BigTV English

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నెల తప్పిన అప్పు – తప్పు చేసిందన్న రుద్రాణి

Brahmamudi Serial Today August 12th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నెల తప్పిన అప్పు – తప్పు చేసిందన్న రుద్రాణి

Brahmamudi serial today Episode: కావ్యకు కాన్సర్‌ అని చెప్పిన రాజ్‌ను చూసి అపర్ణ, ఇంద్రాదేవి నవ్వుకుంటారు. కావ్య డాక్టర్ కు ఫోన్‌ చేసి నిజం చెప్పిస్తుంది. దీంతో రాజ్‌ సిగ్గు పడుతుంటాడు. నువ్వు తప్పులా కాకుండా మంచిగా అర్థం చేసుకో అని చెప్పి వెళ్లిపోతారు అపర్ణ, ఇంద్రాదేవి. అర్థం చేసుకుంటాను. కానీ కళావతి గారి మనసులో ఏదో ఉంది.  ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను అని రాజ్‌ అనుకుంటాడు. మరోవైపు రూంలో కళ్యాణ్‌ సాంగ్‌ రాసుకుంటుంటే అప్పు వెళ్తుంది. కూచి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. కవిత రాసుకుంటున్నాను అని కళ్యాణ్ చెప్పగానే.. నాకు పుల్లగా తినాలనిపిస్తుంది కూచి.. అని చెప్పగానే ఇది వర్షాకాలం మామిడి కాయలు దొరకవు ఒకవేల దొరికినా అన్ని పురుగులు ఉంటాయి.. తింటావా.. అంటాడు కళ్యాణ్‌. మామిడి కాయలు దొరక్కపోతే ఏంటి..? కూచి చింతకాయలు దొరుకుతాయి కదా..? తెచ్చిపెట్టొచ్చు కదా అంటుంది అప్పు. దానికి తెచ్చిపెట్టడం దేనికి కిచెన్‌లోకి వెళితే చింతపండు కిలోలు కిలోలు అంటూ ఆగిపోయిన కళ్యాణ్‌..


వెంటనే లేచి పొట్టి నువ్వు… అంటూ నవ్వుతాడు. అప్పు అవును అన్నట్టు తల ఊపుతుంది. దీంతో కళ్యాణ్‌ సంతోషంగా అప్పును ఎత్తుకుని తిప్పి ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను అంటూ అందరినీ పిలుస్తూ కళ్యాణ్‌ కిందకు వెళ్తాడు. ప్రకాష్‌ వెళ్తూ.. ఏంట్రా ఏదో ఇంటర్‌ పాసయిన స్టూడెంట్‌ లాగా కేకలు పెడుతున్నావేంట్రా… అని అడుగుతాడు. ఇది అంతకంటే పెద్ద గుడ్‌న్యూస్‌ నాన్న అంటాడు కళ్యాణ్‌. దీంతో సుభాస్‌ ఏదైనా పెద్ద సినిమాకు పాటలు రాసే చాన్స్‌ దొరికిందా ఏంట్రా అంత సంతోషపడుతున్నావు అని అడుగుతాడు. దీంతో కళ్యాణ్‌ సిగ్గు పడుతూ అది పెద్దనాన్న.. పొట్టి నువ్వు చెప్పు అంటాడు. నేను చెప్పను.. నువ్వే చెప్పాలి..? అంటుంది అప్పు. దీంతో రుద్రాణి ఏంటి సిగ్గు పడుతున్నారా..? అంత పనికిమాలిన పని ఏం చేశారు అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి కోపంగా అందరూ నీలాగా ఉంటారా…? ఇంతకీ ఏంటి నాన్నా ఆ విషయం అని కళ్యాణ్‌ను అడగ్గానే..

