BigTV English

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు ప్రామిస్ చేసిన సాగర్.. ధీరజ్ ను అవమానించిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: నర్మదకు ప్రామిస్ చేసిన సాగర్.. ధీరజ్ ను అవమానించిన రామరాజు..

Illu Illalu Pillalu Today Episode may 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ఆనందరావుని పట్టించాలని కష్టపడు వస్తుంది కానీ ఆనందరావు తెలివిగా ముందే ఇంట్లోకి వచ్చేసి గండం నుంచి బయటపడతాడు. ఇక అందరూ కూల్ అయ్యాక నల్లపూసల గుచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడదామని భాగ్యం అంటుంది. ఈ పూజ కార్యక్రమం అయిపోయేలోగా నర్మదను ఏడిపించే తీరుతానని భాగ్యం మనసులో అనుకుంటుంది. నల్లపూసల గుచ్చే కార్యక్రమానికి టైం అయిందని అక్కడికి వెళ్లి పూజ చేయాలని భాగ్యం అందర్నీ పూజ గదిలోకి తీసుకెళ్తుంది.. అందరూ సరదాగా కూర్చొని నల్లపూసలు వేస్తూ ఉంటారు. అయితే భాగ్యం నర్మద చేత ఎలాగైనా కన్నీళ్లు పెట్టించాలి లేకుండా అంటే నాది బురిడీ బ్యాచ్ అని బయట పెట్టాలనుకుంటాదా దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసి తన పక్కన ఉన్న ఆవిడకి అసలు విషయం చెప్తుంది. ఆవిడ ఇదిగో భాగ్యం రామ రాజు గారి ఇద్దరు కోడలు మెడల్లో చూస్తుంటే నల్లపూసలు వేయలేదు కదా అని అడుగుతుంది. ఓ నీకు ఈ విషయం తెలియదా వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అన్నమాట అందుకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదు. ఇక నల్లపూసలు ఎవరు వేస్తారు అని భాగ్యం అనగానే నర్మదాప్రేమ ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. వేదవతి వదిన గారు ఇప్పుడు అవన్నీ మీకెందుకు మా కోడల గురించి ఆవిడ అడిగిందా? మీరు ఆవిడకి చెప్పాల్సిన అవసరం లేదు కదా అనేసి అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ నర్మదాలు బైక్ మీద వెళ్తారు. నర్మదను సాగర్ ఆఫీస్ దగ్గర దిగబెడతారు. మీరు ఆఫీస్ వచ్చేసింది దిగితే నేను వెళ్తానండి అని సాగర్ కాసేపు సరదాగా మాట్లాడుతాడు. నర్మద మాత్రం సాగర్ పై సీరియస్ గానే ఉంటుంది. నేను ఒక విషయం గురించి అడుగుతాను మీరు నిజం చెప్తారా అని అడుగుతుంది. ఏమైంది అంటే మన పెళ్లి అయింది అంటే నాకు పెళ్లి గురించి అన్ని డేట్లు గుర్తున్నాయి రోజు నిమిషాలతో సహా గుర్తుంది అని చెప్తాడు. నర్మదా ఇన్నిరోజులలో ఒక్కరోజేనా నన్ను సరదాగా బయటికి తీసుకెళ్ళారా కనీసం ఈ ఊరు నుంచి దాటించారా అని అడుగుతుంది.

ఏమో రైస్ మిల్లులో నేనేమో ఈ ఆఫీసులో నాలుగు గోడల మధ్య నన్ను తాళి కట్టి బందీని చేసేసారు అని అంటారు. ఇప్పటివరకు ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చేది ఇప్పటినుంచి మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు మన ఇష్టం. ఇద్దరం కలిసి సరదాగా అలా బయటకెళ్ళి చూద్దాం సాయంత్రం కచ్చితంగా మనం రెస్టారెంట్ కి వెళ్దామని సాగర్ అంటాడు. నమ్మొచ్చా అని నర్మదా అంటుంది ఖచ్చితంగా నమ్ము అని సాగర్ అంటాడు.


