Gundeninda GudiGantalu Today episode August 12th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి మనోజ్ కల్పనా ముగ్గురిని పోలీసులు స్టేషన్ కి తీసుకుని వెళ్తారు.. అక్కడ మనోజు కల్పనని ఎందుకు మోసం చేశావని అడుగుతాడు. కల్పన మాత్రం నన్ను వాడుకొని మోసం చేశాడు అని పోలీసులు ముందు చెబుతుంది. అంతేకాదు నువ్వు నాతో ఉన్నావని తెలిసిన కూడా మీ ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇలా ఉండడం గ్రేట్ అని రోహిణి పై సెటైర్లు వేస్తుంది కల్పనా.. నా గురించి నీకు అనవసరం నువ్వు ముందు తీసుకున్న 40 లక్షలు ఇవ్వు అని అడుగుతుంది. మనోజ్ కూడా నా డబ్బులు నాకు ఇవ్వు నీ మూలంగా నేను మా ఇంట్లో దొంగనయ్యాను అని అంటాడు. కల్పన మొదట నువ్వు చెప్పినా ఆ తర్వాత ఒప్పేసుకునేలా కనిపిస్తుంది. రోహిణి మాటలకు కల్పన సమాధానం చెప్పలేక అడ్డంగా దొరికిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. 40 లక్షలకు డ్రా చేసినట్టు రుజువు ఉంది కదా మీరు డబ్బులు కట్టాల్సిందే అని కల్పనకు పోలీసులు షాక్ ఇస్తారు..లాయరు బయటకు తీసుకెళ్లి కల్పనతో మాట్లాడతాడు.. మీరు ఇదంతా ఒప్పుకున్నారు కదా వాళ్ళ 40 లక్షలు వాళ్ళకి ఇవ్వాల్సిందే లేదంటే కోర్టు కేసులని ఇలా నెలలు తరబడి తిప్పుతారు అని భయపెడతాడు.. రోహిణి దీన్ని నమ్మడానికి వీలు లేదండి సక్సెస్ ఎందుకు ఎవరైనా పెట్టించండి లేదా వీలైనంత త్వరలో మాకు డబ్బు ఇప్పించండి అని అడుగుతుంది.
నేను కెనడాకు వెళ్లాలని ఫిక్స్ అయ్యాను ఆ డబ్బులు ఇచ్చేస్తాను అని కల్పనా అంటుంది. మొత్తం ఎంత 40 లక్షలు కదా అని అడుగుతుంది. 40 లక్షలు కాదు 45 లక్షలని రోహిణి అంటుంది.. ఇది డబ్బులు ఎక్కువట్టడంతోనే మా మామయ్య గారికి హార్ట్ ఎటాక్ వచ్చింది మా ఇంట్లో పరిస్థితిని దారుణంగా మారాయి అని అంటుంది. అయితే వెంటనే కల్పన 45 లక్షలు మనోజ్ కి పంపిస్తుంది. అది చూసిన మనోజ్ రోహిణి షాక్ అవుతారు. డబ్బులు పంపించారు కదా ఇక సాక్షి సంతకం చేస్తే సరిపోతుంది అని ఎస్ఐ అంటాడు.
నాకు ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేరండి మా లాయర్ గారు చేస్తారు అని కల్పనా అంటుంది. మీ లాయర్ గారి వల్ల కుదరదమ్మ ఆయన చేయకూడదు వేరే ఎవరైనా కావాలి అని ఎస్ఐ అంటాడు. కానిస్టేబుల్ బయటికి వెళ్లి ఎవరైనా ఉన్నారేమో చూద్దాం పదండి మేడం అని తీసుకెళ్తాడు.. కల్పనని చూస్తాడు బాలు.. ఒక చిన్న సమస్య ఉంది మీరు సంతకం పెట్టండి బాలు అని అడుగుతుంది. ఆడపిల్ల ఏదో సమస్య అంటుంది కదా అందుకే సంతకం పెడుతున్నాను అని బాలు సంతకం పెడతాడు.
ఇక రోహిణి మనోజ్ ఇద్దరూ 45 లక్షలు ఇచ్చిన సంతోషంలో పార్టీ చేసుకుంటారు.. ట్రాఫిక్ ఎస్ఐ రాగానే మీనా బాలు ఆయన దగ్గరికి వెళ్తారు. అక్కడ 500 ఫైన్ కట్టించుకుంటారు.. కొన్ని పూలు ఇవ్వమని అడుగుతాడు. 500 ఫైన్ తీసుకున్నారు కదా ఇంక పూలు ఎందుకు నేను కస్టమర్లకు ఇవ్వాల్సిన పూలవి అని మీనా అంటుంది. ఒకసారి నో పార్కింగ్ లో దొరికితే 1000 రూపాయలు ఫైన్ అయింది అని ఎస్ఐ అంటాడు. ఇక బండి తీసుకొని మీనా బాలు వెళ్లిపోతారు.
మనోజ్ రోహిణి ఆ డబ్బులను ఏం చేద్దామని అనుకుంటారు ముందుగా కెనడా కి వెళ్లడానికి ఇంటర్వ్యూ కి వెళ్ళిన ఆఫీస్ కి వెళ్తారు. అక్కడ జాబ్ వేకెన్సీ లేదు అని చెప్పడంతో మనోజ్ నిరాశ పడతాడు. ఈ డబ్బులు తీసుకెళ్లి ఆ బాలుకి చెప్పాలి అని మనోజ్ అంటే నీకు ఏమైనా పిచ్చా ఈ డబ్బులు మా నాన్న ఇచ్చిన అని చెప్పి ఏదో ఒక బిజినెస్ చేద్దాం. ఆ తర్వాత వచ్చిన లాభాల్లో ఆ డబ్బులు ఇచ్చేద్దామని రోహిణి అంటుంది. రోహిణి మాట విన మనోజ్ ఇంటికి వెళ్దాం పద అని అంటాడు.
Also Read: ‘కూలీ’తో వార్ 2..ఎవరి దమ్మెంత..?
బాలు ఇంట్లో ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇది మా ఇల్లు కాదేమో అని అనుకుంటాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ప్రభావతి బాలుని తిడుతుంది. సంతోషంగా అందరిని పిలుస్తాడు. అయితే మా నాన్న నాకు 25 లక్షలు పంపించాడు ఆంటీ అని అంటుంది. మాట వినగానే ప్రభావతికి షాక్ కొట్టినట్లు కింద పడిపోతుంది. అన్ని డబ్బులు మీ నాన్న ఇచ్చాడా అని ఆశ్చర్య పోతుంది. కానీ బాలు శృతిలకు ఏదో తేడా కొడుతుంది అని ఆలోచిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..