Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఆటకు ఫిదా అవ్వని అభిమానులు ఉండరనేది అందరికీ తెలిసిందే. 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జిపి తరఫున ప్రొఫెషనల్ ఫుడ్ బాలర్ గా ఎంట్రీ ఇచ్చిన రోనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్ గా 923 గోల్స్ తో టాప్ గోల్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో రికార్డులు సాధించిన రోనాల్డో కి.. ఫిఫా వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది.
Also Read: ODI World Cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?
ఇక రోనాల్డోని కేవలం ఓ అథ్లెట్ గా మాత్రం చూడడానికి వీల్లేదు. అతను ఓ కేస్ స్టడీ. అతని బయోలాజికల్ ఏజ్ 20 అని చెప్పవచ్చు. అతడికి 40 ఏళ్ళు నిండినప్పటికీ.. రోజు రోజుకి మరింత చిన్నవాడిలా మారిపోతున్నాడు. వయసు పెరుగుతున్నప్పటికీ రొనాల్డో యవ్వనంగా కనిపిస్తున్నాడు. ఇందుకు అతడి ఫిట్నెస్, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. అతడి శరీరంలో 50% మజిల్ మాస్, 7% బాడీ ఫ్యాట్ ఉన్నాయి. నిద్ర, ఆహారం, ట్రైనింగ్.. ఇలా ప్రతి దాన్ని శాస్త్రీయంగా ప్లాన్ చేసుకొని పాటించడం వల్లే ఇది సాధ్యమైందని సైంటిస్ట్ అలీ అల్ అహ్మది పేర్కొన్నారు.
అవకాశం వస్తే రొనాల్డో పై పరిశోధనలు చేసి ప్రపంచానికి అందిస్తానని.. అందరూ అతనిలా ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు అది దోహదపడుతుందని తెలిపారు. ఇక రోనాల్డో 2017 నుండి జార్జినా రోడ్రిగ్ తో రిలేషన్షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ జంట ఈ 8 ఏళ్లలో ఐదుగురు పిల్లలను కన్నది. కానీ రోనాల్డో – జార్జినా పెళ్లి మాత్రం చేసుకోలేదు. 2016లో ఓ దుకాణంలో జార్జినాను కలుసుకున్న రోనాల్డో.. ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు. అప్పటినుండి ఇటలీలో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఇద్దరికీ సరోగసి ద్వారా జన్మించిన మాటియో, అవా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
అయితే జార్జియాతో డేటింగ్ కి ముందే క్రిస్టియానోకు జూనియర్ రోనాల్డో అనే 8 ఏళ్ల కొడుకు, అలానా మార్టీనా అనే రెండేళ్ల కూతురు ఉంది. ఇక 2018 ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా జార్జియాన ఓ విలువైన వజ్రపు ఉంగరం ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో రోనాల్డో తో ఆమె వివాహం జరిగిపోయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఆ తర్వాత కొంతకాలానికి అదంతా అబద్ధమని, తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రోనాల్డో ప్రకటించాడు.
Also Read: Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?
అయితే తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ వజ్రపు ఉంగరం గురించి ప్రస్తుతం మరోసారి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ ఉంగరం ధర USD 2 – 5 మిలియన్లు.. అనగా సుమారు 16.8 కోట్ల నుండి రూ. 42 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. జార్జియానా అర్జెంటీనాలో పుట్టి స్పెయిన్ లో పెరిగింది. ఈమె ఫ్యాషన్ మరియు వినోద పరిశ్రమంలో ప్రముఖ వ్యక్తిగా స్థిరపడింది. రోనాల్డో తో ఆమెకి ఉన్న సంబంధం ఆమెను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుకు తీసుకువచ్చింది. కానీ అప్పటినుండి ఆమె తన సొంత కెరీర్ మార్గాన్ని నిర్మించుకుంది.