయేసరికి భయపడి పారిపోయారు. అప్పుడు నేను ఒక్కదాన్నే నిన్ను హాస్పిటల్‌ కు తీసుకెళ్లి కాపాడుకున్నాను బావ. కానీ నువ్వు మాత్రం కళ్లు తెరవగానే కళావతి రాలేదా..? అని అడిగావు… ఇప్పటికైనా అర్తం అయిందా బావ ఎవరు మోసగాళ్లో ఎవరు మంచోళ్లో అంటుంది. దీంతో కావ్య ఏవండి తన మాటలు నమ్మకండి.. తను చెప్పేవన్నీ అబద్దాలే. అంటుంది. దీంతో రాజ్‌ నేను మిమ్మల్ని ఒకే మాట అడుగుతాను. ఆవిడ మీకు ముందే తెలుసా..? ఆవిడకు మీకు ముందే పరిచయం ఉందా… అని రాజ్‌ అడగ్గానే.. కావ్య ఉందని చెప్తుంది. రాజ్‌ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యామిని నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు నాకే సపోర్టు చేశాడు. మీ ఇద్దరి మధ్య ముడిపడింది దాన్ని ఎవ్వరూ విడదీయలేరని అంటుంటావు కదా ఆ ముడిని విడదీశాను. ఇక గుడ్‌బై అంటూ యామిని వెళ్లిపోతుంది.


కావ్య కూలబడిపోతుంది. ఆయనతో ఉన్న మా బంధాన్ని యామిని తెంచేసింది అత్తయ్యా.. ఆయన దృష్టిలో నేను ఒక మోసగత్తేను ఇక ఎప్పటికీ ఆయన నన్ను చూడరు అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది. రుద్రాణి, రాహుల్ హ్యాపీగా పీలవుతారు. హమ్మయ్య మనం అనుకున్నది. అనుకున్నట్టుగానే జరిగిపోయింది. ఇక రాజ్‌ ఎప్పటికీ ఈ గడప తొక్కడు.. కావ్యకు ఎదురుపడడు. త్వరలోనే నువ్వు ఈ ఇంటికి వారసుడివి కాబోతున్నావు అంటుంది. రాహుల్ అవును మమ్మీ అంటూ హ్యాపీగా ఫీలవుతాడు.

తర్వాత అపర్ణ, ఇంద్రాదేవి, కళ్యాణ్‌, అప్పు,స్వప్నలు కలిసి రాజ్‌ను ఎలా ఇంటికి తీసుకురావాలి అని ఆలోచిస్తుంటారు. ఇంతలో అపర్ణ అందరం వెళ్లి కావ్యే తనను లవ్‌ చేస్తుందని చెబితే రాజ్‌ ను ఇంటికి తీసుకురావొచ్చు అంటుంది. అలా అయితే ముందు రాజ్‌తో ఎవరు మాట్లాడతారు అని అడుగుతుంది అపర్ణ. దీంతో ఉన్నాడు కదా తమ్ముడు కానీ తమ్ముడు కళ్యాణ్‌ నువ్వే వెళ్లి మాట్లాడాలి అని చెప్తుంది అప్పు. నేనెందుకు అప్పు ఉంది కదా మాట్లాడటానికి అంటాడు కళ్యాణ్‌. అది మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. నువ్వే మాట్లాడు కళ్యాణ్‌ అంటుంది ఇంద్రాదేవి. సరేనని కళ్యాణ్‌ రాజ్‌కు ఫోన్‌ చేసి అన్నయ్య నేను అంటాడు. అన్నయ్యా అనగానే గుర్తు పట్టడానికి నేనేం చిరంజీవి కాదు. నువ్వేం పవన్‌ కళ్యాణ్‌ కాదు. పేరు చెప్పు అంటాడు రాజ్‌.

దీంతే అదే అన్నయ్యా మొన్న రిసార్ట్స్‌ లో కలిశాం కదా కళ్యాణ్‌.. కళావతి గారి మరిదిని అని చెప్పగానే.. ఓ కళ్యాణ్‌ నువ్వా చెప్పు ఏంటి విషయం అంటాడు రాజ్‌.. ఏం లేదు అన్నయ్యా మీతో ఒక ఇంపార్టెంట్‌ విషయం మాట్లాడాలి ఒకసారి కలుద్దామా..? అనగానే ఏం ఫోన్‌లో మాట్లాడలేవా..? అంటాడు రాజ్‌. దీంతో అది ఒక ఇంపార్టెంట్‌ విషయం అన్నయ్యా కలిసే మాట్లాడాలి అది వదిన గురించి అని చెప్తాడు కళ్యాణ్‌. కళావతి గారి గురించా ఎక్కడ కలుద్దాం.. ఎప్పుడు కలుద్దాం అంటూ ఆత్రుతగా అడుగుతాడు రాజ్‌. లోకేషన్‌ పెడతాను ఇప్పుడే కలుద్దాం అన్నయ్యా అంటూ కళ్యాన్‌ ఫోన్‌ కట్‌ చేస్తాడు.

తర్వాత యామిని, కావ్యకు ఫోన్‌ చేసి నువ్వు నా రాజ్‌కు ఎంత దగ్గరైనా చివరికి దూరం అవ్వాల్సిందే.. అన్నదానం చేసి దగ్గరవ్వాలనుకున్నాం.. కానీ అత్తయ్యను దాస్తే మోసం అవుతుందని తెలియలేదా..? అంటుంది. దీంతో కావ్య కోపంగా నేనేం మోసం చేయలేదు.. చేసిందంతా నేవ్వే చేశావు అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×