E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అడ్డంగా దొరికిన మాణిక్యం.. రోహిణి బాగోతం తెలిసిందా..? రోహిణికి ప్రభా షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 5th : మీనాకు దొంగలు గుద్దుకోవడంతో మీరు ఎందుకు అంత హడావిడితో వెళ్తున్నారు అని అనుమానం మొదలవుతుంది. బాలు రావడంతో వాళ్ళు ఏదో హడావిడిగా వెళ్తున్నారండి వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు వాళ్ళని ఎలా ఆపాలి అని నేను అడుగుతుంది. ఇక బాలుకి కూడా వాళ్ళ ప్రవర్తన పై అనుమానం రావడంతో వాళ్లని ఆపే ప్రయత్నం చేస్తాడు.. తెలియడంతో అందరూ ముందర వాళ్ళని దారుణంగా కొడతాడు నగలని తీసుకుపోకుండా చేసినందుకు మీనా బాలు పై రంగ ప్రశంసలు కురిస్తాడు.

అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం..

దొంగలను పట్టుకుని బంగారాన్ని మళ్లీ తీసుకొచ్చిన బాలు మీనాలకి ఎలాగైనా సరే మంచి మర్యాదలు చేయాలి అని మాణిక్యం అనుకుంటాడు. అనుకున్నట్లుగానే మాణిక్యం మీనా బాలుకి ఘనస్వాగతం పలుకాలి. వాళ్ళని సత్కరించాలి అని అనుకుంటారు. అనుకున్నట్లుగానే మీనా బాలు ఘనంగా సత్కరించాలి అని పూలమాలలు తీసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళిద్దర్నీ చూస్తున్న మాణిక్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక మీనా బాలు ఇద్దరు కూడా మాణిక్యం ని అక్కడ చూసి బావున్నార మావయ్య అంటూ వెటకారంగా మాట్లాడతారు.. మీరు పెళ్లి కొడుకుకి మామయ్య నా మేం అస్సలు నమ్మలేకపోతున్నామని ఇద్దరు అనుకుంటూ ఉండగా.. మాణిక్యం వాళ్ళని చూసి షాక్ అయిపోయి అలానే ఉండిపోతాడు అసలు ఏం జరుగుతుందో తెలియలేదు అని ఉండిపోగానే బాలు మామ అని వెటకారంగా తనకు షాక్ ఇచ్చారు మాట్లాడుతూ ఉంటాడు..

రోహిణికి బుద్ధిచెప్పాలని బాలు ప్లాన్ చేస్తాడు..