కళ్యాణ్‌ సిగ్గు పడుతుంటే.. ఇంద్రాదేవి కోపంగా సిగ్గు పడింది చాలు ఏంటో చెప్పు అంటుంది. దీంతో కళ్యాణ్‌, ఇంద్రాదేవి చెవిలో చెప్తాడు. ఇంద్రాదేవి సిగ్గుపడుతుంది. దీంతో సుభాష్‌ ఏం చెప్పావురా మా అమ్మకు చెవిలో అలా సిగ్గు పడుతుంది అంటాడు. దీంతో ఇంద్రాదేవి కంగారులో సుభాష్‌ను నువ్వు తండ్రివి కాబోతున్నావురా అంటుంది. కళ్యాణ్‌ నాన్నమ్మ అంటాడు.. అందరూ షాక్ అవుతారు. ఇంద్రాదేవి తేరుకుని నువ్వు కాదు నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు అని చెప్పగానే అందరూ హ్యపీగా అప్పు, కళ్యాణ్‌ను విష్‌ చేస్తారు. కావ్య పరుగెత్తుకుంటూ వచ్చి కావ్యను కళ్యాణ్‌ను విష్ చేస్తుంది. ఇప్పడు మనం దీన్ని ఒక పండగలా సెలబ్రేట్‌ చేసుకోవాలి అంటుంది. దీంతో రుద్రాణి కలగజేసుకుని నువ్వు చెప్పేది నిజమే కావ్య కానీ మా వదిన ముఖం చూస్తుంటే అలా కనిపించడం లేదు. అంటుంది.


దీంతో అపర్ణ కోపంగా నేను చెప్పానా..? అంటుంది. చెప్పకపోయినా..? ఒక అతగా మీ మనసులో ఏమనుకుంటున్నావో ఆ మాత్రం తెలుసుకోలేనా..? వదిన.. ఈ ఇంట్లో మొదటగా పెళ్లి అయింది రాజ్‌కు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది కూడా నీ కోడలే అయితే గియితే మొదట ప్రెగ్నెంట్‌ అవ్వాల్సింది కావ్య. మొదటగా వారసుణ్ని ఇవ్వాల్సింది కావ్య… కానీ అలా జరగలేదు కదా.. . అంటుంది రుద్రాణి. దీంతో అపర్ణ కోపంగా నిజం చెప్పబోతుంటే కావ్య అడ్డుపడుతుంది. అపర్ణ ఎమోషనల్‌ అవుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ తల్లి అవుతున్నానని చెప్తే సరిపోదు అప్పు. దానికి తగ్గ బాధ్యతలు కూడా తీసుకోవాలి. అంటుంది. దీంతో కళ్యాణ్‌ అమ్మా ఫస్ట్‌ టైం తల్లి అవుతుంది. తనకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పు.. నువ్వు చెబితే ఫాలో అవుతుంది అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ సలహాలు చెప్తుంది.

తర్వాత రూంలోకి వెళ్లి బాధపడుతున్న కావ్యను ఇందరాదేవి, అపర్ణ వెళ్లి ఓదారుస్తారు. మరోవైపు అప్పు, కళ్యాణ్‌ ఇద్దరూ గొడవ పడుతుంటారు. తనుక అబ్బాయే పుడతాడని అప్పు అంటే లేదు అమ్మాయే పుడుతుందని వాదులాడుకుంటారు. తర్వాత అప్పు మామిడికాయలు తీసుకుని వచ్చి తన ఉతింటూ కావ్యను కూడా తినమని చెప్తుంది. అప్పుడే రుద్రాణి వచ్చి కావ్యను పుల్లటి మామిడికాయలు తినమంటున్నావు.. కావ్య కూడా నెల తప్పిందా.. అందుకే రాజ్‌ ప్రేమను రిజెక్ట్‌ చేసిందా..? అంటూ అడగ్గానే.. అప్పు, కావ్య షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episode: హమ్మయ్య శ్రీవల్లి సేఫ్.. నర్మద మాటతో మైండ్ బ్లాక్.. ప్రేమ ధీరజ్ ఫైట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు క్లాస్ పీకిన అవని.. ప్రణతికి పెళ్లి చెయ్యబోతున్న పార్వతి.. దిమ్మతిరిగే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు డబ్బులిచ్చిన కల్పన.. బాలునే సాక్ష్యం.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Nindu Noorella Saavasam Serial Today August 12th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరుకు రాఖీ కట్టిన మిస్సమ్మ  

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే…

Big Stories

×