E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 2nd: రాత్రి అవగానే అమూల్య పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది.. విశ్వం అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా ఏంట్రా బండ సచ్చినోడా..?  ఈ టైంలో అర్జెంటుగా మాట్లాడాలి అని ఫోన్ చేసావ్ ఉదయం మాట్లాడుకోవడానికి కుదరదా అని అంటుంది.. మా అన్నయ్య వదినని కలిపే ప్రయత్నం చేయమని చెప్తే నువ్వు ఏం చేస్తున్నావ్ నాకు అర్థం కావడం లేదు అని అమూల్య అంటుంది. అయితే ప్రేమ దురదలు ఇంట్లో నుంచి బయటకు రావడంతో అక్కడున్న అమూల్య విశ్వం ఇద్దరు కలిసి పేపర్ ప్లాన్ చేస్తారు. ఆ ప్లాను వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి అన్న కొట్టుకోవడానికే పనికి వచ్చినట్లు ఉంటుంది విశ్వం ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవుతుంది. ఇక సాగర్ అర్జెంటుగా వెళ్లాలి మనం బయటికి వెళ్లి పోదామని అంటాడు. సాగర్ ఇద్దరూ కలిసి అర్జెంటుగా బయటకు వెళ్లిపోతారు. నీ ప్లాన్ ఇంత దారుణంగా ఫెయిల్ అవుతాయి నేను అసలు అనుకోలేదు అని అమూల్య అనగానే విశ్వం ఫీల్ అవుతాడు.

నిజం చెప్పేసిన అమూల్య..

అమూల్య మెల్లగా ఇంట్లోకి వెళ్ళగానే.. అక్కడే ఉన్నా నర్మదకు దొరికిపోతుంది. అసలు నువ్వెందుకు బయటకెళ్ళి వస్తున్నావు అని అడుగుతుంది నర్మదా.. ఎక్కడికి వెళ్లావు అమూల్య అని అడగగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిజంగానే బయటికి వెళ్ళావా అని అడుగుతుంది అవును వదిన.. ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ బయటే ఉన్నాను అని అబద్ధం చెప్తుంది.. ఇప్పుడు కాదు మధ్యాహ్నం నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది అమూల్య నేను కాలేజీలోనే ఉన్నాను అని ఎంత చెప్తున్నా సరే.. నర్మద మాత్రం నేను నిన్ను ఐస్ క్రీమ్ పార్లర్ లో చూశాను అని అంటుంది. ఆ మాట వినగానే అమూల్య షాక్ అవుతుంది.. ఇద్దరిని నేను ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర చూశాను అని నర్మద చెప్పగానే అమూల్య షాక్ అవుతుంది. మేము ఏమి వేరే కారణాల వల్ల వదిన కేవలం ధీరజ్ అన్నయ్యని వదినని కలపడానికి ఇదంతా చేసాము అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు వాడు మారిపోయాడు అని అమూల్య అంటుంది. నువ్వు కుట్రలు చేసే ఫ్యామిలీ కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది.

తిరుపతి ఎమోషనల్..

Advertisement

తిరుపతి మామ ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు అని అందరూ అల్లుళ్ళు కూడా వెతుక్కుంటూ వెళ్తారు. అయితే ఒకచోట కూర్చొని మందు తాగుతున్న తిరుపతిని చూసి నువ్వు ఇక్కడే ఉంటావని నాకు అర్థమైంది మామ.. నాన్న కూడా అంతే కదా ఏమైనా జరిగితే వంటరిగా కూర్చుని మందు తాగుతాడు.నువ్వు కూడా అదే అలవాటు చేసుకున్నావు అని అందరూ తిరుపతి దగ్గరికి వచ్చి అంటారు.. మీరు నాకోసం వస్తారని అస్సలు అనుకోలేదురా మీరు నా కోసం వచ్చారు నేను దొంగతనం చేయలేదని ఎంత చెప్తున్నా సరే మీ అమ్మ వినలేదు రా అని తిరుపతి బాధ పడిపోతూ ఉంటాడు. అసలు నువ్వు అలా చేసావ్ అంటే ఎవరు నమ్మరు మామ ఏదో పొరపాటు జరిగినట్టుంది. ఇంటికి వెళ్దాం పద అని ఎంతగా ముగ్గురు అన్నదమ్ములు బతిమిలాడిన సరే.. మా అక్క బావ నన్ను వచ్చి పిలిస్తేనే నేను వస్తాను అంతవరకు రాను అని బాధ పడిపోతూ ఉంటాడు. ఇక అందరూ బాధ పడిపోతూ ఉండగా.. సరే ఇప్పుడు బాధ ఎందుకు అందరూ కలిసి మందు తాగుదామని సరదాగా కూర్చుని మందు తాగుతూ ఉంటారు.

