BigTV English
Advertisement

Brahmamudi Serial Today November 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి షాక్‌ ఇచ్చిన కావ్య, రాజ్‌     

Brahmamudi Serial Today November 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి షాక్‌ ఇచ్చిన కావ్య, రాజ్‌     

Brahmamudi serial today Episode: మారువేషంలో వచ్చిన కావ్య, రాజ్‌లను రాహుల్‌ గుర్తు పట్టి బయటకు వెళ్లమని చెప్పగానే.. మా ఆస్తంతా మీకు ఇచ్చి ఇక్కడే కాలం గడిపేద్దాం అని వస్తే నువ్వు మమ్మల్ని వెళ్లమంటావా..? అని అడుగుతారు. దీంతో కూయిలి మీరు ఎక్కడికి వెళ్లొద్దు.. ఇక్కడే నాతోనే ఉండాలి అంటుంది. రంజిత్‌ కూడా అవును ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్తాడు. రాజ్‌ నిజంగానా… అని అడగ్గానే..అవును మీరు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే నాతోనే ఉండాలి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్తుంది. దీంతో రాజ్ ఆహా దీని మాటలు వింటుంటే చెవుల్లో సీసం పోసినట్టు ఉంది కదా..? అంటాడు. మరే మనకు ఏ లోటు రాకుండా చూస్తాను అంటుంటే ఇక మన ఆస్థిని దీని చేతిలో పెడితే.. ఆ ఆస్తిని ఇంకెంత బాగా చూసుకుంటుందో.. అని కావ్య చెప్పగానే.. అవును బామ్మ గారు కరెక్టుగా చెప్పారు.. చాలా బాగా చూసుకుంటాను అని కూయిలీ అంటుంది.


ఆస్థి లేదు ఏమీ లేదు.. నేను రాను మీరు వెళ్లండి అని రాహుల్‌ చెప్పగానే.. చెప్పాను కదా రాహుల్‌ వాళ్లు ఎక్కడికి వెళ్లరని.. బామ్మ తాతయ్యలకు నేను కనెక్టు అయిపోయాను. నేను మా తాతయ్య, బామ్మలను చూసినట్టు ఉంది. వాళ్లకు కావాలసినన్ని రోజులు ఇక్కడే ఉంటారు అని కూయిలీ చెప్పగానే.. పెనిమిటి ఫిక్స్‌ చేసేసింది అని కావ్య చెప్తుంది. నేను అప్పుడే అనుకున్నాను.. దీని ముఖం కందగడ్డలా ఉన్నా మనసు ఎర్రగడ్డలా ఉంది అని అంటాడు రాజ్‌. ఇంతలో రాహుల్‌ వెంటనే కూయిలీ నువ్వు వెళ్లి వీళ్లకు కాఫీ తీసుకురా మీ మామయ్యను కూడా తీసుకెళ్లు అని చెప్పగానే.. కావ్య ఏం మాట్లాడతావురా..? అని అడుగుతుంది. కూయిలీ మీరు లోపలికి వెళ్లండి అని చెప్పగానే కూయిలీ, రంజిత్‌ లోపలికి వెళ్తారు.. రాజ్‌, కావ్యలను తీసుకుని బయటకు వెళ్తాడు రాహుల్‌.  అసలు ఎందుకొచ్చారు మీరు అని అడుగుతాడు.

దీంతో ఓహో గుర్తు పట్టావా..? అని రాజ్‌ అనగానే.. గుర్తు పట్టక మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా..? అంటాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరుగుతుంది. మేం చెప్పినట్టు మాతో వచ్చేయ్‌ లేకపోతే నీ కూయిలీకి నిజం చెప్తాము అని బయపెట్టగానే రాహుల్‌ నిజం చెప్పొద్దని.. తాను రానని చెప్తాడు. ఇంతలో కూయిలీ కాఫీ తీసుకుని వస్తుంది. కూయిలీని చూసి రాజ్‌, కావ్య మ్యాటర్‌ డైవర్ట్‌ చేస్తారు. కూయిలీ ఇచ్చిన కాఫీ తాగి బయటకు ఊసేస్తారు.. దీంతో అయ్యో బామ్మ గారు ఏమైంది అని కూయిలీ అడుగుతుంది.


