Squid Game 3:స్క్విడ్ గేమ్ (Squid Game).. అనుక్షణం ఉత్కంఠ భరితంగా.. ఊపిరి కూడా సడలించలేని సన్నివేశాలతో అందరిని ఆశ్చర్యపరిచిన సీరీస్ ఏదైనా ఉంది అంటే అది ‘స్క్విడ్ గేమ్’ మాత్రమే అని చెప్పవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix )వేదికగా మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే రెండు సీజన్లు మంచి ప్రేక్షక ఆదరణను పొంది భారీ విజయం సొంతం చేసుకోగా.. ఇప్పుడు మూడవ సీజన్ కూడా వచ్చేస్తోంది. తాజాగా ‘స్క్విడ్ గేమ్ 3 ‘ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. అంతేకాదు జూన్ 27 నుంచి ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు టీజర్ చివర్లో టీం వెల్లడించింది. దీంతో ఈ సీజన్ 3 కోసం ఎదురుచూస్తున్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారని చెప్పవచ్చు.
స్క్విడ్ గేమ్ 3 టీజర్..
ఇక తాజాగా టీజర్ లో ఏముంది అనే విషయానికొస్తే.. షియెంగ్ జీ హున్ ఈ ఆటకు ఎలాగైనా సరే ముగింపు పలకాలనే లక్ష్యంతో కొనసాగుతూ ఉంటాడు. మరి ఈ ఫ్రంట్ మ్యాన్ ను అంతం చేశాడా? లేదా? అనేది చూపించనున్నారు. ఈ టీజర్ ను పోస్ట్ చేసిన నెట్ఫ్లిక్స్ కూడా “చివరి ఆటలను ఆడటానికి సమయం వచ్చేసింది” అని పేర్కొంది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ లో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈసారి సముద్ర జలాలలో కూడా ఏదో ఆట ఆడినట్లు మనకు ఇందులో చూపించారు. రెడ్ అండ్ బ్లూ కలర్ బాల్స్ తో లైఫ్ అండ్ డెత్ గేమ్ ఆడబోతున్న ఈ సీజన్ 3 ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
AALSO READ:Mega 158: మెగాస్టార్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ.. ఏ పాత్రకో తెలిస్తే షాక్..!
స్క్విడ్ గేమ్ సీజన్ 2 లో ఏం జరిగింది?
ఇందులో షియెంగ్ జీ హున్ అన్ని దశలు పూర్తి చేసి, 45.6 బిలియన్ కొరియన్ వన్ లు సొంతం చేసుకుంటాడు. కానీ ఆట అతనిపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. మనుషులనే పావులుగా మార్చి.. ఈ ఆట ఆడిస్తున్న మాస్కు కలిగిన ఆ ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తిని కనిపెట్టి, ఈ గేమ్ కి ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఈ గేమ్ లోకి తీసుకు వెళ్ళే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బును కూడా మంచినీళ్ళలా ఖర్చు చేస్తూ ఉంటాడు. అలాగే మరొకవైపు తన అన్నయ్యను కనిపెట్టడానికి స్క్విడ్ గేమ్ లోకి సోల్జర్ లా వెళ్లి గాయపడిన హ్వాంగ్ జున్ హో తిరిగి కోలుకొని డిటెక్టివ్ ఉద్యోగంలో చేరుతాడు. ఒకరోజు అనుకోకుండా షియెంగ్ జీ హున్ ను కలుస్తాడు. అసలు ఈ స్క్విడ్ గేమ్ ను ఎవరు ఆడిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నంలో షియెంగ్ జీ హున్ కి హ్వాంగ్ జున్ సహాయపడాలనుకుంటారు. అలా వీరిద్దరూ కలిసి ఫ్రంట్ మ్యాన్ ని కనిపెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో వారికి అనేక సవాళ్లు కూడా ఎదురవుతాయి.ఇక వాటిని దాటుకొని షియెంగ్ చివరికి ఫ్రంట్ మ్యాన్ ను కనిపెట్టి పట్టుకుంటాడు. అక్కడితో ఆ సీజన్ ముగుస్తుంది. ఇక తర్వాత ఏం జరగబోతోంది? అనేది ఇప్పుడు సీజన్ 3 లో చూపించబోతున్నారు.