 
					Mahesh Babu Kalidas -Sandra: నేడు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లు మాత్రమే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే సూర్య నిశ్చితార్థం జరుపుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు అయితే తాజాగా మరో బుల్లితెర జంట పెళ్లి పీటలు ఎక్కి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు మహేష్ బాబు కాళిదాసు(Mahesh Babu Kalidas) ఒకరు.
మహేష్ బాబు ప్రస్తుతం పలు సీరియల్స్ నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన మరొక బుల్లితెర నటి సాండ్రా (Sandra)తో గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు వీరిద్దరూ సమప్రయాణం అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ వీరికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేవారు. గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో నేడు ఒకటయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక వీరిద్దరూ తమ పెళ్ళికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
నిజానికి వీరి వివాహం శ్రావణమాసంలోనే జరగాల్సి ఉండగా సీరియల్స్ షూటింగ్ కారణంగా కుదరలేదని అందుకే కార్తీకమాసంలో తమ వివాహం నిశ్చయించుకున్నామని వెల్లడించారు అయితే ఈరోజు నటుడు మహేష్ బాబు పుట్టినరోజు కావటం విశేషం. ఇలా తన పుట్టినరోజు తను ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు నడవడం చాలా సంతోషంగా ఉందని వీరిద్దరూ ఇది వరకు ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శుభస్య శీగ్రమ్ సీరియల్ లో జంటగా..
మహేష్ బాబు సాండ్రా శుభస్య శీగ్రమ్ అనే సీరియల్లో కలిసి నటించారు ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు . అయితే ఇది వరకే నటి సాండ్రా వేరొక అబ్బాయిని 19 సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. మహేష్ బాబు మనసిచ్చి చూడు, శుభస్య శీగ్రమ్ వంటి సీరియల్స్ లో నటించారు. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సాండ్రా ముద్దమందారం, కలవారి కోడలు, ఆటో విజయశాంతి వంటి సీరియల్స్ చేశారు. ఇక ఈమె సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ జంట కెరియర్ పరంగా సీరియల్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: Manchu Lakshmi: సర్వనాశనం అవుతారు.. శాపనార్థాలు పెట్టిన మంచు లక్ష్మి.. ఏమైందంటే?