Advertisement

రోహిణి ఇన్ని రోజులు ఎగిరెగిరి పడుతుంది కదా తనకు ఎలాగైనా సరే షాప్ ఇవ్వాలి అని బాలు అనుకుంటాడు. ఇక బాలు చేసిన ప్లాను సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతుంది.. నీ చేత నిజం చెప్పించి కోర్టు బోన్స్ పెట్టాలి డైనింగ్ టేబుల్ మళ్లీ కోర్టు బోనుగా మారిపోతుంది.. ఎలాగైన సరే మాణిక్యంను ఇంటికి తీసుకొని వెళ్లాలని అనుకుంటారు. అప్పుడే ప్రభావతి మీనా ఎక్కడికి వెళ్లింది ఇంకా నాకు కాఫీ ఇవ్వలేదు అని హడావిడి చేస్తూ ఉంటుంది.. ప్రభా ఎందుకు అటు ఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నావ్ ఏమైంది అని సత్యం అడుగుతాడు.. మీనా ఎక్కడికి చచ్చిందో ఇంకా రాలేదు నాకు ఇంకా కాఫీ కూడా ఇవ్వలేదు ఇది ఇంకా పెళ్లి ఇంట్లోనే మంతనాలు పెడుతుందో ఏంటో అని ప్రభావతి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది.. వాళ్ల మేనని ఆ పూల ముకునే దాన్ని నేను పొగిడాను.. ఎంత బాధగా ఉందో తెలుసా అని ప్రభావతి అనగానే ఊరుకో ప్రభ మీనా వింటే బాధ పడిపోతుంది. నువ్వేమైనా పొగిడవయ్య ఏంటి నీ గోడల్ని ప్రేమగా చూసుకున్నావు అది నిజమే కదా అని సత్యం అంటాడు. అబౌట్ మీనా పై చిందులు వేస్తూ ఉండగా అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలు ఏంటి అమ్మవతి ఏదో చేస్తుంది ఎవరి గురించి మాట్లాడుతుంది అని సెటైర్లు వేస్తాడు. బాలుని చూసిన ప్రభావతి ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది వెంటనే మీనా రావడం చూసి.. ఏంటే ఇంతసేపు అక్కడే ఉన్నావ్ అక్కడే ఉండిపోవచ్చు కదా మళ్లీ ఎందుకు వచ్చావు ఈ టైంలో నాకు కాఫీ ఇవ్వాలి అని కూడా తెలీదా నీకు అని ప్రభావతి మీనా పై సీరియస్ అవుతుంది.. మీకు ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన చూపిస్తాను. మలేషియా నుంచి మేక మామయ్య వచ్చాడు అని బాలు ప్రభావతితో అనగానే ఏంట్రా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు అని ప్రభావతి అంటుంది.. బాలు హడావిడి చూసి ఇంట్లోని వాళ్ళందరూ ఏమైంది వీడియో రచ్చ చేస్తున్నాడంటే ఎక్కడో గొడవ చేసి వచ్చి ఉంటాడు అని మిగిలిన వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు.

రోహిణి బాగోతం బట్టబయలు..? 

మలేషియా మలేషియా అని అంటున్నావు కదా ఇప్పుడు నీకు దాని సంగతి ఏంటో చూపిస్తాను అని బాలు ప్రభావతిపై రెచ్చిపోయి మాట్లాడుతాడు. ఇక మీనా అమ్మ కోసం వాటర్ బాటిల్ తీసుకురా అలాగే డాక్టర్ కి ఫోన్ చేసి ఒక బెడ్ ని కూడా రెడీ చేయమని చెప్పు ఇప్పుడు నేను చెప్పే నిజం వింటే ఈ అమ్మవుతి కాస్త కింద పడిపోయి హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అని బాలు సెటర్ల వర్షం కురిపిస్తాడు.. వెంటనే మీనా సరే అండి మీరు ఎలా చెప్తే అలానే నేను అసలే పూల అమ్ముకునేదాన్ని కదా అని అంటుంది. ఇక ఏంట్రా నీ గొడవ పెళ్ళ ఇంట్లో ఏదైనా తేడా జరిగిందా లేదా తాగొచ్చి గొడవ చేస్తున్నావా అని ప్రభావతి అడుగుతుంది. ఇదంతాటికీ కారణం మీకు ఒక విషయం చెప్పాలి.. చెప్పే నిజం ఏంటి ఇక్కడ ఎంతోమంది హాస్పిటల్ పాలవుతారు. ఎందుకైనా మంచిది హాస్పిటల్లో మూడు బెత్తులు కన్ఫామ్ చేస్తే బెటర్ ఏమో అని బాలు పొంతన లేకుండా మాట్లాడడం చూసిన సత్యం ఏంట్రా నీ గోల ఏమైందో అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పురా అని అడుగుతాడు.. ఇక బాలు మేనమామ మలేషియా మామ మేక మామ అంటూ డైలాగులు వర్షం కురిపిస్తాడు. మేక మామ నువ్వు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైంది వచ్చేసేయ్ అంటూ ఘన స్వాగతం పలుకుతాడు.. రోహిణి మాణిక్యన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. మావయ్య నువ్వేంటి ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు ఏ హోటల్ లో దిగావో ఆ హోటల్ కి వెళ్ళిపో నేను నీతో అసలు మాట్లాడను అని అంటుంది.

