OTT Movie : తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మరో సిరీస్ వచ్చేసింది. ఇది ప్రేమ, కుటుంబ సంబంధాలు, భూమి వివాదాలు, ఒక కుటుంబ రహస్యం చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ మాండలికం, సాంప్రదాయాలు, గ్రామీణ జీవనశైలితో ఈ సిరీస్ ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ నుండి ఒటీటీకి అడుగుపెట్టిన అనిల్ గీలా డెబ్యూ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందింది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ZEE5 లో స్ట్రీమింగ్
‘మోతెవరి లవ్ స్టోరీ’ (Mothevari Love Story) ఒక తెలుగు రొమాంటిక్ కామెడీ-డ్రామా వెబ్ సిరీస్. దీనిని శివ కృష్ణ బుర్రా రచించి, దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో అనిల్ గీలా (పర్శి), వర్షిణి రెడ్డి జున్నుతుల (అనిత), మురళీధర్ గౌడ్ (సత్తయ్య), సదన్న (నర్సింగ్ యాదవ్), విజయ లక్ష్మి బలగం (అనుమవ్వ) ప్రధానపాత్రల్లో నటించారు. ఈ ఏడు ఎపిసోడ్‌ల సిరీస్ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో జరుగుతుంది. 2025 ఆగస్టు 8 నుంచి ZEE5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి IMDbలో 7.4/10 రేటింగ్ ఉంది.
కథలోకి వెళితే
లంబాడిపల్లి అనే తెలంగాణ గ్రామంలో ఈ కథ జరుగుతుంది. పర్శి, అనిత అనే జంట ప్రేమతో మొదలవుతుంది. ఈ ఇద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించి, కుటుంబాల అనుమతి లేకుండా పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఒక ఊహించని కుటుంబ రహస్యం బయటపడటంతో వీళ్ళ ప్లాన్ తారుమారవుతుంది. ఈ రహస్యం పర్శి, అనిత ప్రేమను, అలాగే వారి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది.
ఈ కథలో మరో కీలకమైన అంశం సత్తయ్య, నర్సింగ్ యాదవ్ అనే ఇద్దరు సోదరుల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళను స్థానికంగా అందరూ రామ్, లక్ష్మణ్‌లుగా పిలుస్తుంటారు. అయితే వారి తండ్రి ఐదు ఎకరాల భూమిని అనుమవ్వ అనే తెలియని మహిళకు వీలునామా రాసినట్లు తెలియడంతో, ఈ సంబంధం ఒడిదొడుకులకు గురవుతుంది. ఈ భూమి వివాదం, అనుమవ్వ గతం, ఒక జత బంగారు గాజులు కథలో కీలక పాత్రలు పోషిస్తాయి.
Read Also : వయసు పెరగదు, కోరిక ఆగదు … ప్రేమించిన వాళ్లంతా కళ్ళముందే … ఇది మామూలు కథ కాదు