Intinti Ramayanam Today Episode April 15th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి అందరిని ఒప్పించిన విషయం ఆరాధ్య అవనితో అంటుంది. నువ్వు మాట ఇచ్చినట్లే చేస్తున్నావ్ అమ్మ కచ్చితంగా నువ్వు కళ్యాణానికి రావాలి అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే పల్లవి రావడం చూసి పల్లవి పిన్ని వస్తుందమ్మా నేను తర్వాత మాట్లాడుతానని ఆరాధ్య అంటుంది. కానీ పల్లవి కి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను నువ్వు ఎవరితో నువ్వు భయపడకుండా నాతో మాట్లాడొచ్చు అని అంటుంది. పల్లవికి ఫోన్ ఇస్తే నేను చెప్పింది గుర్తుందిగా అందరూ కళ్యాణం కు వస్తున్నారా అనేసి అడుగుతుంది నువ్వు చెప్పినట్లే అందరూ కళ్యాణానికి వస్తున్నారు అక్క. నువ్వు ఎలా చెప్తే అలానే అనేసి పల్లవి అంటుంది. సరే అమ్మ నువ్వు నాతో మాట్లాడటం ఎవరైనా చూస్తే బాగోదు అనగానే నేను ఫోన్ నెంబరు డిలీట్ చేస్తానమ్మా అని ఆరాధ్య అంటుంది. తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారా మీ నాటకాన్ని బయటపెడతానని పల్లవి అంటుంది. పల్లవి అందరిని గుడికి వెళ్లేందుకు రెడీ అవ్వాలని తొందరపెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీరామ నవమి సందర్బంగా కళ్యాణం జరిపించాలని అందరు కలిసి సంతోషంగా గుడికి వెళ్తారు. అక్కడ కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అక్కడ గుడికి వెళ్లిన వాళ్లంతా కళ్యాణం జరిపించాలని అనుకుంటారు. అయితే పూజారితో పూజ గురించి చెప్తారు. కళ్యాణం కోసం పెద్ద కోడలు లేదని చెప్పాము కదా అంటుంది. మీ పెద్ద కోడలు ఇక్కడే ఉందమ్మా అంటాడు. అప్పుడే అవని అక్కడకు వస్తుంది. నేను ముందుగా చెప్పినట్లు ఈ పూజకు రాను నేను వెళ్లిపోతున్నా అని అంటుంది. ఇదంతా నీ ప్లాన ప్రకారం అందరిని తీసుకొచ్చావా కచ్చితంగా నేను ఇక్కడ ఉన్న నువ్వు వెళ్ళిపోతానని పార్వతి వెళ్ళిపోతుంది.
అవని పల్లవిని పిలిచి నువ్వు వెళ్లి అత్తయ్యని ఆపు ఈ కళ్యాణమ అయ్యేంతవరకు మన ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండాలని అంటుంది. కళ్యాణానికి అందని తీసుకురమ్మని చెప్పారు తీసుకొచ్చాను ఇక వాళ్ళు వెళ్ళిపోతుంటే నేనెలా ఆపగలను అని పల్లవి ఉంటుంది. సరే నేను వెళ్లి మామయ్యకు విషయం చెప్తాను అని అనగానే అక్క వద్దు నేను అత్తని పెళ్లి తీసుకొస్తానని పల్లవి అక్కడికి వెళ్తుంది.
పార్వతి వెళ్ళిపోతుంటే ఆపుతుంది. మన ఫ్యామిలీ విషయాలు గుళ్లో కూడా చెప్పాలా అత్తయ్య అందరూ ఎలా అనుకుంటారు ఆలోచించండి అని అంటుంది. ఇక్కడ వరకు మా ఫ్యామిలీ గురించి కొందరికి మాత్రమే అందరికీ తెలుసు. ఇక గొడవల గురించి ఊరంతా కథలుగా మాట్లాడుకుంటారు మనం వచ్చింది అవినీతి కోసం కాదు దేవుడి కోసం అని పల్లవి పార్వతిని మళ్ళీ లోపలికి తీసుకొస్తుంది.
ఇక అవని శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉంటే అక్షయ వచ్చి మిమ్మల్ని అక్కడ గుళ్లో పిలుస్తున్నారు మీరు వెళ్ళండి అని వాళ్ళిద్దరిని పంపిస్తాడు. అక్షయ్ నువ్వు మా తమ్ములని మాయ చేయాలని చూస్తున్నావా అందుకే ని దగ్గరనుంచి పంపించాను నువ్వేమన్నా సీత అనుకుంటున్నావా అని ఎగతాళి చేస్తాడు. నేను సీతను కాదు తెలియదు కానీ వాళ్లు మాత్రం నాకు భరత శత్రుజ్ఞలే అని అవని అంటుంది. పల్లవి ఈ కళ్యాణం ఎలాగైనా అవని చేతుల మీదగా జరగకూడదని ప్లాన్ చేస్తుంది.
భానుమతి తన భర్త గురించి అందరికీ చెప్పుకుంటుంది అందరూ తనకు పిచ్చి పట్టిందని అనుకుంటారు. ఇక విగ్రహాలు ఊరేగింపు నుంచి కళ్యాణం వరకు మీరే అన్ని జరిపించాలని పంతులు. విగ్రహాలని ఊరేగిస్తూ వస్తుంటే పల్లవి మనుషులు విగ్రహాలను కిందపడేలా చేస్తే కళ్యాణ మాగిపోతుందని అనుకుంటారు. కానీ అటు అక్షయ్ ఇటు అవని ఇద్దరు కలిసి విగ్రహాలను కింద పడకుండా పట్టుకుంటారు. తర్వాత కళ్యాణం జరిపించడానికి అందరూ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. కళ్యాణ జరుగుతున్న సమయంలో బాంబు పెట్టారని అందరిని పల్లవి మనుషులు అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తారు. రేపటి స్కూల్లో ఏం జరుగుతుందో చూడాలి..