Intinti Ramayanam Today Episode August 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి తన కూతురికి ఇలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేయాలని మీ నాన్న చూస్తున్నాడు. ఇప్పటికైనా మీ నాన్నకు కూతురు గురించి ఆలోచించడం అలవాటు చేసుకోమని చెప్పండి అని అక్షయ్ తో పార్వతి అంటుంది. నా తమ్ముడు ఎలాంటివాడు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తానని అవని అంటుంది..కానీ పల్లవి మాత్రం ఇలాంటి వాడికి మన ప్రణతినిస్తే తన జీవితం ఎలా మారిపోతుందో అర్థమవుతుంది కదా అత్తయ్య అని మధ్యలోకి వస్తుంది.. భరత్ నీ పల్లవి కొట్టబోతుంది.
పల్లవి చేతిని పట్టుకున్న అవని నా తమ్ముని కొట్టడానికి నువ్వెవరు అని అంటుంది. ఇలాంటి పనులు చేసిన వారిని ఎలా వెనకేసుకొస్తుందో చూశారా అని పల్లవి అంటుంది. నా తమ్ముడిని కొట్టడానికి నువ్వెవరు అని పల్లవి చేయి పట్టుకొని అవని చంప పగలగొడుతుంది.. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి సమయం పడుతుంది ఏదో జరిగింది కదా.. అని నా తమ్ముడు తప్పు చేశాడంటే నేను అసలు ఊరుకోను అని అవని అంటుంది.. పల్లవి తో పాటు అందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని అక్షయ్ దగ్గరకు వెళ్తుంది. మీకు ఏమైనా కావాలంటే అడగండి నేను వెళ్లి పడుకుంటాను అని అంటుంది.. కానీ అక్షయ్ మాత్రం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావ్.. నీ తమ్ముని నిర్దోషిని నిరూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నావా అని అడుగుతాడు.. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది.. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీకు ఎన్ని సార్లు చెప్పాలి? అయినా మీరు పదే పదే అనడం నాకు ఏమీ నచ్చలేదు అని అవని అక్షయతో అంటుంది. అక్షయ్ మాత్రం నీ తమ్ముడు తప్పు చేశాడు అని ఇప్పుడు పోలీసులే కదా రుజువు చేశారు అని అంటాడు.
అయితే మీకు మత్తు పదార్థాలు తీసుకునే అలవాటు ఏమైనా ఉందా అని అవని అడుగుతుంది. ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావ్ అని అక్షయ్ అంటాడు. లేదా మీకు అమ్మాయిలని వాడుకొని వదిలేసే ఆ అలవాటు ఉందా అని అవని అంటుంది. ఇవన్నీ మీ మీద పడ్డ కేసులే వాటన్నిటి నుంచి మిమ్మల్ని తప్పించి నేను తీసుకొచ్చాను అది మర్చిపోయినట్టున్నారు. మా తమ్ముడు కూడా ఏ తప్పు చేయలేదని రుజువు చేసి నేను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను అని అవని అక్షయ్ తో చాలెంజ్ చేస్తుంది.
పల్లవి అవనిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రణతి పెళ్లి జరగకుండా ఏదో ఒకటి చేస్తుంది. ఆ భరత్ ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని అంది కదా.. ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది అని ఆలోచిస్తుంది. పార్వతి ఈ విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.. అక్కడికి వచ్చిన పల్లవి అత్తయ్య గారు మీరు ఇలానే ఆలోచిస్తూ ఉంటే ప్రణతి పెళ్లిని కచ్చితంగా అవని చేసేస్తుంది. మనము ఆవనికి తెలియకుండా ప్రణతి పెళ్లి చేయాలి మీరు ఆలోచించండి అని అడుగుతుంది..
మొదట పార్వతి కాస్త వద్దు అని అన్న కూడా పల్లవి పార్వతిని ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఒప్పిస్తుంది. అయితే ఉదయం మంచి ముహూర్తం అంట పెళ్లి చేసేద్దాం అత్తయ్య అని పల్లవి పార్వతితో అంటుంది.. ప్రణతి మంచి కోసం నువ్వు ఇలా చేస్తున్నావ్ కదా ఖచ్చితంగా చేసేద్దాం అన్నట్లు పార్వతి కూడా అంటుంది.. ఇక భరత్ ను తీసుకొని అవని పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని అనుకుంటుంది.. అక్కడే శ్రీకర్ కూడా ఉండడంతో ముగ్గురు కలిసి స్టేషన్ లోపలికి వెళ్తారు.
భరత్ ఏ తప్పు చేయలేదని వాళ్ళు ఎవరో కావాలని ఇరికించారని శ్రీకర్ ఎస్ఐ తో అంటాడు. ఇంకా పూర్తి కాలేదు కదండి నేను ఆ వివరాలు చెప్పడం కుదరదు అని ఎస్ఐ షాక్ ఇస్తాడు. అయితే ఆ మాట విన్న అవని వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతుంది. ఇదేదో మోసం అంటున్నారు కదా నేను ఎఫ్ఐఆర్ ప్రకారం ఎంక్వయిరీ చేస్తాను.. ఆమె ఎవరో తెలుసుకుంటాను మీకు చెప్తాను అని శ్రీకర్ తో చెప్తాడు.. అక్కడినుంచి వెళ్ళిపోతుంటే అవని స్టేషన్ లో బోర్డుపై ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న ఫోటోలను చూసి షాక్ అవుతుంది.
అవి నేను గమనించిన ఎస్ఐ ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతారు. ఈ ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఏంటి ఎస్సై గారు అని అవని అడుగుతుంది. ఆ ఎస్సై వాళ్ళిద్దరి గురించి మొత్తం బాగోతాన్ని అవనికి చెప్తాడు.. పెళ్లిళ్ల పేరుతో వారు చేస్తున్న మోసాలను ఎస్సై బయట పెడతాడు. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్యకు చెప్పాలని పార్వతికి ఫోన్ చేస్తుంది అవని.. అవని ఫోన్ చేస్తుందని చూసి పార్వతి కట్ చేస్తుంది. మళ్లీ మళ్లీ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.. తమ్ముడు నిర్దోషిని నిరూపించుకోవడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావ్ కదా ఇప్పుడు నాతో నీకేం పని అని పార్వతి గా మాట్లాడుతుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇది ప్రణతి జీవితానికి సంబంధించిన విషయం అత్తయ్య మీరు నేను చెప్పిన చోటికి రావాలి అని అడుగుతుంది..
Also Read: మనోజ్ కు డబ్బులిచ్చిన కల్పన.. బాలునే సాక్ష్యం.. ప్రభావతికి మైండ్ బ్లాక్..
పార్వతి ఇదేదో ప్రణతికి సంబంధించిన విషయం కదా అని అనుకొని అక్కడికి వెళుతుంది. అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అవని ఉండడం చూసి ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పార్వతికి నిజం తెలిసిపోతుంది? అక్షయ్ ద్వారా ప్రణతి పెళ్లినీ పల్లవి చేసేయాలని అనుకుంటుంది. అవని మాత్రం భరత్ ని ఇరికించిన ఆ ఇద్దరిని పట్టుకొని అసలు నిజాన్ని కక్కిస్తుంది. మరి ప్రణతి పెళ్లి జరుగుతుందా? పార్వతి పల్లవి గురించి నిజం తెలుసుకుంటున్న రేపు చూడాలి…