Gundeninda GudiGantalu Today episode November 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. మనోజ్ ప్రభావతిని బలవంతంగా లోపలికి తీసుకొని వస్తాడు. ఏమైందిరా అంటే నన్ను మోసం చేశారమ్మ దారుణంగా మోసపోయాను. నాలుగు లక్షలు నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోయారు. ఏదో ఒకటి చేయాలి అమ్మ అని కాళ్ళ వెళ్ళపడతాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి రా నువ్వు ఏ పని సరిగ్గా చేయవని ప్రభావతి మనోజ్ ని కొడుతుంది. అన్ని డిగ్రీలు ఉన్నాయి నువ్వు ఒకటి చెవిటివి అని దారుణంగా తిట్టేస్తుంది.. మీనా నగలు నాకు ఇవ్వమ్మా నేను మళ్ళీ ఎలాగోలాగా చేసి ఆ నగలను తీసుకొచ్చి ఇస్తాను అని అంటాడు.. చేసేదేమీ లేక తీసుకొని వచ్చి ఇస్తుంది. మధ్యలో సత్యం ఏంటవే అని అడుగుతాడు.. మొత్తానికి మనోజ్ కి ఇవ్వాలని అనుకుంటుంది. ఎలాగైనా సరే ఈ నగలని మనోజ్ కి ఇవ్వాలి లేకపోతే రోహిణి దగ్గర పరువు పోతుందని ఆలోచిస్తుంది ప్రభావతి. సరే నేను వెళ్లి నగలను తీసుకొని వస్తానని ప్రభావతి లోపలికి వెళ్లి నగలను తీసుకొని వస్తుంది. మొత్తానికి కిందా మింద పడి మనోజ్ కు నగలను ఇచ్చేస్తుంది ప్రభావతి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే…మీనా తెచ్చిన చేపల కవర్ ని ప్రభావతి తీసుకొని బయటికి వచ్చేసి మనోజ్ కు ఇస్తుంది. మనోజు తాకట్టు కోసమని బంగారు కొట్టుకు వెళ్తాడు. మరి ఏదో పచ్చి చేపల వాసన వస్తుంది అని అనగానే అంతా వెతుకుతారు కానీ మనోజ్ చేతిలో ఉన్న కవర్లో ఆ చేపలు ఉన్నాయని తెలుసుకోలేక పోతాడు. సేటు దగ్గరికి వెళ్లి నాకు ఒక నాలుగు లక్షలు కావాలి అని చేపలని అతని ముందు వేస్తాడు. ఇందాక నుంచి చేపల కంపు కొడుతుందని అందరూ అనుకుంటున్నారు.. నీ దగ్గర చేపలు పెట్టుకొని నాటకాలు ఆడుతున్నావా ముందు ఈ చేపలను తీసుకెళ్లి అక్కడ పడేయ్ అనేసి అంటారు.
నేను బంగారమే తీసుకొచ్చాను సేటు.. కానీ అవి చాపలు ఎలా అయ్యాయో నాకు అర్థం కావట్లేదు అని మనోజ్ అంటాడు. నువ్వు బంగారు తీసుకొని వస్తే ఇవి చేపలు ఎందుకు అయ్యాయి గాల్లో ఏమైనా చేపలు వచ్చి బంగారాన్ని తినేశాయా ఏంటి అని సేటు మనోజ్ ని దారుణంగా తిట్టేస్తాడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది సేటు నేను చూస్తే తీసుకొస్తాను అని మనోజ్ మళ్ళీ వెళ్ళిపోతాడు.. మీనా కూర చేసేందుకు చేపల కర్రీ లోపలికి తీసుకొని వెళ్తుంది..
చింతపండు మర్చిపోయాను తీసుకొస్తాను అని వెళ్లి తీసుకొని వచ్చేలోగా అక్కడున్న కవరు మాయమవుతుంది.. ఇక్కడ చేపల కవర్ పెట్టాను అత్తయ్య మీరు ఏమైనా చూశారా అని అడుగుతుంది.. చాపల కవర్ నాకేం తెలుసు నాకు తెలియదు అని ప్రభావతి అంటుంది. అదేంటమ్మా మీనా నువ్వు ఇందాకే కదా చేపలు ఉన్న కవర్ ని లోపలికి తీసుకొని వెళ్ళావు.. తీసుకొని వెళ్లి పెట్టాను మామయ్య ఇప్పుడు కనిపించడం లేదు అని అంటుంది..
పిల్లి ఏమైనా ఎత్తుకెళ్లిందేమో అని ప్రభావతి అంటుంది. పిల్లి ఎత్తుకెళ్లడానికి కవర్ తో సహా ఎత్తుకెల్లదు కదా అని నేను అంటుంది. కవర్ నా దగ్గర ఉంది అని అనగానే ఏంటి ఆ కవర్ నువ్వు తీసావా అని సత్యం అంటాడు. అదేంటి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని సత్యం అడక్కని ఇది నా బ్లౌజ్ పీసులు చేప ముక్కలు కాదు. ఇందాక గుద్దుకున్నప్పుడు కవర్లు మారిపోయాయి ఆ చేప ముక్కలు మనోజ్ దగ్గర ఉన్నాయి అని అంటారు.. టైలర్ షాపు నాకు తెలుసు. నేను వెళ్లి ఆ కవర్ ని తీసుకొస్తాను అని బాలు అంటే ఏం అవసరం లేదు మనోజ్ గాడికే తెలుసు కదా వాడు వస్తాను అంటాడు లే.. వాడే తీసుకుని వెళ్తాడు అని ప్రభావతి గొడవ చేస్తుంది.
అసలు ఇంతగా నువ్వు మనోజ్ కి ఇవ్వాలని అనుకుంటున్నావు ఈ కవర్లో ఏమున్నాయి అని బాలు చూడాలని అనుకుంటాడు. ఇది నా బ్లౌజ్ పీసులు రా మనోజే వచ్చి తీసుకెళ్తాడు లే అనేసి అనగానే అంతలోపే మనోజ్ వస్తాడు.. చూసుకోలేదు లేదారా ఎదవ అని బాలు అడుగుతాడు. ఇదిగో చాప ముక్కల కవరు తీసుకెళ్లి నీ పని నువ్వు చూసుకో పో అని ప్రభావతి మీనా పై అరుస్తుంది. ఆమె చేతిలో ఉన్న కవర్ని తీసుకోగానే నాలుగో వస్తాయా అని మనోజ్ ని అడుగుతాడు.
Also Read:‘ మాస్ జాతర ‘ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
వస్తాయి లేరా వెళ్ళు అని ప్రభావతి అంటుంది. నాలుగేంటి అనని బాలు అడుగుతాడు. నాలుగు మీటర్ల అని అంటున్నాడు అని ప్రభావతి మొత్తానికి మనోస్ ని మేనేజ్ చేసి బయటికి పంపిస్తుంది.. సేటు షాప్ లోకి వెళ్లిన మనోజ్ ని సేటు దారుణంగా అవమానిస్తాడు. మరేం పర్లేదు మనకు కావలసింది డబ్బులే కదా అని మనోజ్ అతనికి బంగారు చూపిస్తాడు. దీనికి నీకు రెండు లక్షలు మాత్రమే వస్తాయి అని సేటు అనగానే మనోజ్ ఫ్యూజులు అవుట్ అవుతాయి. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..