E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     
Advertisement

Ninnu kori serial today Episode: శృతి, కామాక్షి ఇద్దరూ కలిసి ఎంగేజ్‌మెంట్‌ ఎలా చెడగొట్టాలో అర్థం కాక కోపంగా బాధపడుతుంటారు. అప్పుడే పంతులు వస్తుంటే.. పంతులను తిడతారు. పదివేలు తీసుకుని ఏం చేశారు మీరు అంటూ కోప్పడుతుంటే.. నేను మీరు చెప్పినట్టే చేశాను కదా ముహూర్తాలు లేని చెప్పాను.. అయినా వాళ్లు ఏదో ఒకటి తేదీ చెప్పమన్నారు చెప్పాను అంటూ పంతులు వెళ్లిపోతాడు. మదన్‌కు పాలలో కానీ జ్యూస్‌లో కానీ మత్తు మందు కలిపి ఇస్తే ముహూర్తం అయిపోయేవరకు మత్తులో ఉంటాడు. తర్వాత అమెరికా వెళ్లిపోతాడు అని ప్లాన్‌ చేస్తారు.

షాలిని వెళ్లి అంతా అయిపోయింది ఇక మనం ఏం చేయలేము అంటూ మాయకు చెప్తుంది. మాయ మాత్రం అటు చూడు చంద్ర రెడీ కాకుండా ఉండిపోయింది అంటుంది. నేను వెళ్లి రెడీ చేసి తీసుకొస్తాను ఉండండి అంటూ చంద్ర దగ్గరకు వెళ్లి ఇంకా రెడీ కాలేదేంటి ఎందుకు డల్లుగా ఉన్నావు అంటూ చంద్రను షాలిని అడుగుతుంది. ఎంగేజ్‌మెంట్‌ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ విరాజ్‌ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా..? అని అడగ్గానే.. ఎందకు షాలిని అలా మాట్లాడతావు.. కచ్చితంగా ఈ ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంది అని బయటకు చెప్తూ.. ఈ ఎంగేజ్‌మెంట్‌ జరగకూడదు కచ్చితంగా ఆగిపోవాలి అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతుంది.

Advertisement

మాయ దగ్గరకు వెళ్లిన షాలిని చంద్ర ఏదో దాస్తుందని కచ్చితంగా ఈ ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోవాలని ప్లాన్‌ చేస్తుంది. కానీ మనం తనకు చాన్స్‌ ఇవ్వకూడదు.. కచ్చితంగా ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగేలా చేయాలని మాకు చెప్తుంది. మరోవైపు కిచెన్‌లోకి వెళ్లిన శృతి, కామాక్షి జ్యూస్‌లో మత్తు మందు కలుపుతుంటే.. చంద్ర వెళ్తుంది. ఏంటని అడిగితే జ్యూస్ లో విటమిన్‌ సీ కలుపుతున్నామని చెప్తారు. జ్యూస్‌ తీసుకుని వెళ్లాక మీకు తెలియకుండా మీరు నాకు హెల్ప్‌ చేస్తున్నారు అనుకుంటుంది చంద్ర.

మత్తుమందు కలిపిన జ్యూస్‌ తీసుకెళ్లి మదన్‌కు ఇవ్వబోతుంది కామాక్షి. మధ్యలోనే అడ్డుకున్న మందర ముందు ఇంటికి వచ్చిన గెస్టులకు జ్యూస్‌ ఇవ్వాలి మాయ నువ్వు పెద్ద కోడలివి తీసుకెళ్లి ఈ జ్యూస్‌ గెస్టులకు ఇవ్వు అని చెప్పగానే.. మాయ జ్యూస్‌ తీసుకెళ్లి గెస్టులకు ఇస్తుంది. మత్తు మందు కలిపిన జ్యూస్‌ తాగిన గెస్ట్‌ స్పృహ కోల్పోతుంటే.. కామాక్షి, శృతి వెళ్లి పక్కకు తీసుకెళ్తారు. తమ ప్లాన్‌ ప్లాప్‌ అయినందుకు బాధపడుతుంటారు. ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ కొట్టేయాలని ప్లాన్‌ చేస్తారు. రూంలోకి వెళ్లి రింగ్స్‌ వెతుకుతుంటారు. అప్పుడే వచ్చిన మందర ఏంటి వెతుకుతున్నారు అని అడిగితే.. ఎంగేజ్‌మెంట్‌ రింగ్స్‌ అని చెప్తారు కామాక్షి, శృతి.

Advertisement

తన దగ్గర ఉన్నాయని చెప్తుంది మందర. వెళ్లి మాయకు విషయం చెప్తుంది మందర. నువ్వు వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పగానే.. మందర సరే అంటుంది. ఇంతలో చంద్ర రెడీ అయి వస్తుంది. ఇద్దరూ కూర్చుని పూజ చేస్తుంటారు. మదన్‌ను కోపంగా చూస్తూ.. విరాజ్‌ చంపేస్తాను అన్నట్టు సైగ చేస్తాడు.. ఆ సైగలకు మదన్‌ ఎదురుగా కలశంలో ఉన్న నీళ్లు తాగేస్తాడు. వెంటనే వాష్‌ రూంకు వెళ్తానని చెప్పి వెళ్లిపోతాడు. ఆసక్తిగా చూస్తున్న షాలినితో ఏంటి అంత ధైర్యంగా చూస్తున్నావు ఈ ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుంది అనుకుంటున్నావా అంటూ క్రాంతి చెప్తాడు. వాష్‌ రూంలోకి వెళ్లిన మదన్‌ కోసం కామాక్షి, శృతిలు వేసిన ప్లాన్‌లో మదన్‌ తప్పించుకుంటాడు మందర బుక్‌ అవుతుంది. కామాక్షి, శృతి కర్రతో మదన్‌ను కొట్టి పడేయాలని కర్రతో వెళ్తారు. అప్పుడు కూడా మదన్‌ మిస్‌ అయి మందరే బుక్‌ అవుతుంది.

తర్వాత స్వీట్‌లో మత్తు మందు కలిపి మదన్‌కు ఇవ్వాలనుకుంటారు కామాక్షి, శృతి. అనుకున్నట్టుగానే.. స్వీట్లలో మత్తుమందు కలిపి అప్పుడూ వాష్ రూంలోంచి బయటకు వస్తున్న మదన్‌ దగ్గరకు వెళ్లి స్వీట్లు బలవంతంగా తినిపిస్తారు. స్వీట్లు తింటూ మదన్‌ ఏం కలిపారు ఇందులో ఏదో పౌడర్‌ కలపినట్టు ఉంది అంటూ అనుమానంగా చూస్తూ.. స్వీట్లు తింటాడు. వెంటనే తల పట్టుకుని కింద పడిపోతాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×