Nindu Noorella Saavasam Serial Today Episode: నిజం బయటపడితే తన పరిస్థితి ఏంటని మనోహరి భయంగా ఆలోచిస్తుంది. ఇంతలో చంభా వచ్చి మనోహరిని ఇంకాస్త భయపెడుతుంది. లాభం మనోహరి సమయం మించి పోకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్తుంది. ఏ నిర్ణయం తీసుకోమంటావా.? ఇప్పుడు పారిపోవడానికా ఇన్నాళ్లు ఇక్కడ ఉన్నది అంటుంది మనోహరి. ప్రమాదం వస్తున్నప్పుడు పారిపోక తప్పదు.. అంటుంది చంభా. నేను అలా చేయలేను అంటుంది మనోహరి. దీంతో పోనీ రణవీర్ సాయం ఏమైనా అడుగుదామా..? అంటుంది చంభా.. రణవీరా.. తనేం చేస్తాడు అంటుంది మనోహరి. ఫోన్ చేసి విషయం చెప్పు తను ఏమైనా చేయోచ్చు కదా అని చంభా చెప్పగానే.. మనోహరి సరే చేయ్ అని చెప్తుంది.
చంభా రణవీర్‌కు కాల్ చేస్తుంది. కాల్ లిప్ట్ చేసిన రణవీర్ చెప్పు చంభా అక్కడ విశేషాలేంటి..? దీపావళి ఎలా జరిగింది అని అడుగుతాడు. చంభా కోపంతో కలిసిన భాదతో ఇక్కడ దీపావళి జరగలేదు.. కథాకళి జరిగింది అని చెప్పగానే.. ఏం జరిగింది చంభా అంటాడు రణవీర్. దీంతో చంబా.. భాగీ కట్టుకున్న చీరకు మనోహరి ఏదో రసాయనం పూసి భాగీ మంటల్లో కాలి బూడిదై పోవాలని పథకం వేసింది మనోహరి. కానీ అది బెడిసికొట్టింది అని చెప్పగానే.. రణవీర్ నవ్వుతూ ఎప్పుడూ జరిగేది అదే కదా..? ఆ తలతిక్క మనోహరి ఏదో దిక్కు మాలిన ప్లాన్ వేస్తుంది. అదేమో అనుకోకుండా రివర్స్ అవుతుంది. కొన్ని రోజులుగా ఆ ఇంట్లో అదే జరుగుతుంది. అలాంటివి ఎన్ని జరిగినా మనోహరికి బుద్ది ఉండదు.. సిగ్గు రాదు.. అంటూ రణవీర్ చెప్పగానే.. పక్కన కూర్చుని వింటున్న మనోహరి కోపంగా ఫీల్ అవుతుంది.
కానీ ఇప్పుడు మనోహరి చిక్కుల్లో పడింది. ఆ చీరను అమరేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాడు అని చెప్పగానే.. రణవీర్ నవ్వుతూ మిలటరీ వాడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది అంటాడు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో నిజం బయట పడిందంటే మనోహరి ప్రమాదంలో పడుతుంది అని చంభా చెప్పగానే.. పడని పడితే నాకేంటి..? అంటాడు రణవీర్. అదేంటి రణవీర్ అలా అంటావు ఎంతైనా మనోహరి నీ మాజీ భార్యే కదా..? అంటుంది చంభా.. ఆ ఫీలింగ్ నాకైతే లేదు.. మనోహరికి అసలే లేదు అంటాడు రణవీర్. మనోహరిని కాపాడు రణవీర్ ఎలాగైనా ఈ గండం నుంచి గట్టెక్కంచు అని చంభా రిక్వెస్ట్ చేసినా రణవీర్ ఒప్పుకోడు.. నా వల్ల కాదు.. అమరేంద్ర తో పెట్టుకోవడం అంటే చావుతో పెట్టుకోవడం అని నాకు బాగా అర్థం అయింది. దీంతో చంభా అలా అనకు రణవీర్ ఈ ఒక్కసారికి కాపాడు అని అడుగుతుంది.
ఇందులో నేను తలదూర్చను అమ్మా నా వల్ల కాదు అయినా ఈ ప్లాన్ నన్ను అడిగి వేశారా ఏంటి..? అమరేంద్ర జోలికి పోవద్దని చిలకకు చెప్పినట్టు చెప్పాను ఆ మనోహరికి తను నా మాటలను అసలు కేర్ చేయలేదు అంటాడు రణవీర్. పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు రణవీర్.. మనోహరిని నీ భార్యగా కాకపోయినా నీ స్నేహితురాలిగా చూసి కాపాడు రణవీర్ అని చెప్పగానే.. తను స్నేహానికి కూడా విలువ ఇవ్వదు.. సొంత స్నేహితురాలినే చంపేసింది. అలాంటి దానిని అస్సలు నమ్మకూడదు. అదో పెద్ద కంత్రీ కన్నింగ్, తడి గుడ్డతో గొంతు కోసే కసాయి. దాని పక్కన ఉంటే నువ్వు కూడా పోతావు చంభా నా మాట విని అక్కడి నుంచి వచ్చేసేయ్ కనీసం ప్రాణాలతో అయినా ఉంటావు అని చెప్పగానే..
మనోహరిని వదిలేసి ఎలా రమ్మంటావు రణవీర్ అని చంభా అడగ్గానే. తనతో ఉంటే చస్తావు అని చెప్తున్నాను కదా..? మనోహరి ఏదీ తన గొంతు దాకా తెచ్చుకోదు.. ఆ పరిస్థితే వస్తే.. ఎదుటి వాళ్ల మీదకు తోసేసి తను తప్పుకుంటుంది. ఈ చీర విషయంలో కూడా అదే జరుగుతుంది. అనవసరంగా నువ్వు బలి పశువు అవుతావు.. సో నువ్వు వెంటనే లగేజీ సర్దేసుకుని అక్కడి నుంచి వచ్చేసేయ్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నిన్ను కోల్ కతా పంపిచేస్తాను అని రణవీర్ చెప్పగానే.. చంభా సరే రణవీర్ ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది. అంతా విన్న మనోహరి కోపంగా చూస్తుంది.
తర్వాత పిల్లలందరూ రూంలో ఉంటే అంజు డ్రాయింగ్ వేస్తుంది. ఏం వేస్తున్నావని అడగ్గానే. చెల్లిని గీస్తున్నాను అని చెప్తుంది. డ్రాయింగ్ అయిపోయాక ఆ పేపర్ గాల్లో తేలుతూ కిందకు హాల్లోకి వస్తుంది. ఆరు ఫోటో దగ్గర పడుతుంది. అది చూసిన మిస్సమ్మ పాప ఫోటో ఆక్క ఫోటోకు అడ్డుగా పడింది అంటుంది. దీంతో రాథోడ్ నీకింకా అర్థం కాలేదా..? అరుంధతి మేడమే నీకు బిడ్డగా పుట్టబోతుందని అర్థం అని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.