E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?

Podarillu Today Episode : మహా మాటతో ఆది షాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ నిజం చెప్తాడా..?
Advertisement

Podarillu Today Episode September 2nd మహాలక్ష్మి అలాగే ఆది ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక వీళ్లిద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండగా హారిక చక్రి రాఖీ కట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు.. ఇక మహాలక్ష్మి హారిక చేసిన ఏర్పాట్లను చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరిద్దరూ తిట్టుకోవడం ఆపేసి రాఖీ కట్టించుకోండి అని హారిక చెప్తుంది.. ఇక అది రాఖీ కట్టక ఆస్తులు అడుగుతుందేమో అని అంటాడు.. మాకు ఏమీ ఆస్తులు అవసరం లేదు అలాంటి ఆస్తులు కావాలి అనుకుంటే ఎప్పుడో ఆ ఇంటికి వచ్చేదాన్ని అని మహాలక్ష్మి కూడా అంటుంది. ఇలా ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇక మహాలక్ష్మి రాఖీ కట్టాలి అని అనుకుంటుంది అప్పుడు కూడా తిట్టుకుంటే ఒకరి మొహాలకు చూసుకోకుండా రాఖీ కట్టేసుకుంటారు..

ఆది మాటతో మహా షాక్..

ఆది రాఖీ కట్టగానే మహాలక్ష్మికి డబ్బులు ఇస్తాడు.. నేనేమీ నీ డబ్బులకి రాలేదు డబ్బుల కోసం రాఖీ కట్టలేదు అని మహాలక్ష్మి ఎంత చెప్తున్నా సరే ఆది మాత్రం మహా వెళ్ళిపోతూ ఉంటే డబ్బులు తీసుకో.. ఈ డబ్బులతో ఆ ఇంట్లో వాళ్ళు నెల వరకు సరుకులు కొనుక్కోవచ్చు అని అవమానించేలా మాట్లాడుతాడు. ఆ ఇంట్లో నువ్వు ఇచ్చే డబ్బులు తో తినే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీలాంటి కుక్కలు ఆ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా సరే ఎప్పుడు తిండి ఉంటుంది అని ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి బృందావనం గురించి గొప్పగా చెప్పడంతో చక్రి ఎమోషనల్ అయిపోతాడు.. నువ్వు ఇంకా మారవా నీ బుద్ధి మార్చుకోవా ఎప్పుడు చూడు డబ్బులు గురించి ఆలోచిస్తావా అంటూ మహాలక్ష్మి ఆదికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఇక ఆది మహాలక్ష్మి కట్టిన రాఖిని విసిరి కొట్టేస్తాడు అది చూసి చక్రిని తీసుకొని వెళ్ళిపోతుంది మహా.

అయ్యో పాపం.. మహా..

Advertisement

మహాలక్ష్మి వస్తుందని నారాయణ కాల్చే సిగరెట్ ని బయటపడేసి అలా చూస్తూ ఉండిపోతాడు కానీ మహాలక్ష్మి ఏమి పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోవడం చూసి ఏమైంది.. ఎందుకు పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటాడు వెనకాలే చక్రి కూడా కంగారు పడిపోతూ లోపలికి వెళ్లడంతో ఏదో జరిగింది అని నారాయణ కూడా లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మికి ఏదో అయింది ఎందుకు వీళ్ళిద్దరూ కంగారు పడుతున్నారు అని నారాయణ లోపలికి వెళ్లి అడగగానే మా అన్నయ్య ఇలా చేశాడు నన్ను క్షమించండి అని చెప్పగానే చక్రి బాధపడకండి అని అంటాడు. ఇక మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది..

చక్రీ ప్లాన్ సక్సెస్..

చక్రి ప్లాను సక్సెస్ అవుతుంది.. మహాలక్ష్మి బాధ పడిపోతూ లోపలికి వెళ్ళగానే చక్రి కూడా నా తప్పే అన్నయ్య ఇది వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టించాలని తీసుకొని వెళ్ళాను. కానీ ఆ వెధవ తనని చాలా బాధపెట్టేలా మాట్లాడాడు. మహాలక్ష్మి బాధపడడం నేను చూడలేకపోతున్నాను అని చక్రి అంటాడు.. నువ్వేం తప్పు చేయలేదు రా ముందు ఈ భోజనం తీసుకెళ్లి మహాలక్ష్మికి ఇవ్వు తను తినమని చెప్పు అని మాధవ్ అనగానే చక్రి ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ ఏమైందో అని చూసే లోపల మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది. అయితే తన దగ్గరికి భోజనాలు తీసుకొని వెళ్ళిన చక్రి ఇదంతా నా తప్పే కదా నన్ను క్షమించండి అని అడుగుతాడు.. మీరు ఏమి తప్పు చేయలేదండి మీరు చేసిన ప్రయత్నం బాగానే ఉంది కాకపోతే ఆ ఎదవని అర్థం చేసుకోవడం లేదు అని మహాలక్ష్మి అనగానే చక్రి చాలా ఫీల్ అవుతాడు.. చక్రి మాట విన్న మహాలక్ష్మి భోజనం చేస్తుంది.

చక్రీ పై మహా రివేంజ్..

Advertisement

రాత్రి చక్రి ఆ గోపిక సోషల్ మీడియా ప్రొఫైల్ దొరికింది అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఇక గోపిక ప్రొఫైల్ దొరికింది కాబట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టాను. చాటింగ్ అంటూ చాలా సంతోషంగా ఉంటాడు చక్రి. ఏం సాధించారు గోల్డ్ మెడల్ సాధించారా ఏంటి అంతగా మురిసిపోతున్నారు అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి చక్రి నీ కోపంగా తిట్టేస్తుంటుంది. కానీ చక్రి మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. చక్రి ప్లాన్ అయితే మొత్తానికి సక్సెస్ అవుతుంది వదిన ఇలా ఉడుకుంటుంది కదా. మరి నువ్వు ఎందుకు మళ్ళీ అదే పనులు చేస్తున్నావు అని ఎంత చెప్తున్నా సరే నాకు కావాల్సింది అదే అని అనుకుంటాడు చక్రి.. ఇక రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్న చక్రిని చూసి మహాలక్ష్మి చాలా కోపంగా ఉంటుంది. అయితే నిద్రపోతున్న చక్రి మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అని ఒక గ్లాస్ నీళ్లు పోస్తుంది. అది చూసి చక్రి ఒక్కసారిగా భయపడి పోయి లేస్తాడు.. కానీ ఏమైందో తెలుసుకోకుండానే పడుకుంటాడు ఇక మహాలక్ష్మి ప్లాన్స్ సక్సెస్ అయిందని సంతోషంగా ఉంటుంది. ఇక మాధవ్ కి పెళ్లి సంబంధం వాళ్లు వస్తారనే చెప్పగానే కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి అడుగుతుంది. కానీ అతను నిజం చెప్పడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పిన అమూల్య.. తిరుపతి ఎమోషనల్.. నిజం చెప్పిన వేదవతి..

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×