నర్మదకు అడ్డంగా దొరికిన శ్రీవల్లి..

శ్రీవల్లి వంటగదిలో అందరిని విడగొట్టేస్తున్నాను అని చాలా సంతోషంగా ఉంటుంది. డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకుంటూ ఉండగా నర్మదా ఎంట్రీ ఇవ్వడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ప్రేమను పంపించాను.. తింగరి తిరుపతిని కూడా పంపించాను.. ఇక వేదవతిని కూడా పంపించేస్తాను అని అనుకుంటూ చాలా సంతోషంగా ఉండడం విన్న నర్మదా.. ఏంటి అత్తయ్య కూడా పంపించేస్తావా చెప్పు ఎలా పంపిస్తున్నావ్ అని అడుగుతుంది. నేను అత్తయ్య గాన్ని పంపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావ్ నర్మదా నాలాంటి మంచిదాన్ని పట్టుకొని నువ్వు అన్ని మాటలు అంటే నీకు అస్సలు బాగోదు అని శ్రీవల్లి అంటుంది.. మంచిదాన్ని అని అన్నావంటే చాలు నీ గొంతులో పొడి చేస్తాను అని నర్మదా అంటుంది. నేను ఏమీ చేయలేదు నాకు ఏ సంబంధం లేదు అని శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే నర్మదకు మాత్రం శ్రీవల్లిపై అనుమానం ఉంటుంది..

రామరాజు మాటతో కన్నీళ్లు..

Advertisement

రామరాజు అరేయ్ తిరుపతి అంటూ గట్టిగా అరవడంతో వంటగదిలో ఉన్న నర్మదా శ్రీవల్లితో పాటుగా వేదవతి నా తమ్ముడు వచ్చేసాడు అని చాలా సంతోషంగా బయటికి వెళుతుంది.. ఏది తిరుపతి వచ్చాడా ఎక్కడున్నాడు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. మా తమ్ముడు రాలేదు చూశారా అండీ అని వేదవతి రామరాజు దగ్గర మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను అడిగినందుకే వాడు ఇంత ఫీల్ అయిపోతాడా ఇన్ని రోజులు ఇవన్నీ కొడుకు లాగా చూశాను. కానీ ఎక్కడ పడునా ప్రేమను చూడలేదు అని బాధపడిపోతూ ఉంటుంది. వేదవతి ఎంత చెప్పినా కూడా రామరాజు మాత్రం బాధపడిపోతూనే ఉంటాడు.. నా తమ్ముడు నన్ను వదిలేసి పోయాడా అని వేదవతి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి రామరాజు కూడా బాధపడతాడు.

నర్మదకు నిజం చెప్పిన వేదవతి..

కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతున్న వేదవతి దగ్గరికి నర్మద వెళ్లి మీతో మాట్లాడాలి ఒకసారి బయటికి రండి అని బలవంతంగా బయటికి తీసుకుని వస్తుంది. అక్కడ చూసిన నర్మదా మీరేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అడుగుతుంది. నువ్వు కూడా నన్ను తిట్టడానికి వచ్చావా నన్ను అనుమానించావు కదా నేను చాలా బాధపడిపోతున్నాను అని వేదవతి అంటుంది. అసలు జరిగిన మ్యాటర్ ఏంటి అని నర్మద అడుగుతుంది ఆ విషయాన్ని నర్మదకు చెప్తుంది ఇంత జరిగిందా ఇదంతా భాగ్యం బ్యాచ్ ప్లాన్ అయి ఉంటుందని నర్మదా అనుకుంటుంది.. అటు తిరుపతి సుకన్య లేచిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ప్రేమ ఆ విషయం తెలిసి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. భానుమతికి అనుమానం.. తల్లి కోసం ఎమోషనల్..

Related News

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Big Stories

Advertisement
×