దీంతో రాజ్‌ ఇది కాఫీయా… కుడితా..? అని అడుగుతాడు. ఈ కాఫీ కుడితి నీళ్లలా ఉందేంటే..? అంటే నీకు కాఫీ పెట్టడం కూడా రాదా..? అనగానే.. కాఫీ పెట్టడం రాని దానితో నువ్వు కాపురం ఎలా చేస్తావురా..? ఎదవ అంటాడు రాజ్‌. అయ్యో సారీ తాతయ్య గారు.. అంటుంది కూయిలీ. అర్థం అయింది దీనికి వంట కూడా వచ్చినట్టు లేదుగా ఓరేయ్‌ రాహుల్‌ దీన్నా నువ్వు కావాలంటున్నది.. వద్దురా వద్దు అని కావ్య చెప్పగానే కూయిలీ బామ్మ గారు అలా అనకండి మీకు కావాల్సినవన్ని .. మీరు తినాల్సినవన్నీ హోటల్‌ నుంచి తెప్పిస్తాను అని చెప్తుంది. హోటల్‌ నుంచి తెప్పిస్తావా..? అని రాజ్‌ అడగ్గానే.. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నుంచి తప్ప వేరే హోటల్‌ ఫుడ్‌ మేము తినము అంటుంది. కూయిలీ సరే అంటుంది. దీంతో రాజ్‌, కావ్య తాము తినడానికి కావాలసిన ఐటెమ్స్‌ డీటెయిల్స్‌ చెప్పగానే.. కూయిలీ షాక్‌ అవుతుంది.

తర్వాత రంజిత్‌ దగ్గరకు వెళ్లి రాజ్‌, కావ్య చెప్పిన లిస్ట్‌ గురించి చెప్తుంది. దీంతో అదంతా ఒక్కరోజుకే లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. అయితే వాళ్ల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి వెయ్యి రెట్ల ఆస్థిని నొక్కోయాలి అని చెప్తుంది కూయిలీ. మరోవైపు బాధపడుతూ ఉన్న స్వప్నను అప్పు వచ్చి ఓదారుస్తుంది. కావ్య, రాజ్‌ వెళ్లారు కదా..? అంతా వాళ్లు చూసుకుంటారు. నువ్వు ఇలా బాధపడటం మానేసి ధైర్యంగా ఉండు అని చెప్తుంది. మరోవైపు రాజ్‌, కావ్యలకు ఖర్చు పెట్టలేక రంజిత్‌ బాధపడుతుంతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: జైలు నుంచి ధీరజ్ రిలీజ్.. పండగ చేసుకున్న సేన, భద్ర.. కోడళ్ల పై రామరాజు ప్రశంసలు..

Intinti Ramayanam Today Episode: కూతురు కోసం వచ్చిన మీనాక్షి.. చక్రధర్ ను అవమానించిన పల్లవి.. నిజం బయటపడుతుందా..?

GudiGantalu Today episode: చేపలు ఎత్తుకెళ్లిన మనోజ్.. తప్పించుకున్న ప్రభావతి.. మనోజ్ పని అవుట్..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today November 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు పుట్టబోయే బిడ్డను డ్రాయింగ్ వేసిన అంజు

Srimukhi: వచ్చే ఏడాది శ్రీముఖి పెళ్లి.. 10 మంది పిల్లలు కంటానంటోన్న లాస్య.. వీళ్లకు ఏమైంది?

Mahesh Babu Kalidas -Sandra : పెళ్లి బంధంతో ఒక్కటైన బుల్లితెర జంట..ఫోటో వైరల్!

Big Stories

×