E-Paper
Advertisement

బిగ్ బాస్‌కు వెళ్లి జాక్‌పాట్ కొట్టిన టీవీ స్టార్స్..!

బిగ్ బాస్‌కు వెళ్లి జాక్‌పాట్ కొట్టిన టీవీ స్టార్స్..!
Advertisement

Bigg Boss: బిగ్ బాస్.. ఇందులోకి వెళ్లాలని, ఆ తర్వాత సెలబ్రిటీలుగా మారిపోవాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. అది సహజం కూడా.మరి ఈ బిగ్ బాస్‌లోకి వెళ్లి సెలబ్రిటీలుగా మారిపోయిన ఆ టీవీ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అమర్ దీప్‌కు బిగ్ బాస్ తెచ్చిన క్రేజ్

ముందుగా అమర్ దీప్ విషయానికి వస్తే.. బిగ్ బాస్ ముందు అమర్ దీప్ అంటే కేవలం సీరియల్ ఆడియన్స్‌కే తెలుసు.కానీ హౌస్‌లో అమర్ దీప్ ఆడిన ఆట, ఇచ్చిన ఎమోషన్స్, పెట్టుకున్న గొడవలు, చేసిన ఫ్రెండ్షిప్స్ అన్నీ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది.ఇక ఆ తర్వాత షోలు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇలా వరుసగా ఫుల్ బిజీ అయిపోయి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు.

ప్రియాంక జైన్‌కు మరింత గుర్తింపు

Advertisement

ఇక బిగ్ బాస్‌తో స్టార్‌గా ఎదిగిన మరో సీరియల్ నటి ప్రియాంక జైన్.ఇప్పటికే సీరియల్స్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించిన ఈ బ్యూటీకి బిగ్ బాస్ మరింత ప్లస్ అయిందని చెప్పాలి.హౌస్‌లో ప్రియాంక బిహేవియర్, టాస్క్‌ల్లో తను పాల్గొన్న తీరు ఆడియన్స్‌కి బాగా నచ్చేసింది.ఫలితంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోయారు.ఇక ఫాలోవర్లతో పాటు బ్రాండ్ ప్రమోషన్స్, ప్రాజెక్టులు కూడా క్యూ కట్టాయి.ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.

శోభా శెట్టికి పెరిగిన పాపులారిటీ

ఇక శోభా శెట్టికి కూడా బిగ్ బాస్ మరింత పేరు తెచ్చిందని చెప్పాలి.ఎక్కువగా సీరియల్స్‌లో నెగటివ్ రోల్స్‌లో ఆకట్టుకునే శోభా శెట్టి.. బిగ్ బాస్‌లో మాత్రం తనలోని మరో యాంగిల్‌ని చూపించింది.ఎక్కడా నిబ్బరాన్ని కోల్పోకుండా ఆడటంతో ఆమెకు సపోర్ట్ చేసే అభిమానుల సంఖ్య, పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పాలి.

ముక్కు అవినాష్ కామెడీకి మరో స్థాయి

Advertisement

ఇక జబర్దస్త్ తర్వాత మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది అవినాష్.ముక్కు అవినాష్‌గా పేరు ఉన్న ఈయన.. బిగ్ బాస్‌లో తనదైన కామెడీతో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు.ఇక అవినాష్ హౌస్‌లో వేసిన పంచులు, చేసిన ఫన్నీ మూమెంట్స్ ఆడియన్స్‌ని మరింత ఎంటర్‌టైన్ చేశాయి.షో ముగిసిన తర్వాత టీవీ షోలు, ఈవెంట్లు, యూట్యూబ్ ప్రోగ్రామ్స్ అంటూ ఫుల్ బిజీ అయిపోయాడు అవినాష్ రెడ్డి.

అషు రెడ్డికి పెరిగిన సోషల్ మీడియా ఫాలోయింగ్

ఇక అషు రెడ్డి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ ముందు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. ఈ షో తర్వాతే మరింత క్రేజ్ వచ్చింది.దాంతో ఫాలోవర్లు విపరీతంగా పెరిగిపోవడంతో బ్రాండ్ ప్రమోషన్లు, ఫోటోషూట్లు, ఈవెంట్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.

హరితేజకు కలిసి వచ్చిన బిగ్ బాస్

ఇక బిగ్ బాస్ హౌస్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో అందర్నీ ఆకట్టుకుంది హరితేజ.అందరితో కలిసిపోయే స్వభావం కూడా ఆడియన్స్‌ని హరితేజకు దగ్గర చేసింది.సినిమాలు కూడా ఈ షో వల్లే హరితేజకు క్యూ కట్టాయని చెప్పాలి.దానికి తోడు టీవీలో వచ్చే ఈవెంట్స్ బోనస్.

బిగ్ బాస్ అందరికీ ఒకేలా కలిసి రాదు

అయితే ఈ బిగ్ బాస్ షో అందరికీ కలిసి వస్తుందా అంటే రాదని చెప్పాలి.ఇందులో పాల్గొన్న చాలామందిలో కొంతమంది కెరీర్‌లో దూసుకుపోతుంటే, మరికొంతమంది ఎలాంటి అవకాశాలు అందుకోలేకపోయారు.కొందరు అవకాశాలు అందుకున్నప్పటికీ.. ఆ పాపులారిటీని నిలబెట్టుకోలేకపోయారు.

గుర్తింపు రావడం ఒక ఎత్తు.. నిలబెట్టుకోవడం మరో ఎత్తు

సో.. బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్‌ఫామ్ అని గుర్తుంచుకోవాలి.ఆ షో వల్ల గుర్తింపు రావచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం కష్టపడే తత్వం, సరైన డెసిషన్ మేకింగ్ ఉండి తీరాల్సిందే!

Also read :చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

Tags

Related News

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?

ఆట సందీప్ కి కూడా తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. కార్పొరేట్ స్టైల్లో మెసేజ్!

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Big Stories

Advertisement
×