 
					Srimukhi: శ్రీముఖి (Sreemukhi)బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం స్టార్ మాలో పలు కార్యక్రమాల ద్వారా సందడి చేస్తున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివార్(Aadivaram with star maa parivaram) కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో బుల్లితెర నటీనటులు పాల్గొని సందడి చేస్తున్నారు. తాజాగా ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు.
కార్తీక పౌర్ణమి (Karthika Pournami)స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆడియన్స్ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి వారి కోరికను తెలియజేస్తూ ఆ కోరిక తీరుతుందా లేదా అనే విషయాన్ని అక్కడే ఉన్న ఆడియన్స్ నుంచి సమాధానాన్ని రాబట్టారు. ఈ క్రమంలోనే శ్రీముఖి వచ్చి ఏడాది కార్తీక పౌర్ణమికి నేను మీ బావతో కలిసి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను నా కోరిక నెరవేరుతుందా లేదా అంటూ అడగడంతో అక్కడున్న వారందరూ ఎస్ అని సమాధానం చెప్పారు. ఇలా శ్రీముఖి వచ్చే ఏడాదికి చేసుకోవాలని బలంగా నిశ్చయించుకున్నారని తాజాగా ఇదే విషయం బయట పెట్టారంటూ అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు నిజంగానే శ్రీముఖి కోరిక నెరవేరి వచ్చే ఏడాదిలోగా పెళ్లి చేసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అంతలోపు లాస్య వచ్చి నాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నాకు ఇటువైపు 5 మంది ఇటువైపు మరో 5 మంది పిల్లలు కావాలి అంటూ కోరుకున్నారు. అంతమంది పిల్లలు దేనికి అంటూ అడగడంతో స్టార్ మా పరివారానికి రావడానికి అంటూ సెటైరికల్ గా సమాధానం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో సీరియల్ నటి కావ్య కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కావ్య వేదిక పైకి వచ్చి.. నేను ఏ షోకి వెళ్లిన, బయట ఎక్కడికి వెళ్లినా అందరూ నన్ను ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడు ఈ ప్రశ్న ఎవరు నన్ను అడగకూడదు ఒకవేళ నన్ను ఎవరైనా అడిగితే వాళ్లకు కూడా నా పరిస్థితి రావాలి అంటూ ఈమె పరోక్షంగా బ్రేకప్ గురించి చాలా సీరియస్ గా మాట్లాడటంతో ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నటి సిరి హనుమంత్ వచ్చేయడానికి శ్రీముఖి స్థానంలో నేను యాంకర్ గా ఉండాలని ఒక్కసారిగా శ్రీముఖికి షాక్ ఇచ్చారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ ఎపిసోడ్ చాలా సరదాగా ఉండబోతుందని తెలుస్తోంది.
Also Read: Rahul Ravindran: ట్రైలర్, టీజర్ తో తప్పుదారి పట్టించాం.. అసలు విషయం చెప్పిన రాహుల్!