బాలు దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..? 

Advertisement

అయ్యో రోహిణి గారు ఏదో ఐదో మాట్లాడేస్తున్నారే అసలు నిజం తెలిస్తే గుండె ఆగిపోతుంది అని బాలు మాట్లాడిన మాటలకి చూస్తున్న ప్రేక్షకులకి కాస్త కామెడీగా అనిపిస్తుంది.. బాలు డైలాగులు ఒక్కొక్కటి పేలుస్తూ ఉంటే రోహిణి కళ్ళల్లో భయం పెరుగుతూ ఉంటుంది.. అయితే రోహిణి ఏమైందో అని అలా చూస్తూ ఉండిపోగానే బాలు అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఇక రోహిణి అడ్డంగా బుక్కయ్యాను అని కంగారు పడిపోతూ ఉంటుంది.. ఏం జరిగింది అని తెలుసుకునే లోపలే బాలు చెప్పిన నిజం విని అందరూ మాణిక్యం ని అవునా కాదా అని అడుగుతారు. అవును నేను నాటకమే ఆడాను అని మాణిక్య నిజం చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ రోహిణి పై సీరియస్ అవుతారు..

రోహిణిని కొట్టిన ప్రభావతి..

మనోజ్ ఏంట్రా ఇప్పుడు మాట్లాడట్లేదు నీలాగే మీ ఆవిడ కూడా లక్షల మింగేసిందా ఏంటి? నువ్వు మోసపోయావు అన్న సంగతి నీకు ఇప్పటికీ తెలియట్లేదా? రెండోసారి కూడా నువ్వు మోసపోయావ్ నీకు కట్టుకున్న భార్య నిన్ను దారుణంగా మోసం చేసింది అని బాలు మనోజ్ ని రెచ్చగొడతాడు.. ఆ మాట వినగానే మనోజ్ బయట వాళ్ళు నన్ను మోసం చేశారు అని అనుకున్నాను.. కానీ ఇంట్లోని వల్లే నా కట్టుకున్న భార్య నన్ను మోసం చేస్తుందని నేను ఊహించలేకపోతున్నాను. నా భార్య నన్ను ఇంత మోసం చేసింది అంటే నేను బ్రతికున్న వేస్ట్ అని మనోజ్ చాలా బాధపడిపోతాడు. కానీ రోహిణి మాత్రం నేను చేసిన తప్పేంటి అని అంటుంది.. ఒకవైపు మీనా ఇన్ని రోజులు నన్ను ఎన్నెన్నో మాటలు అన్నారు కదా ఇప్పుడు నీ పెద్ద కోడలు చేసిన నిర్వహణ ఏంటి అని ప్రభావతిపై రెచ్చిపోతుంది.. ఇక రోహిణి నోరు తెరవకుండా ప్రభావతి దిమ్మ తిరిగిపోయేలా చెంపలు వాయిస్తుంది.. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అంటుంది ప్రభావతి కోపాన్ని చూసి ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

Illu illaalu Pillalu : సీరియల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త విలన్ ఎంట్రీ..

Brahmamudi Serial Today Episode August 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: వెంకీకి షాక్ ఇచ్చిన నందు   

Podarillu Today Episode : పెద్దికి షాకిచ్చిన సిద్దాంతి.. ఇంట్లోంచి వెళ్లిపోయిన మాధవ్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: విశ్వంకు షాకిచ్చిన అమూల్య.. ధీరజ్ పై ప్రేమ ఫైర్.. నర్మద ప్లాన్ వర్కౌట్..

Intinti Ramayanam Today Episode: వంటలు అదరగొట్టిన మగాళ్లు.. ప్రాణాలకు బాబును కాపాడిన పల్లవి.. కమల్ షాక్..

Gundeninda Gudigantalu Balu : బాలు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త హీరో ఎంట్రీ..?

కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Big Stories

Advertisement
×