Smartphone Overheating Exploding| నేటి జీవనశైలిలో మొబైల్ ఫోన్లు అవసరంగా మారాయి. వీటివల్ల కలిగే సౌలభ్యాలు ఎన్ని ఉన్నా, కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు వార్తల్లో చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఫోన్లు వేడెక్కిపోయి పేలిపోవడానికి కారణమవుతున్నాయి.
ఇలాంటి ప్రమాదాలకు బ్యాటరీయే ప్రధాన కారణం. ఎక్కువగా వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు అధిక ఉష్ణోగ్రతలకు గురైతే లేదా ఓవర్ ఛార్జింగ్ అయినా పేలే ప్రమాదం ఉంటుంది. తక్కువ నాణ్యత కలిగిన బ్యాటరీల వాడకమూ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్ పడిపోయి లోపాలు వస్తే కూడా పేలే ప్రమాదం ఉంటుంది. నకిలీ ఛార్జర్లు లేదా తగని కేబుల్‌ల వాడకమూ ఫోన్ వేడెక్కటానికి కారణమవుతుంది.
ఈ ప్రమాదాలను నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ఫోన్‌తో వచ్చిన అసలైన ఛార్జర్‌నే ఉపయోగించాలి. నాసిరకం ఛార్జర్లు, ఎక్కువసేపు ఛార్జింగ్ వద్దు. ఫోన్‌ను అధిక వేడి లేదా నేరుగా సూర్యకాంతి గల ప్రదేశాల్లో ఉపయోగించకూడదు. బ్యాటరీ డ్యామేజ్ అయితే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అలాగే టెంపర్డ్ గ్లాస్, మంచి ఫోన్ కేసులు వాడటం ద్వారా వేడిని తగ్గించవచ్చు. ఈ జాగ్రత్తలతో ఫోన్‌ను సురక్షితంగా వాడవచ్చు.
Also Read: ఏసీతో కరెంటు బిల్లు వాచిపోతోందా.. ఈ టిప్స్‌తో సమస్యకు చెక్!
స్మార్ట్‌ఫోన్లు వాడకంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడి పరిమితి మించితే జాగ్రత్త అవసరం. సూర్యకాంతి నేరుగా ఫోన్‌పై పడటం, వేడి వాతావరణం, ఎక్కువ యాప్‌ల వినియోగం, వీడియోలు చూడటం, గేమ్‌లు ఆడటం వల్ల ఫోన్ వేడెక్కవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు చేయకపోవడం, హానికరమైన సాఫ్ట్‌వేర్ కూడా కారణం కావచ్చు.
ఈ టిప్స్ పాటించండి