Kubera Update:ప్రేమకథా కావ్యాలకు పెట్టింది పేరు డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula). అలాంటి ఈయన ఇప్పుడు తొలిసారి సోషల్ ఫాంటసీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush) కాంబినేషన్లో తొలిసారి రాబోతున్న చిత్రం ‘కుబేర'(Kubera ).ఇందులో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా మనకు కనిపించారు. అయితే ఎందుకు అలా బిచ్చగాడిగా మారిపోవాల్సి వచ్చింది అనే ఒక కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ముఖ్యంగా ముంబైలోని ఒక ప్రాంతంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ఈడి అధికారిగా కనిపించనున్నట్లు ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్, పోస్టర్ల ద్వారా మేటర్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. ఇక జూన్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదివరకే రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను వదలలేదు.
కుబేర ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ప్రకటించిన రష్మిక..
కానీ మొన్న ధనుష్ ఏదో ఒక టెంపుల్ ముందు నిలబడి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నట్టు ఒక చిన్న షార్ట్ వీడియో ని షేర్ చేస్తూ.. ఫస్ట్ పాట లోడింగ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆ ఫస్ట్ పాట ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అభిమానుల ఎదురుచూపుకు తెరదించుతూ.. అంచనాలు పెంచేసింది రష్మిక. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో కుబేర ఫస్ట్ సాంగ్ ను ఏప్రిల్ 20వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన పోస్టర్ ను పంచుకుంది. ఇందులో ధనుష్ ఒక పండుగ వద్ద మాస్ డాన్స్ వేస్తున్నట్టు ఆ పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇందులో ఆయన విజిల్ వేస్తూ చేసిన మాస్ డాన్స్ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ధనుష్ స్టిల్స్ ఈ సినిమా నుంచి బయటకు రాలేదు. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని పోస్టర్లలో కూడా ఆయన బెగ్గర్గానే కనిపించారు.. ఫస్ట్ టైం ఇలా పాష్ లుక్ లో కనిపిస్తున్నారు. నిన్న తమిళ కొత్త సంవత్సరం కావడంతో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అంతే కాదు ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని ఈరోజు విడుదల చేయబోతున్నామని రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా పంచుకుంది. మొత్తానికైతే ఫస్ట్ పాట పైనే రష్మిక అంచనాలు భారీగా పెంచేసిందని చెప్పవచ్చు.
శేఖర్ కమ్ముల సినిమాలు..
ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే.. ఆయన సినిమా స్టోరీలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈయన సినీ దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత , సినీ రచయిత కూడా.. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో తనలోని ఫ్యాషన్ ను అభిమానులకు రుచి చూపించారు. అంతేకాదు ఆరు నంది పురస్కారాలు కూడా అందుకున్నారు. ఎక్కువగా కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా తన సినిమాలను రూపొందించే శేఖర్ కమ్ముల ఈసారి ఈ కుబేర సినిమాతో మరో కొత్త ప్రపంచాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమాతో ఈ స్టార్స్ అంతా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
HBD Sakshi Shivanand: ఆ తప్పు చేసి కనుమరుగైన స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే..!