ఇక రామరాజు మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ తలుపు వేయలేదని ఆలోచిస్తుంటాడు. అంతలోకే.. అందరూ ఇంటికి రావడం చూసి రామరాజు అందరు వచ్చేసారా చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదేంటి ఎక్కడికెళ్లారు అని అడుగుతాడు. బుజ్జమ్మ వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారండి అని అంటుంది. అప్పుడే ధీరజ్ ప్రేమ ఇద్దరూ ఆటోలో దిగుతారు. వాళ్ళిద్దరి ఇంట్లోకి రాగానే ఏంటి మీరిద్దరూ బండి మీద వస్తున్నారని మీ అమ్మ చెప్పింది మరి మీరిద్దరేంటి ఆటోలో వచ్చారు అని అడుగుతాడు. బండి పాడైపోతే పక్కన పార్కు చేసి ఆటో ఎక్కొచ్చాము అని ధీరజ్ అంటాడు. ఏంటి బండి పాడయిందా? అయితే బండిని అక్కడ పెట్టకుండా బాగు చేయించుకుని తీసుకు రావాల్సింది పోయి అక్కడ ఎక్కడో పెట్టొచ్చానంటావ్ ఏంట్రా నీ కొంచమైనా బుద్ధుందా అని రామరాజు సీరియస్ అవుతాడు. ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా బుద్ధి రాలేదా అని అరుస్తుంటే శ్రీవల్లి నవ్వుకుంటుంది.

శ్రీవల్లి నవ్వడం చూసి ప్రేమ సీరియస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది.. ప్రేమకు కళ్ళు తిరిగాయి నాన్న నీరసంగా ఉండింది. అందుకే నేను అక్కడ వెయిట్ చేయించలేక ఆటోలో తీసుకొచ్చాను అని అంటాడు.. అయితే ఆ విషయం ముందే చెప్పాలి కదరా ప్రేమకు ఎలా ఉందో ఏంటో చూసుకో అని చెప్పేసి పంపిస్తాడు.. ఇక బుజ్జమ్మ రామరాజు దగ్గరికి వచ్చి కొత్త కోడలు ముందర మీ కొడుకుని ఎలా చేసి మాట్లాడితే ప్రేమ ఫీల్ అవుతుంది కదా మీరు ఎందుకు అలా అంటున్నారు అని అంటుంది..

దానికి రామరాజు మాత్రం నా కొడుకులకు బాధ్యత చెప్పడం తప్ప వాళ్ళు ఎంత పెద్ద అయినా సరే నాకు చిన్నపిల్లలే అని రామరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఇక ప్రేమ దగ్గరికి వేదవతి వెళ్లి నువ్వేం ఫీల్ అవ్వకమ్మ నీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. కోడలు ముందర ధీరజ్ని మావయ్య గారు అలా అనడం తప్పే కదా అత్తయ్య అనేసి అడుగుతుంది. ఆయన చేసిన తప్పే కానీ తన కొడుకుల మీద ఉన్న ప్రేమ గురించి ఆలోచించు అని వెళ్ళిపోతుంది. నర్మద మాత్రం సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.

సాగర్ రెస్టారెంట్ కి వెళ్ళాలి అని పర్మిషన్ తీసుకుంటాడు. రామ రాజు మాత్రం నాలుగు రోజులు మిల్లు తెరవలేదు చాలా పనులుంటాయి నువ్వు ఇలాంటి టైం లో ఇలా బయటికి అని తిరుగుతావా ముందు లోడ్లు చాలా ఉన్నాయి పంపించాల్సినవి మన మీద నమ్మకం పోకుండా చూసుకోవాలి కదా అనేసి అరుస్తాడు.. నర్మద మాత్రం సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన కోసం వెయిట్ చేస్తే నాకు బీపీ పెరగడం తప్ప ఇంకేమి ఉండదు. రైస్ మిల్ లో పని ఉన్నట్టుంది అందుకే రాలేకపోయాడు ఏమో అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో నర్మదా సాగర్ రెస్టారెంట్లో ఉండడం చూసి రామరాజు షాక్ అవుతాడు. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×