Hyderabad News: హైదరాబాద్‌లోని చందానగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఖజానా జ్యువెల్లరీ షాపు చోరీకి దుండగులు ప్లాన్ చేశారు. షాపు సిబ్బంది ఎదురుతిరిగారు. వెంటనే ఆ గ్యాంగ్ కాల్పులకు దిగింది. రెండు రౌండ్లు కాల్పులు జరిపింది. ఈ తతంగమంతా షాపులోని సీసీకెమెరాలో రికార్డు కాకుండా ఉండేందుకు వాటిని ధ్వంసం చేశారు.
తొలుత షాపులోకి ఎంటరైన ఆరుగురు సభ్యుల టీమ్, గన్‌తో బెదిరించి లాకర్ తాళాలు కావాలని సిబ్బందిని డిమాండ్ చేసింది. సిబ్బంది తాళాలు ఇవ్వకపోవడంతో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టి నగలను వారితో తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. వాటిలో వెండి ఆభరణాలు ఉన్నాయి. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగానే భయపడ్డారు సిబ్బంది. అప్పటికే కొందరు కస్టమర్లు షాపులో ఉన్నారు. వెంటనే వారు పోలీసుకు సమాచారం ఇచ్చారు.
పోలీసు వాహనాల సౌండ్ వినిపించడంతో అక్కడి నుంచి ఆ గ్యాంగ్ పరారైంది. ఈ గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్లు షాపు సిబ్బంది చెబుతున్నారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ సిటీలో పట్టపగలు ఇలాంటి ఘటన జరగడంతో మిగతా బంగారం షాపు యజమానులు హడలిపోతున్నారు.
ALSO READ: వాహనదారులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఓఆర్ఆర్ సర్వీసులు బంద్
దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ ఎవరు? ఎక్కడివారు? స్థానికులా? లేక బయట నుంచి వచ్చారా? ఇదే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. హైదరాబాద్ సిటీలో ఈ తరహా ఘటనలు ఎప్పుడూ జరగలేదని అంటున్నారు. పట్టపగలు ఇలా చేశారంటే అన్ని పరిశీలించిన తర్వాత దోపిడీకి ప్లాన్ చేసినట్టు అంచనాకు వస్తున్నారు. మిగతా సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు.
దుండగులు ముఖానికి మాస్క్‌లు ధరించినట్టు తెలుస్తోంది. గడిచిన ఆరునెలలుగా పరిశీలిస్తే నాలుగైదు ఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. అఫ్ఝల్‌గంజ్‌లో ఏటీఎం దోపిడీకి పాల్పడిన దుండగులు, ఆ తర్వాత ట్రావెల్ సిబ్బందిపై కాల్పులు జరిపిన విషయం తెల్సిందే.
దోపిడీ సభ్యులు ఎవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దోపిడీకి యత్నించిన గ్యాంగ్ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సీపీ. నగర శివారులోని చెక్ పోస్టుల వద్ద పోలీసులను అలర్ట్ చేశారు.
మూడు బైకులతో దుండగులు
దోపిడీ ఘటనలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దుండగులు మియాపూర్ నుండి చందానగర్ వైపు మూడు బైకులపై వచ్చినట్టు గుర్తించారు పోలీసులు. పక్కా ప్లాన్‌తో రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు బైకులను ఖజానా జ్యువెలర్స్ సమీపంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పార్క్ చేశారు. అనంతరం ఆరుగురు కలిసి ఒకేసారి ఖజానా జ్యువెలర్స్ షాపులోకి ప్రవేశించారు. దోపిడీ తర్వాత మహారాష్ట్ర వైపు పారిపోయినట్లు సమాచారం.
https://twitter.com/bigtvtelugu/status/1955169462338060561